టొరంటోలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు | Bathukamma celebrations held in Canada | Sakshi
Sakshi News home page

టొరంటోలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

Published Tue, Oct 16 2018 2:03 PM | Last Updated on Tue, Oct 16 2018 2:05 PM

Bathukamma celebrations held in Canada - Sakshi

టొరంటో : తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో గ్రేటర్ టొరంటోలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. లింకన్ అలెగ్జాండర్‌ పాఠశాల ఆడిటోరియంలో 1000 మందికి పైగా తెలంగాణా వాసులు పాల్గొని బతుకమ్మ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడారు.

ఈ పండుగ సంబురాలు తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వర రావు చిత్తలూరి ఆధ్వర్యంలో జరుగాయి. 2018-20 కి ఎన్నికైన నూతన కమీటీలను ఈ పండుగ వేడుకలలో ప్రకటించి పరిచయం చేశారు. నూతన అధ్యక్షులుగా రమేశ్ మునుకుంట్ల, ఉపాధ్యక్షులుగా విజయకుమార్ తిరుమలాపురం, కార్యదర్శిగా శ్రీనివాస్ మన్నెం, సాంస్కృతిక కార్యదర్శిగా దీప గజవాడ, కోషాధికారిగా దామోదర్ రెడ్డి మాది, డైరక్టర్లుగా మనోహర్ భొగా, శ్రీనివాస్ చంద్ర, మంగ వాసం, మూర్తి కలగోని, గణేశ్ తెరల, ట్రుస్టీ బోర్డు అధ్యక్షునిగా హరి రావుల్, ట్రస్టీలుగా సురేశ్ కైరోజు, వేణుగోపాల్ రెడ్డి ఏళ్ళ, కిరన్ కుమార్ కామిశెట్టి, నవీన్ ఆకుల ఈ సందర్భంగా ఈ సంవత్సరపు ఉత్తమ బతుకమ్మలకు బహుమతులను అందజేశారు. బతుకమ్మలను హంబర్ నదిలో నిమజ్జనం చేసి సాంప్రదాయ బద్దంగా తయరు చేసుకొని వచ్చిన ఫలహారాలను ఆరగించారు. మహిళలు గౌరమ్మ పసుపు కుంకుమలను పంచుకున్నారు. చివరగా  ఉపాధ్యక్షులు రాజేశ్వర్ ఈద, విజయకుమార్ తిరుమలాపురం సాంస్కృతిక కార్యదర్శి వందన సమర్పణతో బతుకమ్మ ఉత్సవాలు ముగిశాయి.

తెలంగాణ కెనడా అసోసియేషన్ ఫౌండేషన్ కమీటీ అధ్యక్షులు దేవెందర్ రెడ్డి గుజ్జుల, ట్రుస్టీ బోర్డు అధ్యక్షులు ప్రభాకర్ కంబాలపల్లి, ఉపాధ్యక్షులు రాజేశ్వర్ ఈద, కార్యదర్షి రాధిక బెజ్జంకి, కోషాధికారి సంతోష్ గజవాడ, సాంస్కృతిక కార్యదర్షి విజయ్ కుమార్ తిరుమలాపురం, డైరక్టర్లు శ్రీనివాస్ మన్నెం, భారతి కైరొజు, మురళి కాందివనం, ట్రుస్టీ సభ్యులు శ్రీనివాసు తిరునగరి, సమ్మయ్య వాసం, అథీక్ పాష, ఫౌండర్లు రమేశ్ మునుకుంట్ల, చంద్ర స్వర్గం, శ్రీనాధ్ రెడ్డి కుందూరి, అఖిలేశ్ బెజ్జంకి, కలీముద్దిన్, వేణుగోపాల్ రోకండ్ల,  హరి రావుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement