Toronto city
-
సెప్టెంబరులో టొరంటో వేదికగా తెలుగు సాహితి సదస్సు
కెనడా ప్రధాన కేంద్రంగా టొరంటోలో జరుగుతున్న మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు , 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సుa నిర్వహాణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. 2021 సెప్టెంబరు 25, 26 తేదిల్లో వర్చువల్‌గా ఈ సదస్సు జరుగుతుందని కెనడా తెలుగు సంఘాల ఐక్యవేదిక తెలిపింది. కెనడాలో ఉన్న ఎనిమిది తెలుగు సంఘాలు సంయక్తంగా ఈ సాహితి సదస్సును నిర్వహిస్తున్నాయి. ఈ సాహితి సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే వందకు పైగా ఎంట్రీలు వచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. వీరందరికి అవకాశం కలిగించడానికి సదస్సును రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రతీ రోజు ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 7:00 గంటల దాకా (EST, Toronto Time) మొత్తం 20 గంటలకి పైగా ఈ సదస్సు జరుగుతుందని వెల్లడించారు చదవండి :డెట్రాయిట్లో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోర్డు సమావేశం -
కెనడాలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
టొరొంటో : తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో కెనడాలో గ్రేటర్ టోరొంటోలోని పోర్టుక్రెడిట్ సెకండరి పాఠశాల ఆడిటోరియంలో సంక్రాతి వేడుకలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి పండుగ, తీన్మార్ సాంస్కృతిక ఉత్సవాల్లో 800 మందికి పైగా ప్రవాస తెలంగాణా వాసులు పాల్గొన్నారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు రమేశ్ మునుకుంట్ల ఆధ్వర్యంలో ఈ పండుగ సంబురాలు జరిగాయి. తెలంగాణ కెనడా అసోసియేషన్ ఫౌండేషన్ కమీటీ అధ్యక్షులు శ్రీనివాసు తిరునగరి, ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు హరి రావుల్, ఉపాధ్యక్షులు విజయకుమార్ తిరుమలాపురం, కార్యదర్శి శ్రీనివాస్ మన్నెం, కోశాధికారి దామోదర్ రెడ్డి మాది, సాంస్కృతిక కార్యదర్శి దీప గజవాడ, డైరెక్టర్లు మనోహర్ భొగా, శ్రీనివాస్ చంద్ర, మంగ వాసం, మూర్తి కలగోని, గణేశ్ తెరాల, ట్రస్టీలు సురేశ్ కైరోజు, వేణుగోపాల్ రెడ్డి ఏళ్ళ, కిరణ్ కుమార్ కామిశెట్టి, నవీన్ ఆకుల, ఫౌండర్లు కోటేశ్వరరావు చిత్తలూరి, చంద్ర స్వర్గం, దేవేందర్ రెడ్డి గుజ్జుల, రాజేశ్వర్ ఈద, అథీక్ పాషా, ప్రభాకర్ కంబాలపల్లి, కలీముద్దిన్, వేణుగోపాల్ రోకండ్ల, సంతోష్ గజవాడ, నవీన్ సూదిరెడ్డి, ప్రకాశ్ రెడ్డి చిట్యాలలు పాల్గొన్నారు. ఈ సంక్రాంతి సంబరాలలో పిల్లలకు భోగిపండ్లు పోసి ఆశీర్వదించారు. తెలంగాణ కెనడా సంఘం నిర్వహించిన ముగ్గుల పోటీలలో మొదటి బహుమతి అనుపమ పబ్బ గెలుచుకున్నారు. సాంస్కృతిక కార్యదర్శి దీప గజవాడ, ఉపాధ్యక్షులు విజయకుమార్ తిరుమలాపురం ఆధ్వర్యంలో మూడు గంటలపాటు చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించగా సభా సమయం మొత్తానికి కుమారి మేఘ స్వర్గం, హారికలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. తెలుగు అతిథులతో కలిసి టోరొంటో సమయముతో అసోషియేషన్ 2019 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలలో తెలంగాణ కెనడా సంఘం అత్యంత రుచికరమైన భోజనాలను ఏర్పాటు చేసింది. చివరగా అధ్యక్షులు రమేశ్ మునుకుంట్ల వందన సమర్పణతో సంక్రాంతి ఉత్సవాలు ముగిశాయి. -
టొరంటోలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
టొరంటో : తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో గ్రేటర్ టొరంటోలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. లింకన్ అలెగ్జాండర్ పాఠశాల ఆడిటోరియంలో 1000 మందికి పైగా తెలంగాణా వాసులు పాల్గొని బతుకమ్మ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడారు. ఈ పండుగ సంబురాలు తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వర రావు చిత్తలూరి ఆధ్వర్యంలో జరుగాయి. 2018-20 కి ఎన్నికైన నూతన కమీటీలను ఈ పండుగ వేడుకలలో ప్రకటించి పరిచయం చేశారు. నూతన అధ్యక్షులుగా రమేశ్ మునుకుంట్ల, ఉపాధ్యక్షులుగా విజయకుమార్ తిరుమలాపురం, కార్యదర్శిగా శ్రీనివాస్ మన్నెం, సాంస్కృతిక కార్యదర్శిగా దీప గజవాడ, కోషాధికారిగా దామోదర్ రెడ్డి మాది, డైరక్టర్లుగా మనోహర్ భొగా, శ్రీనివాస్ చంద్ర, మంగ వాసం, మూర్తి కలగోని, గణేశ్ తెరల, ట్రుస్టీ బోర్డు అధ్యక్షునిగా హరి రావుల్, ట్రస్టీలుగా సురేశ్ కైరోజు, వేణుగోపాల్ రెడ్డి ఏళ్ళ, కిరన్ కుమార్ కామిశెట్టి, నవీన్ ఆకుల ఈ సందర్భంగా ఈ సంవత్సరపు ఉత్తమ బతుకమ్మలకు బహుమతులను అందజేశారు. బతుకమ్మలను హంబర్ నదిలో నిమజ్జనం చేసి సాంప్రదాయ బద్దంగా తయరు చేసుకొని వచ్చిన ఫలహారాలను ఆరగించారు. మహిళలు గౌరమ్మ పసుపు కుంకుమలను పంచుకున్నారు. చివరగా ఉపాధ్యక్షులు రాజేశ్వర్ ఈద, విజయకుమార్ తిరుమలాపురం సాంస్కృతిక కార్యదర్శి వందన సమర్పణతో బతుకమ్మ ఉత్సవాలు ముగిశాయి. తెలంగాణ కెనడా అసోసియేషన్ ఫౌండేషన్ కమీటీ అధ్యక్షులు దేవెందర్ రెడ్డి గుజ్జుల, ట్రుస్టీ బోర్డు అధ్యక్షులు ప్రభాకర్ కంబాలపల్లి, ఉపాధ్యక్షులు రాజేశ్వర్ ఈద, కార్యదర్షి రాధిక బెజ్జంకి, కోషాధికారి సంతోష్ గజవాడ, సాంస్కృతిక కార్యదర్షి విజయ్ కుమార్ తిరుమలాపురం, డైరక్టర్లు శ్రీనివాస్ మన్నెం, భారతి కైరొజు, మురళి కాందివనం, ట్రుస్టీ సభ్యులు శ్రీనివాసు తిరునగరి, సమ్మయ్య వాసం, అథీక్ పాష, ఫౌండర్లు రమేశ్ మునుకుంట్ల, చంద్ర స్వర్గం, శ్రీనాధ్ రెడ్డి కుందూరి, అఖిలేశ్ బెజ్జంకి, కలీముద్దిన్, వేణుగోపాల్ రోకండ్ల, హరి రావుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. -
టోరొంటోలో ఘనంగా బతుకమ్మ ఉత్సావాలు
టోరొంటో: టోరొంటోలో తెలంగాణ వాసులు బతుకమ్మ ఉత్సావాలను ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ కెనడా సంఘం, జాగృతి కెనడా సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉత్సావాలు జరిగాయి. సెప్టెంబర్ 23(శనివారం) టోరొంటోలోని లింకన్ అలక్జెండర్ పాఠశాల ఆడిటోరియంలో దాదాపుగా 650 మంది ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. మహిళలు సంప్రదాయ దుస్తులతో బతుకమ్మ ఆటలు ఆడుతూ పాటలు పాడుకున్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత నాలుగో బతుకమ్మ కావడంతో అందరూ పండుగను అత్యంత సంబురంగా జరుపుకున్నారు. బతుకమ్మలను నేగలహంబర్నదిలో నిమజ్జనం చేశారు. మహిళలు గౌరమ్మ కుంకుమలను పంచుకోవడంతో బతుకమ్మ ఉత్సావాలు ముగిసాయి. ఈ పండుగ సంబురాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వర రావు చిత్తలూరి, తెలంగాణ జాగృతి అధ్యక్షులు రమేశ్ మునుకుంట్ల సమన్వయంలో జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ కెనడా అసోసియేషన్ ఫౌండేషన్ కమిటీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, ఉపాధ్యక్షులు రాజేశ్వర్ ఈద, కార్యదర్శి రాధిక బెజ్జంకి, కోషాధికారి సంతోష్ గజవాడ, సాంస్కృతిక కార్యదర్శి విజయ్ కుమార్ తిరుమలాపురం, డైరెక్టర్లు శ్రీనివాస్ మన్నెం, మల్లికార్జున మదపు, భారతి కైరొజు, మురళి కాందివనం, దామోదర్ రెడ్డి మాధి,ట్రస్టీ సభ్యులు శ్రీనివాసులు తిరునగరి, సమ్మయ్య వాసం, అదీక్పాష, ఫౌండర్లు చంద్ర స్వర్గం నాధ్కుందూరి, అఖిలేశ్ బెజ్జంకి, కలీముద్దిన్, వేణుగోపాల్ రోకండ్ల, హరి రావుల్, జాగృతి కెనడా ఉపాధ్యక్షులు చంద్ర స్వర్గం, కార్యదర్శి ప్రసన్నకుమార్ తిరుచిరాపల్లి, మహిళా అధ్యక్షురాలు శోభారావుపీచర, జాగృతి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గౌతం కొల్లూరి, ప్రభాకర్ తూములు పాల్గొన్నారు -
ఉత్తమ పోషకాహారం@ ఇంటిపంట!
ఇది కెనడాలోని టొరొంటో నగరంలో ఆకాశ హర్మ్యంపైన సాగవుతున్న ‘ఇంటిపంట’ల దృశ్యం. ఉత్తర అమెరికా నగరాల్లో రూఫ్‌టాప్ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకోవడం అనేది ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. భవంతుల రూపశిల్పులు రూఫ్‌టాప్ గార్డెన్లకు అధిక ప్రాధాన్యం ఇస్తుండడం విశేషం. స్థానికంగా పండించిన ఆహారాన్నే తినాలనే స్పృహ నగరవాసుల్లో పెరుగుతున్నకొద్దీ టైలన్నీ కిచెన్ గార్డెన్లతో నిండిపోతున్నాయి. భవంతులే కాదు స్టార్ హోటళ్లు కూడా ఇంటిపంటలపై ఆసక్తి చూపుతున్నాయి. కస్టమర్లకు ఔషధ విలువలున్న తాజా ఆహారాన్ని అందిస్తున్నాయి. టొరొంటోలోని చరిత్రాత్మక ఫెయిర్మోన్ట్ రాయల్ యోర్క్ హోటల్ చీఫ్ చెఫ్ కొల్లిన్ థార్న్టన్ రోజూ తమ అతిథులకు వడ్డించడానికి టై మీదికొచ్చి తాజా ఆకుకూరలను కత్తిరిస్తుంటారు. ‘పంటను నా చేతులతో కత్తిరించి.. గంట గడవకముందే వండి వడ్డించడం’ ఎంతో ఉత్సాహకరంగా ఉంద’ని అంటున్నారు. సేంద్రియ ఇంటిపంటల నుంచి వచ్చే ఆహారోత్పత్తులను అత్యధిక నాణ్యమైనవిగా తాము పరిగణిస్తున్నామని నార్త్ అమెరికాకు చెందిన గ్రీన్ రూఫ్స్ ఫర్ హెల్దీ సిటీస్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు స్టీవెన్ పెక్ అంటున్నారు. ‘నగరాల్లో ఇంటిపంటలపై ఆసక్తిని పెంచుతున్న ఈ ధోరణి వ్యవసాయదారుల పనిలో గొప్పతనాన్ని ప్రశంసిస్తున్నట్లుగా ఉంది. అంతేకాకుండా, ఆహారోత్పత్తి ప్రక్రియలో నగరవాసులు తమ వంతు పాత్రను పోషిస్తున్నట్లుగా కూడా ఉందని’ అని న్యూయార్క్‌లో అర్బన్ అగ్రికల్చర్ కన్సల్టెంట్ హెన్ర గోర్డొన్ స్మిత్ అన్నారు. ‘మా తరానికి ప్రకృతితో సంబంధం తెగిపోయింది. ప్రకృతితో తిరిగి మమేకం కావడానికి తిరిగి గ్రామాలకు వెళ్లక్కర్లేదు. నగరాల్లో మేడలపైనే ఇంటిపంటలు పండించుకుంటే చాల’ని స్మిత్ వ్యాఖ్యానించారు. టైల మీద గ్రీన్‌హౌస్‌లు ఏర్పాటు చేసి వాణిజ్య సరళిలో సలాడ్ లీవ్స్, ఆకుకూరలు, టమాటోలు.. సాగు చేసే అర్బన్ అగ్రికల్చర్ సంస్థలు సయితం ప్రపంచవ్యాప్తంగా పుట్టుకొస్తున్నాయి. మహానగరాల్లో మేడలపైన ఖాళీ స్థలాల్లో సేంద్రియ ఇంటిపంటల సాగు ఒక హాబీగానో, పచ్చదనం కోసమనో మాత్రమే కాకుండా ఔషధ విలువలు కలిగిన ఉత్తమ పోషకాహారానికి ముఖ్య అందుబాటు వనరుగా గుర్తింపు పొందుతుండడం శుభసూచకం.