టోరొంటో: టోరొంటోలో తెలంగాణ వాసులు బతుకమ్మ ఉత్సావాలను ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ కెనడా సంఘం, జాగృతి కెనడా సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉత్సావాలు జరిగాయి. సెప్టెంబర్ 23(శనివారం) టోరొంటోలోని లింకన్ అలక్జెండర్ పాఠశాల ఆడిటోరియంలో దాదాపుగా 650 మంది ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. మహిళలు సంప్రదాయ దుస్తులతో బతుకమ్మ ఆటలు ఆడుతూ పాటలు పాడుకున్నారు.
రాష్ట్రం ఏర్పాటు తర్వాత నాలుగో బతుకమ్మ కావడంతో అందరూ పండుగను అత్యంత సంబురంగా జరుపుకున్నారు. బతుకమ్మలను నేగలహంబర్నదిలో నిమజ్జనం చేశారు. మహిళలు గౌరమ్మ కుంకుమలను పంచుకోవడంతో బతుకమ్మ ఉత్సావాలు ముగిసాయి. ఈ పండుగ సంబురాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వర రావు చిత్తలూరి, తెలంగాణ జాగృతి అధ్యక్షులు రమేశ్ మునుకుంట్ల సమన్వయంలో జరిగింది.
ఈ సమావేశంలో తెలంగాణ కెనడా అసోసియేషన్ ఫౌండేషన్ కమిటీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, ఉపాధ్యక్షులు రాజేశ్వర్ ఈద, కార్యదర్శి రాధిక బెజ్జంకి, కోషాధికారి సంతోష్ గజవాడ, సాంస్కృతిక కార్యదర్శి విజయ్ కుమార్ తిరుమలాపురం, డైరెక్టర్లు శ్రీనివాస్ మన్నెం, మల్లికార్జున మదపు, భారతి కైరొజు, మురళి కాందివనం, దామోదర్ రెడ్డి మాధి,ట్రస్టీ సభ్యులు శ్రీనివాసులు తిరునగరి, సమ్మయ్య వాసం, అదీక్పాష, ఫౌండర్లు చంద్ర స్వర్గం నాధ్కుందూరి, అఖిలేశ్ బెజ్జంకి, కలీముద్దిన్, వేణుగోపాల్ రోకండ్ల, హరి రావుల్, జాగృతి కెనడా ఉపాధ్యక్షులు చంద్ర స్వర్గం, కార్యదర్శి ప్రసన్నకుమార్ తిరుచిరాపల్లి, మహిళా అధ్యక్షురాలు శోభారావుపీచర, జాగృతి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గౌతం కొల్లూరి, ప్రభాకర్ తూములు పాల్గొన్నారు
టోరొంటోలో ఘనంగా బతుకమ్మ ఉత్సావాలు
Published Thu, Sep 28 2017 10:42 PM | Last Updated on Thu, Sep 28 2017 10:49 PM
Advertisement
Advertisement