కొపెన్‌హెగెన్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్ (టాడ్) ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను తెలంగాణ సాంస్కృతిక సంబరాల పేరిట ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. సంస్కృతిక కార్యక్రమాలతో పాటూ బోర్డు సభ్యులు చేసిన నాటిక అందరిని ఆకట్టుకుంది. డెన్మార్క్‌లోని ప్రముఖ గాయని నబనిత పాడిన పాటలు అతిథులను అలరించాయి.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ప్రతి సంవత్సరం నిర్వహించే ఏకైక అసోసియేషన్ టాడ్ అని అధ్యక్షుడు సామ సతీష్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్ తెలంగాణ పండగలతో పాటూ, డెన్మార్క్‌లోని భారతీయులు ఎదుర్కొంటున్న ఇమిగ్రేషన్ సమస్యలపై నిత్యం స్పందిస్తూ అందరి ఆదరణ పొందిందన్నారు. ఈ కార్యక్రమంలో టాడ్ బోర్డు సభ్యులు సంగమేశ్వర్ రెడ్డి, రమేష్ పగిల్ల, జయచందర్ రెడ్డి, వెంకటేష్, రాజారెడ్డి, దాము లట్టుపల్లి, రంజిత్, జగదీష్, ఉపేందర్, శివ సాగర్, రఘు, కరుణాకర్, రాజు ముచంతుల, వాసు, నర్మద, ఉష, ప్రీమియం సభ్యుల సహకారంతో నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment