
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ వేడుకలకు రాష్ట్రం ముస్తాబవుతోంది. జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుగనున్న విషయం తెలిసిందే. దీని కోసం రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం పబ్లిక్ గార్డెన్‌లోని జూబ్లీహాల్ ఎదురుగా ఉన్న గార్డెన్‌ను మంత్రి పరిశీలించారు. అవతరణ వేడుకల ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆంద్రప్రదేశ్ ఏర్పడి నాడు ఎక్కడైతే వేడుకలు జరిగాయో అక్కడే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరగాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ‘‘ చరిత్రలో నిచిపోయే విధంగా ఆవిర్భావ వేడుకలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆనాటి ఆంద్రప్రదేశ్ ఏర్పడిన నాడు జూబ్లీహిల్స్ పరిసరాల్లో ఉత్సవాలు జరిపారు. ఆనాటి నిజాం తెలంగాణ ప్రజల చెమట రక్తంతో కట్టిన ఆనవాళ్ళు జూబ్లీహాల్ పరిసరాల్లో ఉన్నాయి. వాటన్నింటిని మర్చిపోయే విధంగా వేడుకలు జరగాలి. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు తెలంగాణ ప్రజలకు అందబోతున్నాయి. అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు అందుతున్నాయి.. ప్రతి ఆవిర్భావం దినోత్సవానికి అనేక పథకాలను ప్రజలకు చేరుస్తున్నాం.’’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment