సాక్షి, మునిపల్లి: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంగారెడ్డి జిల్లా చిన్న చల్మెడలో సంగమేశ్వర ఎత్తిపోత పథకానికి మంత్రి హరీశ్‌రావు భూమిపూజ చేశారు. రూ.2,653కోట్లతో దీన్ని నిర్మించనున్నారు. ఈ పథకం పూర్తయితే సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని 2.19లక్షల ఎకరాలను సాగునీరు అందనుంది. ఈ ఎత్తిపోతల పథకానికి కాళేశ్వరం నుంచి 12 టీఎంసీల నీటిని ప్రభుత్వం కేటాయించింది.
మరోవైపు తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా మంత్రి హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
‘నాడు ఎటు చూసినా తడారిన నేలలు..
నేడు ఎటు చూసినా పరవళ్ళు తొక్కుతున్న గోదారి.
నాడు ఎటుచూసినా నోళ్లు తెరచిన బీళ్లు..
నేడు తలలూపుతున్న ఆకుపచ్చని పైర్లు.
ఇది తెలంగాణ జలవిజయం..
కేసీఆర్ సాధించిన ఘన విజయం.
మండుటెండల్లో తడలు గొడుతున్న చెరువులు..
ఊటలు జాలువారుతున్న వాగులు..
పాతళగంగమ్మ పైపైకి ఎగదన్నుతున్న జలదృశ్యాలు.
ఇది కదా జల తెలంగాణ..
ఇది కదా కోటి రతనాల మాగాణ.
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా
హృదయ పూర్వక శుభాకాంక్షలు.’ అంటూ పోస్టు చేశారు.
నాడు ఎటు చూసినా తడారిన నేలలు..
— Harish Rao Thanneeru (@BRSHarish) June 7, 2023
నేడు ఎటు చూసినా పరవళ్ళు తొక్కుతున్న గోదారి.
నాడు ఎటుచూసినా నోళ్లు తెరచిన బీళ్లు..
నేడు తలలూపుతున్న ఆకుపచ్చని పైర్లు.
ఇది తెలంగాణ జలవిజయం..
కేసీఆర్ సాధించిన ఘన విజయం.
మండుటెండల్లో తడలు గొడుతున్న చెరువులు..
ఊటలు జాలువారుతున్న వాగులు..
పాతళగంగమ్మ… pic.twitter.com/R94ozLdR8A
ఇది కూడా చదవండి: అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీ!
Comments
Please login to add a commentAdd a comment