కౌలాలంపూర్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు కౌలాలంపూర్‌లో లిటిల్ ఇండియాలోని ఎస్‌ఎమ్‌కే లా సల్లే స్కూల్ బ్రిక్ ఫీల్డ్స్‌లో మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. తెలంగాణ అమర వీరులకు నివాళులర్పించి తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో తెలంగాణ వాసులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి వెల్లివిరిసేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల ఆటా పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మలేషియా తెలంగాణ అసోసియేషన్ సుభ్యులందరికి ఫ్యామిలీ స్పోర్ట్స్ డే నిర్వహించారు . ఈ స్పోర్ట్స్ డే లో పిల్లలను, పెద్దలను పలు ఆటలు ఆడించి బహుమతులను ముఖ్య అతిథులుగా హాజరయిన టీఏఎం ప్రెసిడెంట్ డా. అచ్చయ్య కుమార్, కాంతారావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సారి రాష్ట అవతరణ దినోత్సవం రంజాన్ మాసములో వచ్చిన సందర్బంగా మతాలకు అతీతంగా ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.
మలేషియా తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ సైదం తిరుపతి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కమిటీ సభ్యులందరికి, తెలంగాణ సంస్కృతి వెల్లివిరిసేలా అడి పాడిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇఫ్తార్ వింధులో పాల్గొన్న ముస్లిం సోదరులందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. ఈ విందు హిందూ ముస్లిం ల మధ్య ఐక్యతను మరింత పెంచుతుందని అయన అన్నారు.
ఈ కార్యక్రమం లో మలేషియా తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ సైదం తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ సోపరి సత్య, ముఖ్య కార్య వర్గ సభ్యులు కనుమూరి రవి వర్మ, చిట్టి బాబు చిరుత, బూరెడ్డి మోహన్ రెడ్డి, గడ్డం రవీందర్ రెడ్డి, రమణ, రవి చంద్ర, కృష్ణ ముత్తినేని, కిరణ్మయి, మారుతీ కుర్మ, రవి ప్రసాద్ రెడ్డి, వీరవెల్లి నరేంద్ర, సత్యనారాయ రావు, అశోక్ మార్క, రాములు, అజయ్ కుమార్ గోలి, చందు, కిరణ్ గౌడ్, కార్తీక్, వెంకటేష్, నరేందర్, రవితేజ, సంతోష్,రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment