KTR and Harish Rao comments on Telangana Formation Day 2023 - Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది: హరీష్‌ రావు

Published Fri, Jun 2 2023 10:05 AM | Last Updated on Fri, Jun 2 2023 11:01 AM

KTR And Comments On Telangana Formation Day - Sakshi

సాక్షి, సిరిసిల్ల: తెలంగాణవ్యాప్తంగా నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్‌ సిరిసిల్లలో ఆవిర్బావ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం, కేటీఆర్‌ జాతీయ జెండా ఎగురవేశారు. 

ఈ కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘పదేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాం. మిషన్‌ భగీరథతో ప్రతీ ఇంటికీ తాగునీరు అందించాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ హరితహారం కార్యక్రమం ఈ స్థాయిలో లేదు’ అని అన్నారు. 

సిద్దిపేట జిల్లాలో కలెక్టరేట్‌లో జరిగిన దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి హరీశ్‌ రావు పాల్గొన్నారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని చెప్పారు. గతంలో చెరువులు ఎండిపోయి ఉండేవని.. ఇప్పుడు నిండుగా మండుటెండల్లోనూ నిండుగా ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం యుద్ధాలు జరిగేవని.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. అంతకుముందు సిద్దిపేట పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. రంగదాంపల్లిలో అమరవీరుల స్థూపం వద్ద పూలమాలవేసి నివాళులర్పించారు. ముస్తాబాద్‌ సర్కిల్‌లోని ప్రొఫెసర్ జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.

ఇది కూడా చదవండి: ‘తెలంగాణ కోసం సుష్మాస్వరాజ్‌ పోరాడారు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement