ఫ్లోరిడాలో ఘనంగా బోనాల సంబరాలు | Telangana Association of Florida Bonalu Celebrations in Florida | Sakshi
Sakshi News home page

ఫ్లోరిడాలో ఘనంగా బోనాల సంబరాలు

Published Sat, Aug 4 2018 12:27 PM | Last Updated on Sat, Aug 4 2018 1:03 PM

Telangana Association of Florida Bonalu Celebrations in Florida - Sakshi

ఫ్లోరిడా : తెలంగాణా అసోసియేషన్ అఫ్ ఫ్లోరిడా ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను మియామీ సీబీ స్మిత్‌ పార్క్‌లో ఘనంగా నిర్వహించారు. వేదపండితులు పూజలు జరిపి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. గుమ్మకొండా రెడ్డి ఫౌండేషన్ ఫౌండర్ శేఖర్ రెడ్డి, శైలజ రెడ్డిలు వందలాది మంది స్థానికుల సహకారంతో మేళ తాళాలు, తీన్మార్ డాన్సులతో అత్యంత వైభవంగా బోనాలను ఊరేగించారు. పిల్లల కోసం నిర్వాహకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోనీ రైడ్స్ కార్యక్రమం ఆకర్షణగా నిలిచింది.

బోనాలు పండుగ జీవ వైవిధ్యాన్ని సూచిస్తుందని అధ్యక్షులు చందు తాళ్ల పేర్కొన్నారు. తెలంగాణా సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని, ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా కలుసుకోవడానికి తోడ్పడుతుందన్నారు. అంతే కాకుండా మహిళా సాధికారతకు కూడా బోనాలు పండుగ అనేది చిహ్నంగ ఉపయోగపడుతుందని తెలిపారు. స్థానిక ఎగ్జిక్యూటివ్ కమిటి మెంబెర్ మోహిత్ కర్పూరం ఈ కార్యక్రమానికి అధ్యక్షతవహించగా, సాంసృతిక కార్యక్రమాలు స్వాతి జలగం ఆధ్వర్యంలో జరిగాయి. రాజు భాషబోయిన, ప్రతిభ రాజు ప్రాంగణాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు.

కార్యక్రమానికి తెలంగాణ అసోసియేషన్ అఫ్ ఫ్లోరిడా అధ్యక్షులు చందు తాళ్ల, మోహిత్ కర్పూరం, శేఖర్ రెడ్డి, శైలజ రెడ్డి, డా.రాజేందర్ రెడ్డి చెరుకు, దేశిక చెరుకు,శశి గుడాల, నిరుపమా రెడ్డి, శరత్ కొత్తకాపు ,శ్యామా మార్గని, వీణ తల్లా, శ్వేతా, సునీల్, రాజేందర్ రెడ్డి బెక్కరి, రాజ్ సారెడ్డి, అనిల్ ఆది, రవి అండపల్లి, లక్ష్మి కాంత్ కళ్ళం, షర్మిల, ఉపాధ్యక్షులు అవినాష్ రామ, స్వాతి జలగం, రవి వుమ్మగోని, అనిల్ బండారం, శ్రీనివాస్ గడ్డం, అశోక్ వర్ధన్, లతా రెడ్డి, సంతోష్ గూడూరు, డా. శ్రీనివాస్ దొంతినేని, నరేందర్ కొమ్మ, శ్రీనివాస్ముతినేని, వెంకట్ కంచర్ల, శ్రీకాంత్ జలగం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి లతా రెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.











No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement