బోనాలను సమర్పిస్తున్న టీటా గ్లోబల్ అధ్యక్షుడు సందీప్‌కుమార్ మక్తాల, ఐటీ ఉద్యోగులు
మాదాపూర్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రమైన టీహబ్ 2లో తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఆదివారం బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్బంగా టీటా గ్లోబల్ అధ్యక్షుడు సందీప్‌కుమార్ మక్తాల మట్లాడుతూ దేశీయ, విదేశీ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్‌గా నిలవాలని ఆకాంక్షిస్తూ 21 బోనాలను మాదాపూర్‌లోని చిన్నపెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద సమర్పించినట్లు తెలిపారు.
పోతురాజుల నృత్యాలు, తొట్టెల ఊరేగింపు, కోలాటాల మధ్య బోనాలను అమ్మవారికి సమర్పించినట్టు తెలిపారు. టీహబ్2 నుండి సైబర్ వద్ద ఉన్న దేవాలయం వరకు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ శాంతతౌటం, టీహబ్ చైర్మన్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment