లండన్ : తెలంగాణ ఎన్నారైఫోరం (టీఈఎన్‌ఎఫ్) ఆధ్వర్యంలో లండన్‌లోని క్రాన్‌ఫోర్డ్ కాలేజీలో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాలకు బ్రిటన్ నలుమూలల నుండి సుమారు 700ల మందికి పైగా ప్రవాసులు హాజరయ్యారు. ఈ వేడుకలకు తెలంగాణ నుండి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, లండన్ ఎంపీ వీరేంద్రశర్మ, సీమ మల్హోత్రా, ఏఎస్ రాజన్ ( మినిస్టర్ కోఆర్డినేషన్, ఇండియన్ హై కమిషన్), లండన్ బారౌ మేయర్ సమియా చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి ప్రచారంలో తెలంగాణ బిడ్డలు ముందు వరుసలో ఉన్నారని కొనియాడారు. మహిళా సాధికారత మాటల్లో కాకుండా ఇంటి నుండే వ్యక్తి నుండే మొదలవ్వాలని లింగ బేధం, ఆధిపత్యం లేకుండా భార్యా భర్తలు కలిసి మెలిసి సమాన నిష్పత్తిలో పని చేసినప్పుడే మహిళా సాధికారత సాధిస్తామన్నారు. లండన్ ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమా మల్హోత్రాలు మాట్లాడుతూ లండన్‌లో భారతీయ పండుగలు అంటే బోనాలు, బతుకమ్మ, దీపావళిగా పేరు సంపాదించుకున్నాయని తెలిపారు.
తెలంగాణ ఎన్నారై ఫోరమ్ అధ్యక్షులు ప్రమోద్ అంతటి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది అన్ని తెలంగాణ, తెలుగు సంఘాల ఆధ్వర్యంలో బోనాలు చేసుకొని తెలంగాణ ఐక్యత ను చాటామని తెలిపారు. తెలంగాణ ఎన్నారైఫోరాన్ని ఆధరిస్తున్న అందరికీ ఫౌండర్ చైర్మన్ గంప వేణుగోపాల్ ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ, వివిధ రంగాలకు అతీతంగా సంస్థ పని చేస్తుందని ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ తెలిపారు. భారతీయ సంస్కృతి ప్రచారంలో నిరంతరంగా శ్రమించాలని కార్యదర్శి భాస్కర్ పిట్ల ప్రవాసులను కోరారు. స్థానిక లక్ష్మీ నారాయణ గుడిలో దుర్గా మాతకు బోనం సమర్పించి, లండన్ పుర విధుల్లో 'తొట్టెలు' ఊరేగింపు చేశారు. లండన్‌లో స్థిరపడి వివిధ రంగాల్లో అగ్రగామి సాధించిన వారికి జయశంకర్ అవార్డులు ఇచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు, భరత నాట్యం, గీతాలాపన, నృత్యాలు, చిన్నారుల చేత నాట్య ప్రదర్శన, ఆధ్యాత్మిక ప్రవచనాలతో కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంలో రంగు వెంకట్, నరేష్ మర్యాల, ప్రవీణ్ రెడ్డి, మహేష్ జమ్ముల, స్వామి ఆశ, స్వామి ఆకుల, మహేష్ చిట్టె, బాల కృష్ణ రెడ్డి, శేషు అల్లా, వర్మ, సంతోష్, సాయి మార్గ్, మీనాక్షి అంతటి, వాణి అనసూరి, శ్రీవాణీ, సుచరిత, శిరీష, సవిత, రామా, ప్రియాంక, మంజుల, సీతలు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో తమ వంతు సహకరించారు.
Comments
Please login to add a commentAdd a comment