Telangana NRIs forum
-
దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ భారతదేశ గతిని మార్చగలరని, ఆయన నాయకత్వం దేశ రాజకీయాలకు అవసరమని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు, తెలంగాణీయులు తీర్మానించారు. కేసీఆర్ మార్గదర్శనంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో వెళుతోందని, దేశ రాజకీయాల్లోనూ గుణాత్మక మార్పు తెచ్చేందుకు ఆయన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించబోతుందన్న వార్తల నేపథ్యంలో ప్రవాస తెలంగాణీయుడు మహేశ్‌బిగాల ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నారైలతో ఆదివారం జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రస్థానం, స్వయం పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా రూపొందుతున్న తీరును చర్చించారు. బిగాల ప్రవేశపెట్టిన ‘దేశ రాజకీయాల్లో కేసీఆర్ నాయకత్వం అవసరం’ అనే ఏకవాక్య తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించిందని, వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులంతా ముక్తకంఠంతో కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారని తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని, ఆ మార్పు కేసీఆర్‌తోనే సాధ్యమని ఎన్నారైలు అభిప్రాయడ్డారని తెలిపాయి. ఈ సమావేశంలో పలు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ లక్ష రూపాయల విరాళం
సాక్షి, సిద్దిపేట్ : కరోనా లాక్డౌన్ కారణంగా పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ సహాయ కార్యక్రమాల్లో భాగంగా తమవంతు బాధ్యతగా తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరమ్ లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించింది. సిద్దిపేటలో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావుకి లక్ష రూపాయలు చెక్‌ను తెలంగాణ ఎన్నారై ఫోరమ్ సభ్యులు అందించారు. తెలంగాణ ప్రభుత్వానికి కరోనాపై పోరటంలో తోడ్పాటుగా తమ వంతు సహాయం చేస్తున్నామని తెలంగాణ ఎన్నారై ఫోరమ్ అధ్యక్షులు ప్రమోద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్, ఫౌండర్ వేణుగోపాల్, ఉపాధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, రంగు వెంకట్, మహేష్ జమ్మల సంయుక ప్రకటనలో తెలిపారు. దీంతో పాటు లండన్‌లో విద్యార్థులకు ఆసరాగా వివిధ తెలుగు, తెలంగాణ, సేవ సంఘాలతో ఐక్యవేదిక ద్వారా యూకేలో విమానాశ్రమంలో చిక్కున వారికి సహాయం అందిస్తున్నామన్నారు. 150 మంది విద్యార్థులకు భోజనంతోపాటూ, వసతి సౌకర్యం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. -
ఇరాక్‌లో నరకం అనుభవిస్తున్న ఇందూరు వాసులు!
సాక్షి, నిజామాబాద్: నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయిన 15 మంది నిజామాబాద్ జిల్లా వాసులు ఇరాక్‌లో చిక్కుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉపాధి కల్పిస్తానని మోసగించి వీరిని నకిలీ ఏజెంట్.. విజిట్ వీసా మీద ఇరాక్ పంపించాడు. అక్కడికి వెళ్లిన తర్వాత తాము మోసపోయిన విషయాన్ని గుర్తించిన బాధితులు.. గత నాలుగున్నర నెలలుగా ఓ చిన్న గదిలో ఉంటూ.. స్వదేశానికి ఎలా చేరుకోవాలో తెలియక నరకం అనుభవిస్తున్నారు. ఏజెంట్ చేతిలో మోసపోయి ఇరాక్‌లో చిక్కుకుపోయిన నిజామాబాద్ జిల్లా వాసులను ఆదుకోవాలని, వారిని తిరిగి స్వస్థలానికి రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం ప్రతినిధి బసంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బాధితులను మోసగించిన నకిలీ ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
లండన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
లండన్ : తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యంలో లండన్‌లో ఘనంగా మెగా బతుకమ్మ నిర్వహించారు. యూరోప్‌లోనే అతిపెద్ద బతుకమ్మ పండగను లండన్‌లో నిర్వహించారు. దాదాపు 2500 మంది బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. మొదట అమ్మవారి పూజతో ప్రారంభమైంది. యువతులు, మహిళలు బతుకమ్మ ఆట, కట్టే కోలాటం ఆడారు. సాంప్రదాయక బతుకమ్మ ఆటనే ప్రోత్సహించడానికి నూతన పోకడలకు, డీజేల జోలికి వెళ్లకుండా పూర్తి స్థాయిలో సాంప్రదాయ బద్దంగా బతుకమ్మను నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయాలు కాపాడవలసిన బాధ్యత ఎన్నారైల పైన ఉందని, 6 ఏళ్లుగా బతుకమ్మ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసినందుకు తెలంగాణకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఎన్నారై ఫోరమ్ అధ్యక్షుడు ప్రమోద్ గౌడ్ అంతటి మాట్లాడుతూ యూరోప్‌లోనే అతి పెద్ద బతుకమ్మ నిర్వహణ బాధ్యతకు సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. యూరోప్‌లోనే మొట్ట మొదటి బతుకమ్మకు పునాదులు వేసి నిర్వహించిన తెలంగాణ ఎన్నారై ఫోరమ్ వ్యవస్థాపకులు గంప వేణుగోపాల్ ను అభినందించారు. 2010లో నిర్వహణ ఎలా చేయాలో ఎక్కడ చేయాలో ఆర్ధిక వనరులు ఎలా సమకూర్చాలో తెలియని సమయంలో గంప వేణుగోపాల్ చేసిన కృషి మరచిపోలేనిదని పేర్కొన్నారు. 2012లో బ్రిటన్ లో వివిధ ప్రాంతాల్లో ఊరూరా బతుకమ్మ నిర్వహించి బతుకమ్మ భావజాలాన్ని చాటుతూ ప్రతి తెలంగాణ బిడ్డ బతుకమ్మ ఆటలో పాల్గొనే స్థాయికి చేరుకుందని అన్నారు. ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ గత ఏడాది అతిపెద్ద బతుకమ్మ నిర్వహించి మళ్లీ ఇప్పుడు కూడా అతిపెద్ద బతుకమ్మ నిర్వహించి చరిత్ర సృష్టించిన ఘనత మహిళలదేనని అన్నారు. మహిళా విభాగం మీనా అంతరి, వాణి అనసూరి, శౌరి గౌడ్, సాయి లక్ష్మి, మంజుల పిట్ల, జయశ్రీ, శ్రీవాణి మార్గ్, సవిత జమ్మల, దివ్యా, అమృత, సీతాలత, నీరజ, వీణ మ్యాన, కారుణ్య, ఉష రమా లు బతుకమ్మనిర్వహణలో కీలకపాత్ర పోషించారు. వ్యవస్థాపక చైర్మన్ గంప వేణుగోపాల్, కోర్ సభ్యులు రంగు వెంకట్, ప్రవీణ్ రెడ్డి, నరేష్ మల్యాల, కార్యదర్శి పిట్ల భాస్కర్, అడ్వైజరి సభ్యులు డా శ్రీనివాస్, మహేష్ జమ్ముల, వెంకట్ స్వామి, బాలకృష్ణ రెడ్డి, మహేష్ చాట్ల, శేషు అల్లా, వర్మా, స్వామి ఆశా, అశోక్ మేడిశెట్టి, సాయి మార్గ్, వాసిరెడ్డి సతీష్ రాజు కొయ్యడలు బతుకమ్మ వేడుకలను విజయవంతంగా నిర్వహించడంలో తమవంతు సహాయ సహకారాలు అందించారు. -
లండన్‌లో ఘనంగా బోనాల జాతర
లండన్ : తెలంగాణ ఎన్నారైఫోరం (టీఈఎన్ఎఫ్) ఆధ్వర్యంలో లండన్‌లోని క్రాన్ఫోర్డ్ కాలేజీలో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాలకు బ్రిటన్ నలుమూలల నుండి సుమారు 700ల మందికి పైగా ప్రవాసులు హాజరయ్యారు. ఈ వేడుకలకు తెలంగాణ నుండి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, లండన్ ఎంపీ వీరేంద్రశర్మ, సీమ మల్హోత్రా, ఏఎస్ రాజన్ ( మినిస్టర్ కోఆర్డినేషన్, ఇండియన్ హై కమిషన్), లండన్ బారౌ మేయర్ సమియా చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి ప్రచారంలో తెలంగాణ బిడ్డలు ముందు వరుసలో ఉన్నారని కొనియాడారు. మహిళా సాధికారత మాటల్లో కాకుండా ఇంటి నుండే వ్యక్తి నుండే మొదలవ్వాలని లింగ బేధం, ఆధిపత్యం లేకుండా భార్యా భర్తలు కలిసి మెలిసి సమాన నిష్పత్తిలో పని చేసినప్పుడే మహిళా సాధికారత సాధిస్తామన్నారు. లండన్ ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమా మల్హోత్రాలు మాట్లాడుతూ లండన్‌లో భారతీయ పండుగలు అంటే బోనాలు, బతుకమ్మ, దీపావళిగా పేరు సంపాదించుకున్నాయని తెలిపారు. తెలంగాణ ఎన్నారై ఫోరమ్ అధ్యక్షులు ప్రమోద్ అంతటి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది అన్ని తెలంగాణ, తెలుగు సంఘాల ఆధ్వర్యంలో బోనాలు చేసుకొని తెలంగాణ ఐక్యత ను చాటామని తెలిపారు. తెలంగాణ ఎన్నారైఫోరాన్ని ఆధరిస్తున్న అందరికీ ఫౌండర్ చైర్మన్ గంప వేణుగోపాల్ ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ, వివిధ రంగాలకు అతీతంగా సంస్థ పని చేస్తుందని ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ తెలిపారు. భారతీయ సంస్కృతి ప్రచారంలో నిరంతరంగా శ్రమించాలని కార్యదర్శి భాస్కర్ పిట్ల ప్రవాసులను కోరారు. స్థానిక లక్ష్మీ నారాయణ గుడిలో దుర్గా మాతకు బోనం సమర్పించి, లండన్ పుర విధుల్లో 'తొట్టెలు' ఊరేగింపు చేశారు. లండన్‌లో స్థిరపడి వివిధ రంగాల్లో అగ్రగామి సాధించిన వారికి జయశంకర్ అవార్డులు ఇచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు, భరత నాట్యం, గీతాలాపన, నృత్యాలు, చిన్నారుల చేత నాట్య ప్రదర్శన, ఆధ్యాత్మిక ప్రవచనాలతో కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంలో రంగు వెంకట్, నరేష్ మర్యాల, ప్రవీణ్ రెడ్డి, మహేష్ జమ్ముల, స్వామి ఆశ, స్వామి ఆకుల, మహేష్ చిట్టె, బాల కృష్ణ రెడ్డి, శేషు అల్లా, వర్మ, సంతోష్, సాయి మార్గ్, మీనాక్షి అంతటి, వాణి అనసూరి, శ్రీవాణీ, సుచరిత, శిరీష, సవిత, రామా, ప్రియాంక, మంజుల, సీతలు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో తమ వంతు సహకరించారు. -
టాటా.. తెలంగాణ సేవల కోట
'తెలుగు కళల తోట.. తెలంగాణ సేవల కోట' నినాదంతో ఏర్పాటయిన టాటా (తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ తెలుగు ఇన్ అమెరికా) ఇటు అమెరికాలోనే కాకుండా అటు తెలంగాణలో తనదైన శైలిలో అనేక కార్యక్రమాలతో దూసుకుపోతోంది. 2015, ఏప్రిల్ 5న ఈ తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రారంభోత్సవానికి యూఎస్ లోని వివిధ రాష్ట్రాలనుంచి మూడు వేలమంది తెలంగాణ ఎన్నారైలు హాజరైనట్లు ఫోరం అధ్యక్షుడు పైళ్ల మల్లారెడ్డి తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై తెలంగాణ ఫోరం ఆవశ్యకతను మరోసారి గుర్తుచేసి, శుభాభినందనలు తెలియజేశారు. టాటా వ్యవస్థాపకుడు పైళ్ల మల్లారెడ్డి అధ్యక్షత వహిస్తున్న కమిటీలో మహేందర్ ముసుగు, శ్రీనివాస్ అనుగు, డాక్టర్ సాంబ రెడ్డి, డాక్టర్ మోహన్ పటలోళ్ల, బల్వంత్ రెడ్డి, రమేశ్ చంద్ర, సంతోశ్ పాతూరి, భరత్ మదాడి, విక్రం జంగం, గౌతం గోలి, అనిల్ అర్రెబెల్లి సభ్యులుగా ఉన్నారు. ఈ సందర్భంగా టాటా చేపడుతున్న, చేపట్టబోయే కార్యక్రమాలను అసోసియేషన్ అధ్యక్షుడు పైళ్ల మల్లారెడ్డి వివరించారు. చెరువుల పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మిషన్ కాకతీయకు తనవంతుగా రూ. 40 లక్షల విరాళాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. వరంగల్ కు చెందిన సుధాకర్ విదియాల రూ. 10 లక్షలు, టాటా ద్వారా మరో రూఏ.10 లక్షలు.. మొత్తం రూ.60 లక్షల విరాళాన్ని మిషన్ కాకతీయకు అందించనున్నట్లు చెప్పారు. ప్రముఖ కవి గోరటి వెంకన్న, హాస్య నటుడు, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి, మిమిక్రీ రమేశ్, రేవంత్, లిప్సిక, అనుదీప్, ఆదర్శిణి, హనిష్క, యాంకర్లు అనసూయ, రవి తదితరులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.