కన్నీరుమున్నీరవుతున్న బాధితుల కుటుంబసభ్యులు
సాక్షి, నిజామాబాద్: నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయిన 15 మంది నిజామాబాద్ జిల్లా వాసులు ఇరాక్‌లో చిక్కుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉపాధి కల్పిస్తానని మోసగించి వీరిని నకిలీ ఏజెంట్.. విజిట్ వీసా మీద ఇరాక్ పంపించాడు. అక్కడికి వెళ్లిన తర్వాత తాము మోసపోయిన విషయాన్ని గుర్తించిన బాధితులు.. గత నాలుగున్నర నెలలుగా ఓ చిన్న గదిలో ఉంటూ.. స్వదేశానికి ఎలా చేరుకోవాలో తెలియక నరకం అనుభవిస్తున్నారు. ఏజెంట్ చేతిలో మోసపోయి ఇరాక్‌లో చిక్కుకుపోయిన నిజామాబాద్ జిల్లా వాసులను ఆదుకోవాలని, వారిని తిరిగి స్వస్థలానికి రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం ప్రతినిధి బసంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బాధితులను మోసగించిన నకిలీ ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment