సాక్షి, సిద్దిపేట్ : కరోనా లాక్‌డౌన్ కారణంగా పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ సహాయ కార్యక్రమాల్లో భాగంగా తమవంతు బాధ్యతగా తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్ లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించింది. సిద్దిపేటలో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావుకి లక్ష రూపాయలు చెక్‌ను తెలంగాణ ఎన్నారై ఫోరమ్ సభ్యులు అందించారు. తెలంగాణ ప్రభుత్వానికి కరోనాపై పోరటంలో తోడ్పాటుగా తమ వంతు సహాయం చేస్తున్నామని తెలంగాణ ఎన్నారై ఫోరమ్ అధ్యక్షులు ప్రమోద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్, ఫౌండర్ వేణుగోపాల్, ఉపాధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, రంగు వెంకట్, మహేష్ జమ్మల సంయుక ప్రకటనలో తెలిపారు.
దీంతో పాటు లండన్‌లో విద్యార్థులకు ఆసరాగా వివిధ తెలుగు, తెలంగాణ, సేవ సంఘాలతో ఐక్యవేదిక ద్వారా యూకేలో విమానాశ్రమంలో చిక్కున వారికి సహాయం అందిస్తున్నామన్నారు. 150 మంది విద్యార్థులకు భోజనంతోపాటూ, వసతి సౌకర్యం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు.
తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్ లక్ష రూపాయల విరాళం
Published Tue, Apr 28 2020 6:32 PM | Last Updated on Tue, Apr 28 2020 6:34 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment