ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో వాసవీ మాత అగ్నిప్రవేశ దినోత్సవ వేడుకలు | Vasavi Mata Agnipravesha Day celebrations in Dublin Ireland | Sakshi
Sakshi News home page

ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో వాసవీ మాత అగ్నిప్రవేశ దినోత్సవ వేడుకలు

Published Sat, Feb 1 2025 10:42 AM | Last Updated on Sat, Feb 1 2025 10:52 AM

Vasavi Mata Agnipravesha Day celebrations in Dublin Ireland

శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, ఆర్తజన బాంధవి, ఆశ్రీతకల్పవల్లి, లలితా పరాభట్టారిక స్వరూపిణి అయిన  శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అగ్నిప్రవేశ దినోత్సవాన్ని  పురస్కరించుకొని మాఘ శుద్ధ విదియ రోజు   వేడుకలు ఘనంగా జరిగాయి.

వందమందికి పైగా వాసవి మాత భక్తులు ,కార్యక్రమ నిర్వాహక  సభ్యులు, స్థానిక VHCCI ఆలయానికి చేరుకొని అక్కడ మొదటగా విశ్వశాంతి కొరకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి హోమము,  అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. వివిధరకాల పుష్పాలతో  అమ్మవార్ని అలంకరించారు. పల్లకి సేవ అనంతరం అమ్మవారికి షోడశోపచార పూజలు, అష్టోత్తరం,  లలిత సహస్రనామ పఠనము,  సామూహిక కుంకుమార్చన, మహా మంగళహారతి  నిర్వహించారు.

హాజరైన భక్తులందరికీ ఆంధ్రాభవన్, ఇండియన్ వైబ్, తాలి రెస్టారెంట్,  రుచి రెస్టారెంట్స్ నుండి రుచికరమైన నోరూరించే వంటకాలతో అందరికి బోజనాలను వడ్డించారు.  

కార్యక్రమానికి ముఖ్య ఉభయదారులుగా దాతలు శ్రీనివాస్ వెచ్చ, శిరీష, సంతోష్ కుమార్ పారేపల్లి, శ్రీనివాస్ సూడా, శృతి ముత్తుకుమార్, బాలాజీ జ్యోత్స్నా, రేణుక దినేష్, నితేశ్ గుప్తా, రఘు వల్లంకొండ, ప్రవీణ్ మదిరే, వెంకట్ జూలూరి లకు కార్యక్రమ నిర్వాహక సభ్యులు, కార్యక్రమ పురోహితులు సాయి ప్రజ్వల్ ద్వారా సత్కరించి అందరికి పేరు పేరునా కృతఙ్ఞతలు తెలియజేసారు. తరువాత అమ్మవారి అలంకరణ, పుష్పాలంకరణ సేవకు కృషిచేసిన సభ్యుల్లో కావ్య , దివ్య , లావణ్య, , రేణుక మరియు శిరీష  తదితరులకు కార్యక్రమ నిర్వాహక సభ్యులు  ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు.

తరువాత కార్యక్రమంలో నిర్వాహక సభ్యులైన నవీన్ సంతోష్, నరేంద్ర, భార్గవ్, శ్రీనివాస్ వెచ్చ మరియు మాణిక్ అందరు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మరెన్నో జరగాలని కోరుకున్నారు. చివరిగా ఆలయ సభ్యులైన రమణ, సాగర్ తదితరులకు సభ్యులందరు కృతఙ్ఞతలు తెలియజేసారు, నిర్వాహక సభ్యులతో  పాటుగా సేవాదళ్ సభ్యుల్లో ముఖ్యంగా సంతోష్, సాయి తేజ, సందీప్, ప్రఫుల్ల, సుధీర్, సంపత్  తదితరులు చురుగ్గా పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement