
పెద్దమ్మతల్లి గుడి వద్దకు బోనాలతో వెళ్తున్న మహిళలు
స్టేషన్‌ఘన్‌పూర్ : జనగామ జిల్లాలోని పలు ప్రాంతా ల్లో బుధవారం పోచమ్మ, పెద్దమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు. పోచమ్మ తల్లి గుడి వద్ద మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం మహిళలందరూ సామూహికంగా డప్పు చప్పుళ్లతో పోచమ్మ గుడి వద్దకు సంప్రదాయబద్ధంగా బోనాలతో వెళ్లి మొక్కులు సమర్పించారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని ఛాగల్లులో పోచమ్మ గుడి చుట్టూ ఎడ్లబండ్లను ఆనవాయితీ ప్రకారం తిప్పారు. డప్పు చప్పుళ్లు, డీజే పాటలు, శివసత్తుల పూనకాలు, బోనాలతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment