
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ దంపతులు అమ్మవారిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఎంపీ కవిత బంగారు బోనం సమర్పించారు. కవితకు తోడుగా 1008 బోనాలతో మహిళలు ఆదయ్య నగర్ నుంచి ఆలయం వరకు ఊరేగింపుగా కదిలారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మాదేవేందర్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌లు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు సైతం అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు.