తెలుగు భాషా ప్రాధాన్యం తగ్గిపోతున్న ఈ రోజుల్లో దేశం కాని దేశంలో తెలుగుపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. సింగపూర్ తెలుగు తోరణము అనే పేరుతో ఓ రియాలిటీ షోను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేమన, సుమతి శతకాల నీతి పద్యాల పోటీని నాలుగు వృత్తాలుగా, పది ఎపిసోడ్లుగా నిర్వహిస్తున్నారు.
20 మంది చిన్నారులు ఈ పోటీలో పాల్గొన్నారు. తెలుగు భాషాభివృద్దికి ఈ కార్యక్రమం ఒక ముందడుగులా ఉంటుందని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. అనంతరం పోటీలో పాల్గొన్న చిన్నారులకు పెద్ద బాలశిక్ష పుస్తకాన్ని అందజేశారు.
కాగా మొదటి రౌండ్ పోటీకి రాంబాబు పాతూరి, గాడేపల్లి అపర్ణ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంఘ సింగపూర్ తెలుగు టీవీ యేట్యూబ్ చానల్‌లో ప్రతి శనివారం ఒక భాగంగా మొత్తం 10 భాగాలుగా విడుదల అవుందని నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment