TCSS ఆధ్వర్యంలో ఘనంగా సింగపూర్ బోనాల జాతర | TCSS Singapore Celebrates Bonala Jatra Festival | Sakshi
Sakshi News home page

TCSS ఆధ్వర్యంలో ఘనంగా సింగపూర్ బోనాల జాతర

Published Tue, Jul 23 2024 10:38 AM | Last Updated on Tue, Jul 23 2024 11:35 AM

 Bonala Jatra is celebrated under the auspices of TCSS Singapore

‘తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)’ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండగ వేడుకలు ఆదివారం (21 జూలై 2024) మధ్యాహ్నం అత్యంత వైభవంగా జరిగాయి.  భాగ్యనగరంలో ఉజ్జయిని మహంకాళి బోనాలు జరిగిన రోజున సింగపూరులో కూడా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సభ్యులు తెలిపారు. ఈ బోనాల వేడుకలను స్థానిక ‘సుంగే కేడుట్‌’ లోని శ్రీ అరసకేసరి శివాలయంలో  ఘనంగా జరుపుకున్నారు. ఈ  బోనాల ఊరేగింపులో పోతురాజులు, పులి వేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  ఈ వేడుకల్లో సింగపూర్‌లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాకుండా..  ఇతరులు తో కలిపి సుమారు 1000 మంది వరకు భక్తులు పాల్గొన్నారు.  

బోనాల ఊరేగింపులో చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆడిపాడారు. తెలంగాణ మహిళలు భక్తి శ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ వేడుకల్లో పాల్గొన్న తెలుగింటి ఆడపడుచులకు జిఆర్టి జెవెల్లెర్స్ వారు తాంబూళంతో కూడిన గూడీ బ్యాగ్ అందజేసి అందరికీ బోనాలు పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రజలందరికి  మహంకాళి తల్లి ఆశీస్సులు ఉండాలని టీసీఎస్‌ఎస్‌ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. సింగపూర్ లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాకుండా అందరు తెలుగు వారితో పాటు ఇతరులు ఈ బోనాల జాతరలో పాల్గొనడం జరిగింది.  ఈ సందర్భంగా టీసీఎస్‌ఎస్ వారు తొలిసారి 2017 లో బోనాల పండుగను నిర్వహించి సింగపూర్ కు ఈ పండుగ ప్రాముఖ్యతని పరిచయం చేసిన రోజులను గుర్తు చేసుకొని సంతోషించారు. మన ఈ తెలంగాణ సంప్రదాయం లో ప్రధాన భూమిక పోషించే బోనాల పండుగతో ప్రేరణ పొంది తెలుగు వారందరు బోనాల వేడుకను జరుపుకోవడం సంతోషకరం అని బోనాల్లో పాల్గొన్న వారు అన్నారు.



బోనాల జాతర లో పోతురాజు మరియు పులివేషాలతో జాతరకు కళ తెచ్చిన నేరెళ్ల శ్రీనాథ్, గౌడ లక్ష్మణ్, అయిట్ల లక్ష్మణ్ మరియు అరవింద్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.

ఈ ఏడాది బోనం సమర్పించిన వారిలో గడప స్వాతి రమేశ్, గోనె రజిత నరేందర్ రెడ్డి, ఎర్రమ రెడ్డి దీప్తి శిశిధర్ రెడ్డి, అలేఖ్య దార, బండ శ్రీదేవి మాధవ రెడ్డి, బొందుగుల ఉమారాణి రాము , నడికట్ల కళ్యాణి భాస్కర్, కాశబోయిన హర్షిని (W/O ప్రవీణ్) , భూక్య మీనా శ్రీధర్ , గౌరీ శ్రీవాణి శ్రీనివాస్ , తడిసిన అలేఖ్య లక్ష్మినర్సింహ , మందాడి సులోచన అనిల్ కుమార్ , శ్వేతా కుంభం , చాడ అనిత వేణుగోపాల్ రెడ్డి , బెహరా మాధవి, అమిత్ సేథీ ఉన్నారు. బోనం సమర్పించిన  భక్తులకు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు రిటర్న్ గిఫ్ట్ ను అందచేశారు. వీరితో పాటు గడప రమేశ్ అమ్మవారికి కోసం తొట్టెలను స్వయంగా పేర్చి తీసుకుకొచ్చారు.

బోనాల పండుగలో పాల్గొని విజయవంతం చేసిన మరియు ఎల్లప్పుడూ సొసైటీ వెన్నంటే ఉండి సహకారం అందిస్తున్న ప్రతీ ఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి మరియు కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ  ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త  నల్ల, గోనె  నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి  వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు రోజా రమణి, శివ ప్రసాద్ ఆవుల, రవి చైతన్య మైసా,  భాస్కర్ రావు పులిగిల్ల, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి ఎర్రమ రెడ్డి,  విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి చెన్నప్పగారి మరియు పెరుకు శివ రామ్ ప్రసాద్  కృతజ్ఞతలు తెలిపారు. అందరి పై ఉజ్జయిని మహంకాళీ ఆశీస్సులు ఉండాలని సొసైటి సభ్యులు ఆకాంక్షించారు.

ఈ వేడుకలకు సహకారం అందించిన సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ , GRT జువెల్లర్స్ , వీర ఫ్లేవర్స్ ఇండియన్ రెస్టారెంట్ , తందూర్ లౌంజ్ ఇండియన్ రెస్టారెంట్ ,ప్రాడ్ ఈవెంట్ మేనేజ్ మెంట్, GRT ఆర్ట్లాండ్, నిక్స్ గ్లోబల్ రియాలిటీ, మంచికంటి శ్రీధర్, రాము బొందుగుల, లాలంగర్ వేణుగోపాల్, రాధాకృష్ణ కవుటూరు, కొమాకుల సాయికృష్ణ, అజయ్ కుమార్ నందగిరి, చమిరాజ్ వెంకట రామాంజనేయులు (టింకర్ టాట్స్ మాంటిస్సోరి) గార్లకు మరియు దేవాలయ యాజమాన్యానికి సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

తెలంగాణ బోనాల పండుగ ప్రాముఖ్యత మరియు విశిష్టతని సింగపూర్ వాసులకు తెలియపరిచే ప్రేరణతో ఫేస్బుక్ వేదికగా నిర్వహించిన పోటీలలో భాగంగా ఉత్తమ రచన విజేతలుగా నిలిచిన మొదటి ఐదుగురికి కల్వ లక్ష్మణ్ రాజ్ గిఫ్ట్ వౌచెర్స్ ని అందచేశారు

ఈ వేడుకలకు సునీత రెడ్డి మిర్యాల, సంతోష్ వర్మ మాదారపు, మణికంఠ రెడ్డి చెన్నప్పగారి , శశిధర్ రెడ్డి ఎర్రమ రెడ్డి , శివ ప్రసాద్ ఆవుల, గోనె  నరేందర్ రెడ్డి, బొందుగుల రాము ,రవి కృష్ణ విజాపూర్, నంగునూరి  వెంకట రమణ, పెరుకు శివరామ్ ప్రసాద్ మరియు కాసర్ల శ్రీనివాస రావు సమన్వయ కర్తలుగా వ్యవహరించారు.

వీరితో పాటు పండుగ వేడుకలో సహాయపడిన సుగుణాకర్ రెడ్డి రావుల, మల్లేశ్ బరపతి,కల్వ లక్ష్మణ్ రాజ్ , ఫణి భూషన్ చకిలం మరియు సాయికృష్ణ కొమాకుల గార్లకు సొసైటీ సభ్యులు కృతజ్ణతలు తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement