ఘనంగా కంఠ మహేశ్వరస్వామి బోనాల పండుగ
ఘనంగా కంఠ మహేశ్వరస్వామి బోనాల పండుగ
Published Sat, Aug 20 2016 10:13 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
భూదాన్‌పోచంపల్లి : మండల కేంద్రంలో శనివారం గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కంఠ మహేశ్వరస్వామి, శ్రీ వనం మైసమ్మ బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలతో మహిళలు బోనాలను ఎత్తుకొని ప్రదర్శనగా వెళ్లి తమ కులదేవతలకు బోనాన్ని నైవేద్యంగా సమర్పించారు. అనంతరం పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సార సరస్వతీబాలయ్యగౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు చెర్కు అంజయ్య, కండె యాదయ్య, బండి యాదగిరి, కొయ్యడ నర్సింహ, గునిగంటి మల్లేశ్, తండ వెంకటేశం, తండ రమేశ్, తండ కిషన్, తంతరపల్లి వెంకటేశ్, బండి మహేశ్‌గౌడ్, ముప్పిడి శ్రీనివాస్, కాసుల కృష్ణ, అనిల్, కట్కూరి నరహరి, తంతరపల్లి శ్రీను, టి. పాండు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement