Nabha Natesh: బిర్యానీ.. అదో ఎమోషన్‌! | Actress Nabha Natesh Emotional Comments On Hyderabad Biryani And Bonalu Festival, Deets Inside | Sakshi
Sakshi News home page

Nabha Natesh: బిర్యానీ.. అదో ఎమోషన్‌!

Published Fri, Jul 12 2024 10:30 AM | Last Updated on Fri, Jul 12 2024 1:05 PM

Actress Nabha Natesh's Emotional Comments On Hyderabad Biryani And Bonalu

‘హైదరాబాద్‌ అనగానే అందరికీ గుర్తొచ్చేది బిర్యానీ. ఇక్కడ చాలా రకాల బిర్యానీలు ఉంటాయి. ధమ్‌ బిరియానీ, మొఘల్‌ స్టైల్, నాటుకోడి, పులావ్, ఆవకాయ్, ఉలవచారు బిర్యానీ.. ఇలా ఎన్నోరకాలు ఉంటాయి. హైదరాబాద్‌ బిర్యానీ అంటే కేవలం ఫుడ్‌ కాదు.. అదొక ఎమోషన్‌. నాకు ఇక్కడి హలీమ్‌ అంటే చాలా ఇష్టం. హలీమ్‌ సీజన్‌లో తప్పకుండా తింటాను’ అని హీరోయిన్‌ నభా నటేశ్‌ అన్నారు.

‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచి్చన ఈ బ్యూటీ ‘అదుగో, ఇస్మార్ట్‌ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘డార్లింగ్‌’. ప్రియదర్శి హీరోగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నగరానికి వచ్చిన నభా హైదరాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని, బోనాల పండుగ గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.  – సాక్షి, సినిమా డెస్క్‌

ఇదే నా ఫస్ట్‌ హోం..
భాగ్యనగరం నాకిప్పుడు ఫస్ట్‌ హోం అయిపోయింది. నా స్వస్థలం కర్నాటకలోని చిక్‌మంగళూర్‌. చిన్నప్పటి నుంచి వేర్వేరు ప్రదేశాల్లో పెరిగాను. కానీ, ఆరేళ్లుగా తెలుగు సినిమాలు చేస్తున్నాను కాబట్టి ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడి ప్రజలు చాలా మంచివారు. ఎంతో ప్రేమగా మాట్లాడతారు.. అభిమానిస్తారు.

ఇక్కడి హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది. ఫుడ్‌ అద్భుతంగా ఉంటుంది.. కావాల్సినంత పెడతారు(నవ్వుతూ). స్వీట్‌ చాలా ఎక్కువ తినిపిస్తారు. స్వీట్స్‌ని నేను ఎక్కువగా తినను. ఎందుకంటే డైట్‌లో ఉంటాను. ఏదైనా ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు అయ్యయ్యో... ఇప్పుడు ఎలా? తప్పకుండా స్వీట్స్‌ తినాలనే ఫీలింగ్‌ వస్తుంది. ఏదేమైనా హైదరాబాద్‌లో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది.  

బోనాలంటే ఇష్టం..
హైదరాబాద్‌లో జరిగే బోనాలంటే నాకు చాలా ఇష్టం. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాలో బోనాల పాటకి నేను డ్యాన్స్‌ కూడా చేశాను. ఆ పాట చాలా బాగా పాపులర్‌ అయ్యింది. నేను కూడా బోనం ఎత్తుకున్నాను. ప్రస్తుతం బోనాల సమయంలోనే మా ‘డార్లింగ్‌’ మూవీ విడుదల కావడం సంతోషంగా ఉంది. ఇప్పుడు జరుగుతున్న బోనాల ఉత్సవాల్లో పాల్గొనాలని ఆత్రుతగా ఉంది. మా నిర్మాత చైతన్య మేడంగారు ప్లాన్‌ చేస్తామని చెప్పారు. తప్పకుండా పాల్గొంటాను.

ఆ నమ్మకంతోనే...
ప్రత్యేకించి ఈ నగర సంస్కృతి అంటే ఇష్టం. బాగా చూసుకుంటారు. నా మొదటి సినిమాకు మా అమ్మ తోడుగా వచ్చేది. కానీ, ఇక్కడివారు ఎంతో జాగ్రత్తగా చూసుకునే విధానం అమ్మకి నచి్చంది. నేను తోడు రాకున్నా ఎంతో కేరింగ్‌గా చూసుకుంటారని అమ్మకి రావడంతో ఇప్పుడు రావడం లేదు. సినిమా సెట్స్‌లో నటీనటులను బాధ్యతగా చూసుకుంటారు.. నాకు అది చాలా బాగా నచ్చుతుంది. మంచి సౌకర్యాలు కల్పిస్తారు.. గౌరవం ఇస్తారు. – సినీ నటి నభా నటేశ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement