
సాక్షి, సిటీబ్యూరో: నా హృదయంలో హైదరాబాద్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. నా సినిమా కెరీర్‌కు బీజం పడింది ఇక్కడే.. అంటూ తన అభిమానాన్ని తరచూ చాటుకుంటారు బహుభాషా నటి రకుల్ ప్రీతిసింగ్. అందుకే ప్రస్తుతం ఆమె టాలీవుడ్‌కు దూరంగా ఉన్నా, నగరానికి మాత్రం దగ్గరగానే ఉంటున్నారు. ఇటీవలే కొండాపూర్‌లో తన 2వ మిల్లెట్ రెస్టారెంట్ ‘ఆరంభం’ను ఆమె ప్రారంభించారు.
మే నెలలో మాదాపూర్‌లో తొలి రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసిన ఆమె కేవలం 2నెలల్లోనే మరొకటి సిటిజనులకు అందుబాటులోకి తేవడం గమనార్హం. తెలుగు సినిమాల్లో అడపాదడపా మాత్రమే కనిపిస్తూ బాలీవుడ్ ప్రముఖుడ్ని పెళ్లాడి ముంబైలో నివసిస్తున్న రకుల్ ప్రీతిసింగ్.. నగరంతో తన అనుబంధాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు. ఫిట్‌నెస్ లవర్ రకుల్.. గతంలో నగరంలో ఎఫ్–45 పేరిట జిమ్స్ నెలకొలి్పన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా నగరంలో అనేక మంది సినీ ప్రముఖులు రెస్టారెంట్స్, పబ్స్ ఏర్పాటు చేసినప్పటికీ.. ఆరోగ్యాభిలాషుల్ని దృష్టిలో ఉంచుకుని ఫిట్‌నెస్ సెంటర్లూ, మిల్లెట్ రెస్టారెంట్లూ నెలకొలి్పన క్రెడిట్ మాత్రం రకుల్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment