
విజేతలకు 3 లక్షల నగదు
ప్రముఖ సినీనటుడు విశ్వక్‌సేన్
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుతం సోషల్ మీడియాపై ఆధారపడని వ్యవస్థ, వ్యాపారం ఏదీ లేదని, టాలెంట్ ఎవరి సొత్తూ కాదని ప్రముఖ సినీ నటుడు విశ్వక్‌సేన్ తెలిపారు. నెక్లెస్ రోడ్‌లోని అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ ‘థ్రిల్ సిటీ’ ఆధ్వర్యంలో థ్రిల్లింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఛాలెంజ్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విశ్వక్‌సేన్ ఆవిష్కరించారు. క్రియేటివిటీ ఫీల్డ్‌లో కొత్తగా ప్రవేశించేవాళ్లు కూడా బ్రహ్మాండంగా రాణించవచ్చని అన్నారు. ఇందులో భాగంగా థ్రిల్‌సిటీ విడియోలను ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేయాలని కో–ఆర్డినేటర్ బందూక్ లక్ష్మణ్ తెలిపారు. మూడు విభాగాల్లో ఉత్తమ వీడియోలను ఎంపిక చేసి ఒక్కొక్కరికీ లక్ష చొప్పున 3 లక్షల నగదు బహుమతులను అందిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment