thrilling
-
ఫ్లాట్ నెం-420.. అదొక గేటెడ్ కమ్యూనిటీ..
‘మేడం.. టీ’ అంటూ కస్తూరికి టీ ఇచ్చింది వంటమనిషి. ‘థాంక్స్’ అన్నట్టుగా నవ్వుతూ ట్రేలోంచి టీ కప్ తీసుకుంది కస్తూరి. వంటమనిషి వంటింట్లోకి వెళ్లేవరకు ఆగి, టీ సిప్ చేస్తూ ‘మొత్తానికి మీకు బాగానే ఆసరా అయినట్టుంది కదండీ ఈమె?’ అంది కస్తూరి ఎదురుగా సింగిల్ సీటర్‌లో కూర్చున్న ఆ ఫ్లాట్ ఓనర్ మంగళతో. ‘బాగానే ఏంటండీ.. చాలా బాగా! అందుకు మీకే థాంక్స్ చెప్పాలి. అమ్మాయి డెలివరీకి వచ్చింది.. ఆమె అత్తగారు వాళ్లు, చుట్టాల హడావిడి.. నా ఒక్కదానితో అయ్యేనా అని టెన్షన్ పడ్డాను. కరెక్ట్ టైమ్‌లో ఆ దేవుడు పంపించినట్లే మీరు ఆమెను మా ఇంటికి పంపారు. తనకు రాని వంట, రాని పనంటూ లేదండీ బాబూ! మా అమ్మాయికైతే ఎంత నచ్చిందో! ఆయిల్ మసాజ్ దగ్గర్నుంచి , అమ్మాయికి తినాలనిపించినవన్నీ వండి పెట్టేవరకు పనంతా తన మీదే వేసేసుకుంటోంది. డెలివరీ అయ్యి తనింటికి వెళ్లేప్పుడు వంటమనిషిని తోడు తీసుకెళ్లిపోతానంటోందండీ అమ్మాయి’ అంటూ నిశ్చింతగా నవ్వింది మంగళ. ‘మీ అమ్మాయికి నచ్చితే మరింకేం అండీ.. బ్రహ్మాండం’ అంటూ టీ కప్ టీ పాయ్ మీద పెడుతూ వంటింటి వైపు చూసింది కస్తూరి. వంటమనిషీ కస్తూరిని చూసింది.అదొక గేటెడ్ కమ్యూనిటీ. మంగళ, కస్తూరి వాళ్లవి పక్కపక్క ఫ్లాట్లే! ఆ వంటమనిషిది బీదర్ అని, భర్తపోయి పుట్టెడు దుఃఖం, అంతకన్నా పుట్టెడు అప్పుల్లో మునిగిపోయిందని, వంటపని బాగా చేస్తుందంటూ ఆమెను కస్తూరి వాళ్ల పనమ్మాయి అన్నపూర్ణ తీసుకొచ్చింది. మంగళ అవసరాన్ని గ్రహించి, ఆమె మాతృభాష కూడా కన్నడ కావడంతో కన్నడ వంటమనిషైతే ఆమెకు చక్కగా సరిపోతుందని ఆ వంటమనిషిని మంగళ ఇంటికి పంపింది కస్తూరి. మంగళకు ఆ వంటమనిషి చురుకుదనం, పర్ఫెక్షన్, మర్యాద, మన్నన బాగా నచ్చాయి. అందుకే ఆమె త్వరగా మంగళకు ఆప్తురాలైపోయింది.ఒకరోజు.. ‘అమ్మా.. ఈ రోజు సాయంకాలం అన్నపూర్ణ వాళ్లతో కలసి బిర్లా మందిర్‌కి వెళ్లొస్తానమ్మా’ రిక్వెస్ట్ చేసింది వంటమనిషి.. దిండు గలీబులు మారుస్తూ. ‘వాళ్లతో ఎందుకూ? మన డ్రైవర్‌తో కార్లో పంపిస్తాలే’ చెప్పింది మంగళ తమ బెడ్రూమ్లోని స్విచ్ బోర్డ్‌లా కనిపిస్తున్న సీక్రెట్ సేఫ్ తెరిచి అందులో ఏవో డాక్యుమెంట్స్ సర్దుతూ! ‘అయ్యో కార్లో ఎందుకమ్మా.. చక్కగా అన్నపూర్ణ వాళ్లతో వెళ్తాలే! వాళ్లతో సరదాగా గడిపినట్టు ఉంటుంది’ అంది బెడ్ కిందున్న సొరుగులాగి కొత్త బెడ్‌షీట్ తీస్తూ! దాన్ని బయటకు తీయబోతుంటే బెడ్‌షీట్ పోగొకటి ఏదో స్క్రూకి తట్టినట్టయింది. షీట్ చిరగకుండా పోగును తెంపబోతుండగా గబగబా మంగళ వచ్చి వంటమనిషిని నెమ్మదిగా పక్కకు నెట్టి, సొరుగును లోపలికి తోసేసి, ‘ఆ బెడ్ షీట్ వద్దులే.. ఇంకోటి ఇస్తా’ అంటూ వార్డ్ రోబ్ దగ్గరకు వెళ్లింది. అయోమయంగా నిలబడిపోయింది వంటమనిషి.ఆమె మొహంలోని ఫీలింగ్‌ని ఇంకోలా అర్థం చేసుకున్న మంగళ కూతురు ‘తన ఫ్రెండ్స్‌తో పోతానంటోంది కదా.. పోనీలే మమ్మీ..’ అంటూ వంటమనిషి తరపున తల్లికి సిఫారసు చేసింది.‘సరే వెళ్లిరా..’ అంటూ వార్డ్‌రోబ్‌లోంచి తీసిన మరో బెడ్ షీట్‌ని వంటమనిషి చేతుల్లో పెట్టింది మంగళ. ఆరోజు సాయంకాలం అయిదింటికి అన్నపూర్ణ వాళ్లతో కలసి బయటకు వెళ్లింది వంటమనిషి. రాత్రి తొమ్మిది అయినా తిరిగిలేదు. కంగారు పడిపోయారు మంగళ కుటుంబ సభ్యులు. కస్తూరికి ఫోన్ చేసి అన్నపూర్ణ వివరం అడిగి, ల్యాండ్ లైన్ ఫోన్ రిసీవర్‌ను క్రెడిల్ చేసిందో లేదో ఆ ఫోన్ మోగింది. క్షణంలో లిఫ్ట్ చేసి ‘హలో.. ’ అంది మంగళ. ‘హలో అమ్మగారేనా..’ అంటూ మంగళ స్వరాన్ని నిర్ధారించుకుని, ‘అమ్మా.. బిర్లా మందిర్ దగ్గర మా చుట్టాలమ్మాయి కలిసింది.బలవంతపెడితే వాళ్లింటికి వచ్చానమ్మా! ఈ రాత్రికి ఉండిపొమ్మంటున్నారు. రేప్పొద్దున్నే వచ్చేస్తానమ్మా.. వాళ్లు దిగబెడతామంటున్నారు’ అంటూ వంటమనిషి ఠక్కున ఫోన్ పెట్టేసింది.. మంగళ ఏదో అడగబోయేంతలోనే! వంటమనిషి ఆ తీరు ఆమెకు కోపాన్ని తెప్పించింది. ‘చూశావుగా.. అందుకే పంపనన్నా..’ అంది కూతురితో అసహనంగా. ‘వాట్ హ్యాపెండ్?’ అడిగింది సోఫాలో పడుకుని ఏదో మ్యాగజీన్ చదువుతున్న కూతురు లేచి కూర్చుంటూ. ‘వాళ్ల చుట్టాలమ్మాయి కలిసిందట, వాళ్లింటికి వెళ్లిందట, రేపు ఉదయం వస్తుందట’ చెప్పింది మంగళ విసురుగా. ‘అబ్బా మమ్మీ.. వస్తుందిలే రేపు.. కూల్’ అని సర్దిచెప్పింది కూతురు. ‘అన్నీ కథలు.. అది నీ అలుసే తీసుకుంది’ హెచ్చు స్వరంతో అంటూ బెడ్రూమ్లోకి వెళ్లింది మంగళ. తెల్లవారి ఆరు గంటలు.. అది చలికాలం కావడం వల్ల ఇంకా చీకటిగానే ఉంది. మంగళ వాళ్ల ఫ్లాట్ కాలింగ్ బెల్ మోగింది. రెండుసార్లకు.. మంగళ వచ్చి తలుపు తీసింది. ఎదురుగా ఒక స్త్రీ, ఇద్దరు మగవాళ్లున్నారు. మంగళకేం అర్థంకాలేదు. ‘ఎవరు మీరు?’ అంది. ‘ఫ్రమ్ ఐటీ’ అంటూ ఐడీ కార్డ్స్ చూపిస్తూ లోపలికి వెళ్లారు. ఆ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్‌లోని వంటిల్లు, రెండు బెడ్రూమ్స్ గోడల్లోని సీక్రెట్ సేఫ్స్, మంచం కింది సొరుగులోని సీక్రెట్ అరలను సోదా చేస్తే 70 తులాల బంగారం, ల్యాండ్ డాక్యుమెంట్స్, నాలుగు కోట్ల క్యాష్ బయటపడింది. అది ఒక ఆర్డీవో ఫ్లాట్. నంబర్ 420.అతని బ్లాక్ మనీ గురించి ఐటీ డిపార్ట్మెంట్కి టిప్ అందించింది కస్తూరే! ఆమె రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగి. ఆమె సహకారంతోనే ఐటీ మహిళా ఉద్యోగి వంటమనిషిగా మంగళ వాళ్లింట్లోకి చేరింది. ఆ ఫ్లాట్‌ని కళ్లతోనే స్కాన్ చేసి, అన్నపూర్ణ ద్వారా డిపార్ట్మెంట్కి చేరవేసింది. అన్నపూర్ణకూ తెలియదు తాను ఏవో వివరాలను ఐటీ డిపార్ట్మెంట్కి మోస్తున్నట్లు వంటమనిషి, తన కొలీగ్ ఓ కోడ్ లాంగ్వేజ్ పెట్టుకుని అన్నపూర్ణ ద్వారా ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకున్నారు. సెర్చ్ వారంట్ సిద్ధమయ్యాక.. బిర్లామందిర్ మిషతో ఆ ఇంట్లోంచి బయటపడింది ఆ వంటమనిషి. కాయిన్ బాక్స్ ఫోన్స్ కాలం నాటి ఈ ఆపరేషన్ అప్పట్లో ఓ మోస్తరు సంచలనాన్ని సృష్టించింది. – శరాది -
ఇమామ్ కజిన్ : ఓ సిటీలోని ఒక కాలనీలో..
ఓ సిటీలోని ఒక కాలనీలో.. ‘మేజ్..అరటి పళ్లూ..’ అంటూ పళ్ల బండి తోసుకుంటూ ఓ బంగ్లా ముందు నుంచి వెళ్తున్నాడో వ్యక్తి. ‘రేయ్.. ఈ ఏరియాల నిన్నెప్పుడు జూడ్లే! యేడి నుంచి ఒచ్చినవ్ బే?’ అంటూ ఆ బంగ్లా ముందున్న ఒక నడి వయసు వ్యక్తి బెదిరింపు స్వరంతో అడిగాడు. అతని పేరు శంకర్. ఆ బంగ్లా యజమాని అయిన మల్లేశ్‌కి కుడి భుజం లాంటివాడు. ఆ ప్రశ్నకు ఆ వ్యాపారి ఆ ఇంటి ముందు తన బండి ఆపి, తన పిల్లి గడ్డాన్ని సవరించుకుంటూ ‘నేను మార్కెట్ల పనిజేసే ఇమామ్ కజిన్‌ని భాయ్’ అని చెప్పాడు.బండిలోంచి ఓ పండును తీసుకుంటూ ‘ఏ మార్కెట్లయినా ఈ శంకర్‌కి పహచానత్ ఉంటది. నాకు దెల్వని ఇమామ్.. గాయన కజిన్ ఏడికెంచొచ్చె..’ అన్నాడు అరటి పండు తొక్కతీస్తూ! ‘నాది కరీంనగర్. కామ్‌కే లియే భాయ్‌కే పాస్ ఆయా. భాయ్ ఈ మేజ్ బండి ఇప్పిచ్చిండు’ చెప్పాడు ఇమామ్ కజిన్ అమాయకంగా. ‘అచ్ఛా..’ అని అరటి పండు తింటూ ఇమామ్ కజిన్‌ని ఇంకేదో అడగబోతుండగా.. అప్పుడే రాజ్‌దూత్ మీద ఎవరో ఆ ఇంటికి వచ్చేసరికి అరటి పండు తొక్కను అదే బండిలో విసిరేసి లోపలకు వెళ్లిపోయాడు శంకర్.పది రోజులు గడిచాయి..ఇమామ్ కజిన్ రోజూ ఆ కాలనీకి వస్తున్నాడు అరటి పండ్ల బేరానికి. కాలనీ అంతా తిరిగి మల్లేశ్ ఇంటి ముందున్న చెట్టు కిందే బండి పెట్టుకుంటున్నాడు చీకటి పడేవరకు. బంగ్లా యజమాని మల్లేశ్ ల్యాండ్ సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్‌లో ఆరితేరినవాడు. వడ్డీ వ్యాపారి కూడా. ఆ పనుల్లో మల్లేశ్ సహాయార్థం బిజీ అయిపోయాడు శంకర్. ఇమామ్ని, అతని కజిన్‌ని పట్టించుకునే తీరికలో లేడు. ఆ పదిరోజుల్లో ఇమామ్ కజిన్.. ఆ బంగ్లా సెక్యురిటీ గార్డ్ లాంటివాడైన శ్రీశైలానికి అరటి పండ్లు ఇస్తూ, రిలీజైన సినిమాలు, చిరంజీవి డాన్స్‌లు, సంజయ్ దత్ యాక్షన్ గురించి మాట్లాడుతూ క్లోజ్ అయ్యాడు.ఆ దోస్తానా ఎక్కడిదాకా వెళ్లిందంటే రెండు రోజులకోసారి ఆ ఇద్దరూ బిర్యానీ, మందు పార్టీ చేసుకునేదాకా! అయితే తాను ముస్లిం ధర్మాన్ని నిష్ఠగా పాటిస్తాడు కాబట్టి మందు ముట్టనని ముందే శ్రీశైలంతో చెప్పాడు ఇమామ్ కజిన్. ‘దాందేముంది భయ్యా.. నేను మందు తాగుతా.. నువ్వు కూల్‌డ్రింక్ సప్పరియ్’ అంటూ ఇమామ్ వ్రతం చెడకుండా జాగ్రత్తపడ్డాడు శ్రీశైలం. ఆ ఫ్రెండ్షిప్ అక్కడితోనే ఆగలేదు.. ఇమామ్ కజిన్‌కి మల్లేశ్ ముఖ్యమైన అనుచరులనూ పరిచయం చేసే వరకు వెళ్లింది.తరచుగా వాళ్లనూ తమ పార్టీకి తీసుకొచ్చేవాడు శ్రీశైలం. తన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో వాళ్లందరినీ ఆకట్టుకుంటూ వాళ్లకూ మాలిమయ్యాడు ఇమామ్ కజిన్. ఆ చనువుతో అతను తనకు కుదిరినప్పుడల్లా మల్లేశ్ ఇంటికి వెళ్లేవాడు వాళ్లను కలవడానికి. అలా ఇంకో పది రోజులు గడిచాయి. ఇప్పుడు అతను.. మల్లేశ్ ఇంటికి ఎన్ని ద్వారాలున్నాయి, ఆ ఇంట్లో ఏ మూల ఏం ఉంది.. మల్లేశ్ కుటుంబ సభ్యుల్లో ఎవరు ఏ గదిలో ఉంటారు లాంటి వివరాలన్నిటితో కళ్లు మూసుకుని ఆ ఇంటి నకలు గీసి చూపించగలడు!ఇరవై రెండో రోజు..రాత్రి ఇమామ్ కజిన్.. మల్లేశ్ అనుచరుల్లోని అతి విశ్వాసపాత్రులు, తన దోస్తులూ అయిన ఓ ఇద్దరికి దావత్ ఇచ్చాడు. తన భాయ్ ఇమామ్ తనకు పండ్ల దుకాణం పెట్టించబోతున్నాడనే ఖుష్ ఖబర్ను పంచుకుంటూ! ఆ అనుచరులిద్దరూ ఇమామ్ కజిన్‌ని గుండెకు హత్తుకున్నారు. అన్నేళ్ల నుంచి మల్లేశ్ ఇంట్లో ఉంటున్నా తమకు ఒరగని లాభాన్ని, చేస్తున్న చాకిరీని ఏకరువు పెట్టుకున్నారు. వచ్చిన నెలలోపే ఇమామ్ తన కజిన్‌కి దందా పెట్టివ్వడాన్ని పొగిడారు. అందుకు అర్హత సాధించిన ఇమామ్ కజిన్ నిజాయితీకి సలాం చేశారు. ఆ మత్తులో ఇంకా.. తమ బాస్ ఎలా సంపాదిస్తున్నాడో.. ఆ సంపదను దాచే ఆ ఇంట్లోని సీక్రెట్ ప్లేసెస్ ఏంటో డీటేయిల్డ్‌గా చెబుతూ మల్లేశ్ మీదున్న కసిని వెళ్లగక్కారు. అంతేకాదు ఆ రోజు ఉదయమే మల్లేశ్కున్న డెయిరీ ఫామ్‌లోని గడ్డివాముల్లో దాచిన డబ్బు సంగతీ చెప్పారు. నెమ్మదిగా కూల్‌డ్రింక్ సిప్ చేస్తూ విన్నాడు ఇమామ్ కజిన్!తెల్లవారి..ఆరు గంటలకు ఇన్కమ్ టాక్స్ సిబ్బంది ఆ సిటీలోని శంకర్ ఇల్లు సహా అతని స్థావరాలన్నిట్లోకి అడుగుపెట్టారు సెర్చ్ వారెంట్‌తో! ఇంటి గరాజ్లోని నేల మాళిగ, స్టోర్ రూమ్, డెయిరీ ఫామ్ గడ్డి వాములు.. అన్నిచోట్లా నాలుగు గంటల్లో.. లెక్క, పత్రాల్లేని ఆదాయం కొన్ని పదుల కోట్లలోనే దొరికింది. బంగారు ఆభరణాలు, బిస్కట్లు సహా!ఇమామ్ లేడు..ఇది దాదాపు 20 ఏళ్ల కిందటి సంగతి. మల్లేశ్ వాళ్ల కాలనీలోని ఒక గవర్నమెంట్ టీచర్ ఐటీ డిపార్ట్మెంట్కు అందించిన టిప్‌తో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది డిపార్ట్మెంట్. మామూలుగా ఆ కాలనీ అంతా మల్లేశ్ మనుషులే కాపలా కాస్తుంటారు. సాదాసీదా వ్యక్తిగా వెళితే వివరాలు దొరికే ఆస్కారం లేదు. అందుకే ఇమామ్ అనే ప్రాతను సృష్టించి, అతని కజిన్‌గా పెట్టుడు పిల్లి గడ్డంతో, అరపటి పండ్ల వ్యాపారిగా మల్లేశ్ ఉంటున్న కాలనీలోకి ఎంటర్ అయ్యాడు ఆ ఉద్యోగి. 20 రోజుల్లోనే మల్లేశ్ అనుచరులు అతని గురించిన సీక్రెట్స్ అన్నీ కక్కడంతో ఆ ఆపరేషన్ అనుకున్నదాని కంటే ముందే అయిపోయింది. ఆ రోజు రెయిడ్ చేయకపోతే మరుసటి రోజు గడ్డివాముల్లో దాచిన డబ్బు బెంగళూరుకు రవాణా అయిపోయేది. అదీ ఆ రాత్రి పార్టీలోనే తెలియడంతో వెంటనే రాత్రికిరాత్రే సెర్చ్ వారెంట్ సిద్ధమైపోయింది. రెయిడ్ సక్సెస్ అయింది.(‘ద రెయిడ్’ అనే కొత్త శీర్షిక కింద.. ఓ వాస్తవ సంఘటనకు కాస్త ఫిక్షన్‌ను జోడించి రాసిన కథనం ఇది. అందుకే ఊరు పేరు ఇవ్వలేదు. వ్యక్తుల పేర్లు మార్చాం. ఇక నుంచి వారం వారం ఇక్కడ ఇలాంటి ఆసక్తికర కథనాన్ని చదవొచ్చు.) – శరాదిఇవి చదవండి: దయ్యాల పండుగ..! ఒక రకంగా ఇది..? -
Vishwak Sen: థ్రిల్లింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఛాలెంజ్.. ఇది!
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుతం సోషల్ మీడియాపై ఆధారపడని వ్యవస్థ, వ్యాపారం ఏదీ లేదని, టాలెంట్ ఎవరి సొత్తూ కాదని ప్రముఖ సినీ నటుడు విశ్వక్సేన్ తెలిపారు. నెక్లెస్ రోడ్‌లోని అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ ‘థ్రిల్ సిటీ’ ఆధ్వర్యంలో థ్రిల్లింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఛాలెంజ్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విశ్వక్సేన్ ఆవిష్కరించారు. క్రియేటివిటీ ఫీల్డ్‌లో కొత్తగా ప్రవేశించేవాళ్లు కూడా బ్రహ్మాండంగా రాణించవచ్చని అన్నారు. ఇందులో భాగంగా థ్రిల్‌సిటీ విడియోలను ఇన్ఫ్లుయెన్సర్లు తమ సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేయాలని కో–ఆర్డినేటర్ బందూక్ లక్ష్మణ్ తెలిపారు. మూడు విభాగాల్లో ఉత్తమ వీడియోలను ఎంపిక చేసి ఒక్కొక్కరికీ లక్ష చొప్పున 3 లక్షల నగదు బహుమతులను అందిస్తున్నామన్నారు. -
భయపెట్టే వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
సోషల్ మీడియాలో తరచూ ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసే పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా ఒక భయపెట్టే వీడియో షేర్ చేశారు. ఈ వీడియో థ్రిల్ కోరుకునే వారికి సరదాగానే ఉండొచ్చు, కానీ.. సామాన్యులలో మాత్రం తప్పకుండా భయం పుట్టిస్తుంది. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో హాట్ ఎయిర్ బెలూన్ గాలిలో ఎగురుతుంటే.. దానికి కింద భాగంలో ఏర్పాటు చేసిన ట్రామ్పోలిన్ మీద కొందరు వ్యక్తులు ఎగరడం చూడవచ్చు. ఎయిర్ బెలూన్ నుంచి కిందికి చూస్తేనే మనకు భయమేస్తుంది. కానీ అంత ఎత్తులో ట్రామ్పోలిన్‌పై ఎగరడం అంటే పెద్ద సాహసమనే చెప్పాలి. గాలిలో ఎత్తు నుంచి కిందికి దూకేవారికి ఇలాంటివి చాలా సాధారణంగా ఉంటాయి. వీడియోలో కనిపించే వ్యక్తులు కూడా సేఫ్టీ గేర్‌తో కూడిన పార్టిసిపెంట్స్. కాబట్టే వారు హ్యాప్పీగా గాలిలో ఎగరగలుగుతున్నారు. ఈ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. 'ఇలాంటివి ప్రయత్నించడం నా లిస్టులో లేదు, కానీ ఆదివారం ఉదయం చూడటానికి ఇది సరైన వీడియో' అంటూ ట్వీట్ చేసాడు. ఇదీ చదవండి: ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం! ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే లక్షల మంది వీక్షించిన ఈ వీడియోను వేలమంది లైక్ చేశారు. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేశారు. Attempting this is NOT on my bucket list. But what a perfect video to watch from an armchair to create the right mood on a Sunday morning ….🙂 pic.twitter.com/7ab9516Ee5 — anand mahindra (@anandmahindra) January 28, 2024 -
థ్రిల్లింగ్ లాస్ట్ ఓవర్.. నరాలు తెగే ఉత్కంఠ.. అనూహ్య మలుపులు
ఆస్ట్రేలియా డొమెస్టిక్ వన్డే కప్ (మార్ష్ కప్) 2022-23 సీజన్లో రసవత్తర సమరం జరిగింది. థ్రిల్లింగ్ లాస్ట్ ఓవర్లో నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఓ మ్యాచ్ అనూహ్య మలుపులకు వేదికైంది. గబ్బా వేదికగా క్వీన్స్‌ల్యాండ్-న్యూసౌత్‌వేల్స్ జట్ల మధ్య ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్‌లో క్వీన్స్‌ల్యాండ్ జట్టు 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్వీన్స్‌ల్యాండ్.. 49.5 ఓవర్లలో 272 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం న్యూసౌత్ వేల్స్ లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయి (49.5 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్) ఓటమిపాలైంది. Watch this crazy final over that included a six, an injured bowler on debut, another debutant bowling his first over halfway through the last over to replace him, and a run out that sealed a thrilling win for Queensland https://t.co/CREqRlj00C — cricket.com.au (@cricketcomau) February 26, 2023 చివరి ఓవర్లో న్యూసౌత్ వేల్స్ గెలవాలంటే 14 పరుగులు చేయాల్సి ఉండగా (చేతిలో 2 వికెట్లు ఉన్నాయి).. స్టీవెన్ మెక్గిఫిన్ వేసిన తొలి బంతినే డ్వార్షుయిష్ సిక్సర్‌గా మలిచి గెలుపుపై ధీమాను పెంచాడు. అయితే ఆతర్వాత బంతికే డ్వార్షుయిష్ (20 బంతుల్లో 44; 5 సిక్సర్లు).. బ్లేక్ ఎడ్వర్డ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక్కడే మ్యాచ్‌లో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. Huge wicket for the Bulls and we have a thrilling finish coming up! #MarshCup pic.twitter.com/K0WJ4trzBp — cricket.com.au (@cricketcomau) February 26, 2023 గజ్జల్లో గాయం కారణంగా స్టీవెన్ మెక్గిఫిన్ తప్పుకోవడంతో జోష్ బ్రౌన్ బంతిని అందుకున్నాడు. బ్రౌన్ వేసిన మూడో బంతి డాట్ బాల్ కాగా.. నాలుగో బంతిని లియామ్ హ్యచర్ బౌండరీకి తరలించాడు. చివరి రెండు బంతుల్లో 5 పరుగులు చేయల్సిన తరుణంలో లియామ్ హ్యాచర్ రనౌట్ కావడంతో మ్యాచ్ ముగిసింది. గెలుపుపై ధీమాగా ఉన్న న్యూసౌత్ వేల్స్ చివరి ఓవర్లో చతికిలపడి ఓటమిపాలైంది. ఈ విజయంలో క్వీన్స్‌ల్యాండ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంతో సీజన్‌ను ముగించగా.. న్యూసౌత్‌వేల్స్ చిట్టచివరి ప్లేస్‌తో సీజన్‌ను ముగించింది. ఫైనల్ మ్యాచ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా-సౌత్ ఆస్ట్రేలియా మధ్య మార్చి 8న జరుగుతుంది. -
టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ
-
నిజజీవిత కథతో... థ్రిల్లర్
హారర్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాల మేళవింపుగా వచ్చిన తమిళ చిత్రం - ‘డార్లింగ్ 2’. కళైయరసన్, రమీజ్ రాజా, మాయ, కాళి వెంకట్ ప్రధాన పాత్రల్లో సతీష్ చంద్రశేఖరన్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ. జ్ఞానవేల్ రాజా తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్కడ ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. వరుణ్ చౌదరి సమర్పణలో ఎవర్గ్రీన్ క్రియేషన్స్ పతాకంపై మాధురి బొల్లు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘‘దర్శకుడు సతీష్, అతని ఐదుగురు స్నేహితులకు ఓ హాలీడేలో చిత్రమైన సంఘటన ఎదురైంది. దాని ఆధారంగా కథ అల్లుకొని, ఈ సినిమా రూపొందించారు. సెన్సార్, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెలలోనే విడుదల చేస్తాం’’ అని మాధురి తెలిపారు. ఈ చిత్రానికి పాటలు: శివగణేశ్, కెమేరా: విజయ్ కార్తీక్ కణ్ణన్, సహ-నిర్మాత: షషిత మైనేని.