నిజజీవిత కథతో... థ్రిల్లర్ | Darling 2 Telugu Movie | Sakshi
Sakshi News home page

నిజజీవిత కథతో... థ్రిల్లర్

Published Wed, Mar 2 2016 11:02 PM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM

నిజజీవిత కథతో... థ్రిల్లర్ - Sakshi

నిజజీవిత కథతో... థ్రిల్లర్

హారర్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాల మేళవింపుగా వచ్చిన తమిళ చిత్రం - ‘డార్లింగ్ 2’. కళైయరసన్, రమీజ్ రాజా, మాయ, కాళి వెంకట్ ప్రధాన పాత్రల్లో సతీష్ చంద్రశేఖరన్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ. జ్ఞానవేల్ రాజా తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్కడ ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు.
 
  వరుణ్ చౌదరి సమర్పణలో ఎవర్‌గ్రీన్ క్రియేషన్స్ పతాకంపై మాధురి బొల్లు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘‘దర్శకుడు సతీష్, అతని ఐదుగురు స్నేహితులకు ఓ హాలీడేలో చిత్రమైన సంఘటన ఎదురైంది. దాని ఆధారంగా కథ అల్లుకొని, ఈ సినిమా రూపొందించారు. సెన్సార్, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెలలోనే విడుదల చేస్తాం’’ అని మాధురి తెలిపారు. ఈ చిత్రానికి పాటలు: శివగణేశ్, కెమేరా: విజయ్ కార్తీక్ కణ్ణన్, సహ-నిర్మాత: షషిత మైనేని.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement