
స్ట్రోమ్ (విజయ్ దేవరకొండ పెంపుడు కుక్క పేరు) వచ్చాక మా ఇంట్లో ఎంతో ఆనందం వచ్చిందని సినీ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. జూబ్లీహిల్స్‌లో నూతనంగా నెలకొల్పిన సెవన్ ఓక్స్ పెట్ హాస్పిటల్‌ను విజయ్ తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి ప్రారంభించారు. మా ఇంట్లో మొదట్లో పెట్స్ అంటే ఇష్టం ఉండేది కాదని, కానీ మా అమ్మా నాన్నకు నచ్చజెప్పి స్ట్రోమ్ గాడిని తెచ్చుకున్నామని, ఇప్పుడు మాకంటే మా పేరెంట్స్ స్ట్రోమ్ గాడితోనే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారని విజయ్ అన్నారు.
షూటింగులలో ఎంతో బిజీగా ఉండి, ఒత్తిడిలో ఇంటికి రాగానే స్ట్రోమ్ గాడి అల్లరితో అంతా మర్చిపోతామన్నారు. పెట్స్‌ను పెంచడమంటే మామూలు విషయం కాదని, ఇంట్లో ఒక చిన్న బేబీని చూసినంత పని ఉంటుందని, అంత కేర్ తీసుకునే ఓపిక ఉన్న వాళ్లు మాత్రమే పెట్స్‌ను పెంచుకోవాలని సూచించారు. సెవన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ నిర్వాహకులు సంధ్య, శ్రీరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment