Pets Animals
-
ఉద్యోగానికి ఓకే
సమోయెడ్ జాతికి చెందిన ఓకే అనే రెండేళ్ల శునకం మొన్నటి దాకా ఓ కెఫెలో ఉద్యోగం చేసింది. తాజాగా మరో చోట ఇంటర్వ్యూకెళ్లి, ఎంపికైంది. త్వరలోనే కొత్త ఉద్యోగంలో చేరబోతోంది. డటౌ అనే తెల్ల పిల్లి కూడా తక్కువేం కాదు. అది నెలకు ఐదు క్యాన్ల ఆహారాన్ని సంపాదించుకుంటోంది. అదీ అన్ని పన్నులూ పోను..! ఇది కాకుండా.. ఆరోగ్యంగా, అందంగా, బుద్ధిగా ఉండే పిల్లులకి రోజూ స్నాక్స్ ఇస్తాం. యజమాని స్నేహితులకి 30 శాతం డిస్కౌంట్ ఇస్తాం అంటూ ఓ కెఫె నిర్వాహకుడు ఆఫర్ ఇచ్చారు. మరోచోట కెఫె నిర్వాహకుడు తమకు కావాల్సిన అర్హతలుండే పిల్లులు, కుక్కల కోసం ఇంటర్వ్యూలు చేసుకుంటున్నారు..! చైనాలో కొత్త ట్రెండిది. చైనీయుల్లో కుక్కలు, పిల్లుల్ని పెంచుకోవాలనే ఉబలాటం ఇటీవల అనూహ్యంగా పెరిగిపోయింది. ఈ ఏడాది చివరికల్లా ఆ దేశంలో పిల్లల కన్నా పెంపుడు జంతువులే (పెట్స్) ఎక్కువుంటాయని ఓ సర్వేలో తేలింది. అయితే, తట్టుకోలేని జీవన వ్యయం.. బిజీబిజీగా మారిన జీవితంతో పెంపుడు జీవుల్ని కెఫెల్లో ఉద్యోగాలకు కుదుర్చుతున్నారు. ఉద్యోగాలకు వెళ్లిన సమయాల్లో ఇవి కెఫెల్లో ఉంటాయి. తిరిగి రాగానే తమతోపాటే ఉంటాయి. దీంతోపాటు, కెఫెల్లో పార్ట్‌టైం, ఫుల్‌టైం ఉద్యోగాలతో ఎంతో కొంత ఆదాయం కూడా ఉంటోంది. దీంతోపాటు, చైనాలో మొదటిసారిగా గ్వాంగ్ఝౌలో 2011లో క్యాట్ కెఫె ప్రారంభించారు. ఇలాంటి కెఫెల సంఖ్య ఏటా 200 శాతం పెరుగుదల నమోదవుతోంది. 2023 లెక్కల ప్రకారం చైనాలో 4 వేల పైచిలుకు పిల్లులకు సంబంధించిన కంపెనీలు నడుస్తున్నాయి. పిల్లులు, కుక్కలతో గడపడం ఇష్టపడే కస్టమర్లు ఈ తరహా కెఫెలకు వస్తుంటారు. వీరి నుంచి సుమారు రూ.350 నుంచి రూ.700 వరకు వసూలు చేస్తుంటారు. తమ మధ్య తిరుగాడుతూ ఉండే పిల్లులు, కుక్కలతో వీరు సరదాగా ఆడుకుంటారు.‘తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకు పంపిన మాదిరిగానే ‘ఓకే’ను నేను కూడా కెఫెలో పార్ట్‌టైం జాబ్‌కి పంపిస్తున్నా’అని ఆ శునకం యజమాని 27 ఏళ్ల పీహెచ్డీ విద్యార్థి జ్యూ తెలిపారు. కొత్త జీవితానికి అది అలవాటు పడుతుందన్నారు. ‘జాబ్కెళ్లేటప్పుడు ఉదయం నాతోపాటే ఓకే కూడా కెఫెకు వస్తుంది. వచ్చే టప్పుడు తిరిగి సాయంత్రం ఇంటికి తెస్తాను. నేను, నా భర్త వీకెండ్స్‌లో బయటికి వెళ్లినప్పుడు ఓకేను కెఫె నిర్వాహకులే చూసుకుంటారు. పైపెచ్చు, పగలంతా మేం జాబ్లకెళితే ఓకే బద్ధకంగా నిద్రతోనే గడిపేస్తుది. ఆ సమయంలో దాని కోసం ప్రత్యేకంగా ఏసీ ఆన్ చేసి ఉంచడం తప్పనిసరి. ఫుజౌ నగరంలో అసలే నిర్వహణ ఖర్చులెక్కువ. ఓకే కూడా జాబ్ చేస్తే దాని ఖర్చులు అంది సంపాదించుకుంటుంది కదా’అని చెప్పుకొచ్చారు జ్యూ. ఓకేను ఇటీవలే ఓ కెఫె యజమాని గంటపాటు పరిశీలించారు. కస్టమర్లతోపాటు తోటి కుక్కలతో మసలుకునే తీరును గమనించి, ఓకే చెప్పారని జ్యూ తెలిపారు. ‘ఓకే స్టార్ ఆఫ్ ది కెఫె’అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు. జిన్జిన్ అనే బీజింగ్‌కు చెందిన టీచర్‌కు టీఝాంగ్ బ్యుయెర్ అనే పిల్లి ఉంది. తనకున్న రెండు పిలుల్ని పోషించేందుకు నెలకు 500 యువాన్ల(సుమారు రూ.6 వేలు) వరకు ఖర్చువుతోందని ఆమె అంటున్నారు. ఆహారం తింటూ రోజంతా బద్ధకంగా ఇంట్లోనే ఉంటోంది. అందుకే, ఆహారం, స్నాక్స్ ఖర్చుల కోసం బ్యుయెర్ను కూడా కెఫెల్లో పనికి పంపించేందుకు సిద్ధం చేస్తున్నానన్నారు. ‘అక్కడైతే అటూఇటూ తిరుగుతుంటే తిన్నది అరుగుతుంది. పైపెచ్చు హుషారుగా కూడా ఉంటుంది’అన్నారు జిన్జిన్. ఇప్పుడు చైనాలో కెఫె యజమానులు తమకు కావాల్సిన పిల్లులు, కుక్కల కోసం సోషల్ మీడియాలో యాడ్లు ఇస్తున్నారు. క్యాట్ కెఫెలో పనిచేస్తే ఎంత శాలరీ ఇస్తారు?అని ఒకరు ప్రశ్నించగా, ఓ కెఫె యజమాని ఇచి్చన సమాధానం వైరల్‌గా మారింది. ‘మా క్యాట్ కెఫెలో పనికి పంపుతామంటూ చాలా మంది యజమానులు మమ్మల్ని అడుగుతున్నారు. ఇక శాలరీ విషయానికొస్తే మేం చెప్పే దొక్కటే. మా పాత ఉద్యోగులు కొందరికి ఇచ్చినంత!’అని తెలిపారు. – సాక్షి నేషనల్ డెస్క్ -
పెట్ పేరెంటింగ్.. నివాసంలో మూగజీవులతో సహవాసం
లేడికి లేచిందే పరుగు.. అన్నట్టు ఆలోచన వచి్చందే తడవు ఇంటికి తెచ్చేసుకుని మరీ భౌ¿ౌలూ, మ్యావ్ మ్యావ్లూ, కిచకిచలూ.. వింటూ ఆనందించేద్దాం అనుకుంటే సరిపోదు.. కొనడం నుంచి పెంచడం దాకా పెట్స్ పేరెంటింగ్ కూడా ఒక కళే అంటున్నారు నిపుణులు. దీంతో పాటు వాటికి అనువైన ప్రదేశం ఉండేలా చూసుకోవాలి. తరచూ వాటికి ఇవ్వాల్సిన టీకాలు ఇప్పించడం, వాటి నుంచి సంక్రమించే వ్యాధులకు తగిన చికిత్సలు తీసుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.. నగరంలో పెంపుడు జీవులను మచ్చిక చేసుకోవడం... వాటి పెంపకం పట్ల హాబీ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరుగుతోంది. అయితే ఏవి కొనాలి? ఎలా పెంచాలి? ఎలా ఉంచాలి? వంటి కీలక విషయాల పట్ల అవగాహన లేకుండానే ఇంటికి తెచ్చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్నవారు తక్కువేం కాదు. ఈ నేపథ్యంలో నిపుణులు అందిస్తున్న సూచనలివి... కొనేముందు.. పెంపుడు జీవిగా శునకమైనా, పిల్లులైనా, పక్షులైనా.. తెచ్చు‘కొనే’ముందు తమ ఇంటి పరిస్థితులను విశ్లేషించుకోవాలి. కుటుంబ జీవనశైలి, మనకు అందుబాటులో ఉన్న స్థలం వంటి అంశాలపై ఆధారపడి పెట్ని ఎంపిక చేసుకో వాలి. అలాగే సదరు జీవి స్వభావం, దాని శక్తి స్థాయిలు, దానికి అందించాల్సిన సంరక్షణ అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లోని పిల్లలు/వృద్ధుల వయస్సు, వారి ఆరోగ్య పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాగైతే బాగు ‘భౌగు’..శునకాలు, పిల్లులు, పక్షులకు సరిపడేలా, సౌకర్యవంతమైన స్థలాన్ని అందించాలి. అలాగే ఫుడ్‌కీ, ఆటలకీ తగిన టైమ్ కోసం షెడ్యూల్ సెట్ చేసుకోవాలి. వాటికి ఇవ్వాల్సిన ఆహారం తదితరాల గురించి అలాగే టీకాల షెడ్యూల్ గురించి డాక్టర్ నుంచి సరైన మార్గదర్శకాలు తీసుకోవాలి.. అలాగే జనన నియంత్రణ శస్త్రచికిత్స ఎప్పుడు నిర్వహించాలి వంటివి తెలుసుకోవాలి. శునకాలకు సోషల్ లైఫ్ ముఖ్యం. చుట్టుపక్కల వారితో, సాటి జీవులతో స్నేహపూర్వక బంధం ఏర్పడడం కోసం అవకాశం ఇవ్వాలి. శునకం 4–5 నెలలకు చేరుకున్నప్పుడు వాటికి పలు అంశాల్లో శిక్షణ ఇప్పించడం అవసరం. అదే విధంగా 3 నెలల వయసు వరకూ ఫోమ్ బాత్/డ్రై బాత్, 4–6 నెలల వయసులో 15 రోజులకు ఒకసారి, 6 నెలలు దాటిన తర్వాత వారానికోసారి స్నానం తప్పనిసరి. దాంతో పాటే హెయిర్ కోట్‌ను క్రమం తప్పకుండా బ్రష్ చేయడం ముఖ్యం. హెయిర్ కట్, గోర్లు కత్తిరించడం చెవి శుభ్రపరచడం ఆసన గ్రంథులు శుభ్రపరచడం అవసరమే. బ్రీడ్.. గుడ్.. శునకాలను కొనుగోలు చేసేముందు వాటి బ్రీడ్స్‌ను పరిశీలించడం మంచిది. సహనం, ఉల్లాసభరితమైన స్నేహపూర్వక స్వభావంతో పిల్లలున్న కుటుంబాలకు, లాబ్రడార్ రిట్రీవర్లు, గోల్డెన్ రిట్రీవర్లు బీగల్స్ వంటివి, అలాగే అపార్ట్‌మెంట్స్‌కు పగ్స్, షిహ్ త్జుస్ వంటి చిన్న బ్రీడ్స్ నప్పితే, ఫార్మ్ హౌస్‌ల కోసం డాబర్‌మ్యాన్, రోట్‌వెల్లర్.. ఇలా ప్రత్యేకించిన బ్రీడ్స్ కూడా ఉన్నాయి. ఇండియన్ పరియా డాగ్ వంటి స్థానిక భారతీయ జాతులు మన వాతావరణానికి బాగా సరిపోతాయి కావలీర్ కింగ్, చార్లెస్ స్పానియల్స్, బాక్సర్లు కూడా పిల్లలతో ఆప్యాయంగా ఉండడానికి పేరొందాయి.మ్యావ్.. మ్యాచ్.. ఇటీవల పిల్లులను పెంచుకుంటున్నవారు బాగా పెరుగుతున్నారు. పెట్స్‌గా పిల్లులను ఎంచుకున్నవారు వాటి కోసం ఇంట్లో సరైన ప్రదేశాన్ని కనుగొనాలి. నులిపురుగుల నివారణకు వైద్య సలహాలు తీసుకోవాలి. పిల్లులకు రెగ్యులర్‌గా టీకా వేయడం వల్ల దానికి మాత్రమే కాదు పెంచుకునే వారికీ మంచిది. పిల్లులకు మూత్ర, మల విసర్జనలకు ఉపయోగించేందుకు లిట్టర్ బాక్స్ తప్పనిసరి. వాటికి లిట్టర్ శిక్షణ ఇవ్వడం చాలా ముఖ్యం. సంవత్సరం కంటే తక్కువ వయసున్న పిల్లులుకు వైరల్ ఇన్ఫెక్షన్లకు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి వైరల్ సంక్రమణను నివారించడానికి ఇతర వీధి పిల్లులతో సంబంధాన్ని నివారించాలి. మగ ఆడ పిల్లుల హార్మోన్ల మార్పులు గురించి అవగాహన ఉండాలి. చాలా మంది పిల్లి యజమానులు ఈ సమయంలో వాటిని చూసి పిల్లికి ఏదో అనారోగ్యం ఉందని అనుకుంటారు. పిల్లులకు తరచూ వస్త్రధారణ అవసరం లేదు అలాగే పిల్లులు తమను తాము శుభ్రం చేసుకుంటాయి కానీ నెలకు ఒకసారి మాత్రం శుభ్రపరచడం తప్పనిసరి..వండని మాంసాన్ని ఇవ్వకూడదు.. పక్షులను పంజరంలో ఉంచవద్దు. వీలైనంత వరకూ పక్షులను బందిఖానాలో ఉంచడం వాటికి హానికరం. ఇది వాటికి తీవ్రమైన కఠినమైన పరిస్థితిగా మారుతుంది. పోషకాహార లోపం, సరిపడని వాతావరణం, ఒంటరితనం, నిర్బంధంలో ఉన్న ఒత్తిడి వంటి సమస్యలకు దారి తీస్తుంది. పక్షులు ఎగురుతూ ఇతర పక్షులతో కలిసి జీవించాలి. ఓపెన్ స్కై కింద. వాటిని చిన్న ప్రదేశాల్లో ఉంచినప్పుడు, స్వభావ ప్రకోపాలు మానసిక కల్లోలాలకు గురవుతాయని నిపుణులు చెబుతున్నారు.పెంపకంలో అలక్ష్యం వద్దు.. పెట్స్‌ని పెంచుకునేవారు నగరంలో బాగా పెరుగుతున్నారు. అలాగే ఏ మాత్రం అవగాహన లేకుండా వాటిని తెచ్చుకుంటూ ఇబ్బందులు పడుతున్నవారూ పెరుగుతున్నారు. రకరకాల అనారోగ్యాలతో మా దగ్గరకు తమ పెట్స్‌ను తీసుకొచ్చే కేసుల్లో చాలా సందర్భాల్లో యజమానుల అవగాహన లోపమే కారణంగా తెలుస్తోంది. తరచూ వాటి బాగోగులు పర్యవేక్షించడం, నిరంతరం వైద్యులతో సంభాషించడం. చేస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి. –డా.బి.యమున, శునకాల, పిల్లుల వైద్య నిపుణులు -
'స్ట్రోమ్' వచ్చాక సంతోషం వచ్చింది.. : విజయ్ దేవరకొండ
స్ట్రోమ్ (విజయ్ దేవరకొండ పెంపుడు కుక్క పేరు) వచ్చాక మా ఇంట్లో ఎంతో ఆనందం వచ్చిందని సినీ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. జూబ్లీహిల్స్‌లో నూతనంగా నెలకొల్పిన సెవన్ ఓక్స్ పెట్ హాస్పిటల్‌ను విజయ్ తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి ప్రారంభించారు. మా ఇంట్లో మొదట్లో పెట్స్ అంటే ఇష్టం ఉండేది కాదని, కానీ మా అమ్మా నాన్నకు నచ్చజెప్పి స్ట్రోమ్ గాడిని తెచ్చుకున్నామని, ఇప్పుడు మాకంటే మా పేరెంట్స్ స్ట్రోమ్ గాడితోనే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారని విజయ్ అన్నారు.షూటింగులలో ఎంతో బిజీగా ఉండి, ఒత్తిడిలో ఇంటికి రాగానే స్ట్రోమ్ గాడి అల్లరితో అంతా మర్చిపోతామన్నారు. పెట్స్‌ను పెంచడమంటే మామూలు విషయం కాదని, ఇంట్లో ఒక చిన్న బేబీని చూసినంత పని ఉంటుందని, అంత కేర్ తీసుకునే ఓపిక ఉన్న వాళ్లు మాత్రమే పెట్స్‌ను పెంచుకోవాలని సూచించారు. సెవన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ నిర్వాహకులు సంధ్య, శ్రీరెడ్డి పాల్గొన్నారు. -
జూబ్లీహిల్స్ : సెవన్ ఓక్ పెట్ హాస్పిటల్లో సందడి చేసిన విజయ్ ,ఆనంద్ దేవరకొండ (ఫొటోలు)
-
డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
దేశంలో వీధికుక్కల దాడులు, దుర్మరణాలు సంఖ్య పెరుగుతూ ఉండటం ఆందోళన రేపుతోంది. ప్రతి ఏడాదీ మిలియన్ల కొద్దీ దాడుల కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు , సీనియర్ సిటిజన్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయి. దేశంలో 3.5 కోట్లకు పైగా వీధికుక్కలు ఉన్న నేపథ్యంలో ఇదొక సవాలుగా మారుతోంది. అంతేకాదు ఇటీవలి కాలంలోక ఒన్ని పెంపుడుకుక్కలు కూడా మనుషులకు తీరనిహాని చేస్తున్న ఘటనలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 23 జాతుల కుక్కలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధందేశంలో పెరుగుతున్న కుక్క కాటు కేసుల నేపథ్యంలో పిట్‌బుల్ టెర్రియర్, అమెరికన్ బుల్డాగ్, రోట్వీలర్ లాంటి పలు కుక్క జాతుల పెంపకాన్ని నిషేధించాలని కేంద్రం ఈ ఏడాది మార్చిలో రాష్ట్రాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. తమిళనాడులో పిట్‌బుల్ టెర్రియర్, తోసా ఇను సహా 23 రకాల క్రూరమైన కుక్క జాతులను నిషేధించినట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ నిన్న (గురువారం, ఏప్రిల్ 9)ప్రకటించింది. ఇటీవల చెన్నైలో రోట్వీలర్ డాగ్ బాలుడిని గాయపరిచిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.క్రూరమైనవిగా భావించే 23 జాతుల దిగుమతి, పెంపకం, అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అలాగే వీటి పెంపకం, విక్రయాలను నిలిపివేయాలని రాష్ట్రాలను కోరింది. అదే సమయంలో వాటికి గర్భనిరోధకానికి చర్యలు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పశుసంవర్ధక శాఖ, పాడిపరిశ్రమ శాఖలకు లేఖ రాసింది. కొన్ని జాతుల కుక్కలను పెంపుడు జంతువులుగా, ఇతర ప్రయోజనాల కోసం ఉపగించకుండా నిషేధించాలని పౌరులు, సిటిజన్ ఫోరమ్‌లు, యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (AWO) ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.దూకుడు , మానవులకు హాని కలిగించే లక్షనాలున్న ఈ జాతులు ప్రమాదకరమైనవిగా పరిగణించబడతాయి కేంద్రంస్పష్టం చేసింది . 2024 నాటికి భారతదేశంలో నిషేధించిన జాబితాను ప్రకటించింది. కేంద్రం నిషేధించిన కుక్కల జాతుల జాబితా పిట్‌బుల్ టెర్రియర్, టోసా ఇను, అమెరికన్ స్టాఫోర్డ్‌షైర్ టెర్రియర్, ఫిలా బ్రసిలీరో, డోగో అర్జెంటీనో, అమెరికన్ బుల్డాగ్, బోర్‌బోయెల్ కంగల్, సెంట్రల్ ఏషియన్ షెపర్డ్ డాగ్, కాకేసియన్ షెపర్డ్ డాగ్. ఇంకా సౌత్ రష్యన్ షెపర్డ్ డాగ్, టోర్న్‌జాక్, సర్ప్లానినాక్, జపనీస్ టోసా, అకిటా, మాస్టిఫ్స్, టెర్రియర్స్, రోడేసియన్ రిడ్జ్‌బ్యాక్, వోల్ఫ్ డాగ్స్, కానరియో, అక్బాష్ డాగ్, మాస్కో గార్డ్ డాగ్, కేన్ కోర్సో, బ్యాండాగ్ ఉన్నాయి.దాడులు ఎందుకు పెరుగుతున్నాయిభారతదేశంలో దాదాపు 1 కోటి పెంపుడు కుక్కలు ఉన్నాయి. అయితే వీధికుక్కల జనాభా చాలా ఎక్కువ.2019లో దేశంలో 4,146 కుక్కకాటు కేసులు నమోదై మానవ మరణాలకు దారితీశాయి. 2019 నుంచి దేశవ్యాప్తంగా భారతదేశం 1.5 కోట్లకు పైగా కుక్క కాటు కేసులు వెలుగు చూశాయి. ఉత్తరప్రదేశ్, తమిళనాడు ,మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్నాయి.వీధికుక్కలు రెచ్చగొట్టినా, బెదిరించినా, లేదా తన బిడ్డలకు (కుక్క పిల్లలకు) హాని జరుగుతుందని భావించిన సూడి కుక్క దాడికి తెగబడుతుంది. వీధి కుక్కల దాడులకు దోహదపడే కారకాలు ప్రభుత్వం, జంతు సంక్షేమ సంస్థల నిర్లక్ష్యం మరియు వ్యక్తిగత ఉదాసీనత.వీధి కుక్కల జనాభాను నియంత్రించడానికి సమర్థవంతమైన చర్యలు లేకపోవడం కూడా ప్రధానకారణంగా నిలుస్తోంది.వీధి కుక్కలకు ఆహారం ఇవ్వడం చట్టవిరుద్ధం కానప్పటికీ, వాటికి ఆహారం ఇచ్చినందుకు వ్యక్తులపై దాడి చేస్తున్న ఘటను చూస్తున్నాం.జంతు ఆరోగ్య సంరక్షణ , నియంత్రణ లేకపోవడంఆకలి లేదా ఇన్ఫెక్షన్ కారణంగా వీధికుక్కలు దూకుడుగా మారతాయి.19604 నాటి జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం ప్రకారం వీధి కుక్కలపైక విషప్రయోగం చేయడం చట్టరీత్యా నేరం.వీధి కుక్కల దాడుల సమస్యను పరిష్కరించడానికి మెరుగైన జంతు నియంత్రణ, అవగాహనతోపాటు బాధ్యతాయుతమైన పెంపుడు జంతువుల యాజమాన్యంతో కూడిన సమగ్ర విధానం అవసరం. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూనే జంతువుల పట్ల దయ, కరుణ కలిగి ఉండటం చాలా అవసరం. ఇప్పటికే ఈ నిషేధిత జాతులలో ఏదైనా జాతికి చెందిన కుక్క మీ దగ్గర ఉంటే, వాటి సంతానోత్పత్పిని అరికట్టేలా స్టెరిలైజేషన్ చేయించాల్సి ఉంటుంది. -
కోట్లల్లో పెరిగిపోతున్న పెట్ డాగ్స్ ఇండస్ట్రీ..
పెంపుడు జంతువుల సంరక్షణ మార్కెట్ భారత్‌లో ఏటా 13.9% పెరుగుతోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెంపుడు జంతువుల సంరక్షణ మార్కెట్లలో ఒకటని ఇండియన్ పెట్ ఇండస్ట్రీ జాయింట్ అడ్వైజరీ కౌన్సిల్ (IPICA) పేర్కొంది. దీనికి సంబంధించి జస్ట్ డాగ్స్ మార్కెటింగ్ హెడ్ కషాప్ సంఘాని మాట్లాడుతూ..గతంలో వెటర్నరీ క్లినిక్‌లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పెట్ కేర్ మార్కెట్ విస్తృతంగా అభివృద్ది చెందుతుంది. ఐదేళ్ల క్రితం భారతదేశంలో దత్తత తీసుకున్న పెంపుడు జంతువుల సంఖ్య 28 మిలియన్లు ఇప్పుడు 38 మిలియన్లకు చేరుకుందని, వచ్చే ఐదేళ్లలో అదే సంఖ్య 45 మిలియన్లకు పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. పెంపుడు జంతువుల పరిశ్రమ మొత్తం రూ. 8000 కోట్లని, అందులో 65% భారతదేశంలో పెంపుడు జంతువుల ఆహారమని మార్కెట్ అని పేర్కొన్నారు. భారతీయ పెంపుడు జంతువుల పరిశ్రమ ప్రకారం.. పెంపుడు పిల్లల సంరక్షణ కోసం పెట్ పేరెంట్స్ చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత దత్తత తీసుకోవడం విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం, పెంపుడు జంతువులను ఇంట్లో పిల్లలతో సమానంగా పరిగణిస్తున్నారు. వాటి సంరక్షణ కోసం ఎంత డబ్బైనా వెచ్చిస్తున్నారు. పెంపుడు జంతువుల కోసం నెలకు సగటున రూ. 5వేల నుంచి రూ. 15 వేల వరకు ఖర్చు అవుతుంది. వాటి ఆహారం, దుస్తులు, మందులు,బొమ్మలు.. ఇలా వాటి జాతి, వయస్సు, నగరాన్ని బట్టి ఖర్చు మారుతుంది. బడ్జెట్లో దాదాపు 70%-75% ఎక్కువగా పెట్స్ కోసం ఫుడ్, ట్రీట్మెంట్ కోసమే ఖర్చవుతుంది. పెంపుడు జంతువుల దత్తత పెరగడం ప్రధాన నగరాల్లో మాత్రమే కాదు. ఇది టైర్ 2 మరియు 3 నగరాలకు కూడా విస్తరించింది. దీంతో గత రెండేళ్లలో కొత్తగా 70 పెట్ కేర్ కంపెనీలు ఆవిర్భవించాయి. పెంపుడు కుక్కలలో 6% కుక్కలకు మాత్రమే బ్రాండెడ్ ఆహారం ఇస్తారు. మిగిలినవి దాదాపు ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తింటాయి. ఇక పిల్లుల్లో 2% వాటికి మాత్రమే బ్రాండెడ్ ఆహారం తింటాయని డాగ్-ఓ-బో సహ వ్యవస్థాపకుడు ఇబాదత్ శర్మ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..15 ఏళ్ల క్రితం గ్రూమింగ్ సెలూన్లు లేవు. అప్పట్లో చైనా నుంచి కొన్ని ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పెట్ గ్రూమింగ్ సెలూన్లు చాలా ఉన్నాయి. అన్ని ఉత్పత్తులను భారత్‌లోనే తయారు చేస్తున్నారు. ఇప్పుడు పెట్ డాగ్స్ కోసం స్విమ్మింగ్ పూల్,ప్రత్యేక ఆహారం, డాగ్ ట్రైనర్లు, డాగ్ సిట్టర్లు, డాగ్ రిసార్ట్స్, డాగ్ గ్రూమింగ్ సెలూన్లు, నోబిల్ ట్రీట్మెంట్ వ్యాన్లు, పెట్ ఫుడ్ ఇలా ఎన్నో వచ్చేశాయి. అంతేకాకుండా ఇప్పుడు పెంపుడు జంతువులను రవాణా చేసే స్పెషల్ ట్రాన్స్పోర్ట్ ఏజెంట్లు ఉన్నాయి. TRASNFERET మొబిలిటీ జనరల్ మేనేజర్ బిజు వర్గీస్ ప్రకారం.. గత ఎనిమిదేళ్లలో వారు దాదాపు 8500 పెంపుడు జంతువులను రవాణా చేసినట్లు తెలిపారు. పెట్ కేర్‌లో ముంబై, ఢిల్లీతో పాటు హైదరాబాద్ కూడా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో త్వరలోనే సెవెన్ ఓక్స్ పెట్ అనే అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ పెట్ క్లినిక్ ఏర్పాటు చేయనున్నట్లు మేనేజింగ్ పార్టనర్ అర్చన నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికానికి ఇది రెడీగా ఉంటుందని ఆమె పేర్కొంది. హైదరాబాద్‌ను వెటర్నరీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారని అమెరికికు చెందిన ప్రముఖ వెటర్నరీ డాక్టర్ శ్రీరెడ్డి తెలిపారు. ఇందులో యానిమల్ బ్లడ్ బ్యాంక్, ఎలక్ట్రిక్ శ్మశానవాటిక వంటి అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. -
హైదరాబాద్ : హైటెక్స్‌లో పెటెక్స్–2023 ప్రదర్శన (ఫొటోలు)
-
పెట్స్‌కు బీమా.. యజమానికి ధీమా
సాక్షి, హైదరాబాద్: ప్రాణప్రదంగా పెంచుకున్న పెంపుడు జంతువులకు బీమా కల్పించడం ఇటీవలి కాలంలో అనూహ్యంగా పెరిగింది. ఆపదలో ఉన్న పెట్స్‌కు బీమా రూపంలో ఆపన్న హస్తం అందించేందుకు నగరవాసులు అమితాసక్తి చూపుతున్నారు. ఇటీవలికాలంలో సంపన్న వర్గాలతోపాటు ఎగువ మధ్యతరగతి, మధ్యతరగతికి చెందిన వారు కూడా తమ ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచుకోవడంపై మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ జాతులకు చెందిన కుక్కలు, పిల్లులు, పక్షులకు బీమా సౌకర్యం కల్పించేందుకు పలు ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకొస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో ఇటీవల వేలాది జంతువులకు ఇలాంటి భరోసా కల్పించినట్లు బీమా కంపెనీలు చెబుతున్నాయి. సాధారణ అనారోగ్యం మొదలు చిన్నపాటి సర్జరీలు, కేన్సర్, గుండెజబ్బుల వంటి ప్రమాదకర వ్యాధుల చికిత్సలకు సైతం డబ్బులు చెల్లిస్తారు. వ్యాక్సినేషన్, డీవార్మింగ్, టిక్ట్రీట్మెంట్, డాక్టర్ విజిట్ వంటివి కూడా బీమా పరిధిలోకి రావ డం విశేషం. ఒకవేళ ఆ పెట్ ఆకస్మికంగా మరణించినా యజమానికి బీమా మొ త్తాన్ని చెల్లించే కంపెనీలు కూడా ఉన్నాయి. నెలకు రూ.122 నుంచి 500 వరకు.. సాధారణంగా ఇళ్లలో పెంచుకునే శునకాల జీవితకాలం సుమారు 12 ఏళ్లు ఉంటుంది. అయితే బీమా కంపెనీలు రెండు నెలల నుంచి 8 ఏళ్ల మధ్య వయసున్న కుక్కలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నాయి. రూ.40 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు బీమా సదుపాయం కల్పిస్తున్నాయి. ఇందుకోసం పెట్స్ యజమానులు నెలకు రూ.122 నుంచి 500 వరకు ప్రీమియంగా చెల్లిస్తున్నారు. పెంపుడు జంతువులకు అనారోగ్యానికి నెలకు రూ.8 వేల నుంచి 10 వేల వరకు ఖర్చు చేస్తున్న వారికి ఈ బీమా ఆర్థికంగా బాగా కలిసివస్తుందని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. పెట్స్‌కు చికిత్సకయ్యే ఖర్చులో 80 శాతం వరకు కంపెనీ చెల్లిస్తుంది. కేన్సర్, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు తదితర ప్రమాదకర వ్యాధుల సర్జరీలకు సుమారు రూ.2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. ఈ చికిత్సలు కూడా బీమా పరిధిలోకి వస్తాయి. ముందుకొస్తున్న కంపెనీలు.. పెట్స్‌కు బీమా సౌకర్యం కల్పిస్తున్న వాటిలో పాటెక్టో వెటీనా హెల్త్‌కేర్ ఎల్ఎల్పీ, న్యూ ఇండియా అస్యూరెన్స్, పావ్ ఇన్సూరెన్స్ తదితర కంపెనీలున్నాయి. ఈ బీమా వ్యాపారం లాభసాటిగా ఉండటంతో ఇతర కంపెనీలు సైతం ఈ రంగంలోకి వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నగరంలో పెట్స్‌ను విక్రయించే దుకాణాలు, వాటికి అవసరమైన ఆహారం, మందులు అందించే సంస్థలు సైతం బాగా విస్తరించాయి. ఇదే క్రమంలో బీమా సదుపాయం రావడంతో పెంపుడు జంతువుల బతుకులకు భరోసా లభిస్తోందని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. పెట్స్ బీమా అత్యవసర జాబితాలోకి.. ఇçప్పుడు పెట్స్ ఇన్సూరెన్స్ కూడా అత్యవసర జాబితాలోకి చేరింది. హెల్త్‌కేర్, సర్జరీ వంటివి యజమానికి భారం కాకుండా పలు బీమా కంపెనీలు పాలసీలు ఇస్తున్నాయి. ఎక్కువ మంది నగరవాసులు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. –డాక్టర్ ఎం.అరుణ్‌కుమార్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, సరూర్‌నగర్ ప్రైమరీ వెటర్నరీ సెంటర్ -
రష్మిక ఇంటికి కొత్త అతిథి.. ‘3 ఏళ్లలో నా ఇల్లు అడవిగా మారుతుందేమో’
‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. భాషతో సంబంధం లేకుండా వరుస టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లో పలు సినిమాలు చేస్తోంది. అయితే హీరోయిన్గా ఎంత బిజీగా ఉన్న ఎప్పటికప్పుడు తన తాజా అప్డేట్స్ ఇస్తూ నెట్టింట ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. అందుకే ఆమెకు తెరపై మాత్రమే కాదు సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే రష్మికకు పెట్స్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ఇప్పటికే ఆమె ఆరా అనే పెట్ డాగ్‌ను పెంచుకుంటుంది. తాజాగా ఆమె తన ఇంటికి మరో కొత్త అతిథికి స్వాగతం పలికింది. తన పేరు స్నో అంటూ ఫాలోవర్స్‌కు పరిచయం చేసింది రష్మిక. చదవండి: విజయ్‌తో డేట్‌కి వెళ్తానన్నా సారా.. లైగర్ రియాక్షన్ చూశారా! ఇంతకి ఆ కొత్త అతిథి ఎవరంటే మరో పెంపుడు జంతువు పిల్లి. దానిని ముద్దుగా స్నో అని పిలుచుకుంటుందామె. ఈ సందర్భంగా స్నోతో కలిసి దిగిన ఫొటోలు, వీడియోను షేర్ చేస్తూ రష్మిక ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది. ‘ఇది నా కొత్త పెట్ స్నో. ఇంకో 3 సంవత్సరాల్లో నా ఇల్లు చిన్నపాటి అడవిగా మారుతుందేమో’ అంటూ క్రేజీ క్యాప్షన్ జత చేసింది. అలాగే తన పెట్స్(కుక్క, పిల్లి) బెడ్‌పై ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. వాళ్లిద్దరు నా కోసం ఎలా ఎదురు చూస్తున్నాయో చూశారా.. మీకు తెలుసా ఇమ్మా ఇప్పుడు ఏడుస్తుంది. నా గుండె నిండిపోయింది’ అంటూ ఎమోషనల్ ఏమోజీని జత చేసింది. ఇదిలా ఉంటే రష్మిక ప్రస్తుతం పుష్ప 2, రణ్‌బీర్ కపూర్ యానిమల్, విజయ్ వరిసు(తెలుగులో వారసుడు) చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
పెంపుడు కుక్కకు హెయిర్ డై, లక్షలు ఖర్చు చేసిన మోడల్
సోషల్ మీడియాను సెలబ్రెటీలు బాగా ఉపయోగించుకుంటున్నారు. వారి సంబంధించిన ప్రతి యాక్టివిటీని, వ్యక్తిగత విషయానలు ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేసుకుంటుంటారు. అందుకే నెటిజన్లు ఎక్కువ సమయం సామాజిక మాధ్యమాలకు కెటాయిస్తారు. వారి ప్రతి అడుగును గమనిస్తూ వారిని నిత్యం ఫాలో అవుతుంటారు. అలా వారు పెట్టిన పోస్టులను వైరల్ చేస్తుంటారు. అయితే కొన్ని సార్లు వారు చేసే పోస్ట్స్ నచ్చితే నెటిజన్లు వారిని ఆకాశానికి ఎత్తేస్తారు.. అదే పోస్టులు బెడిసికొట్టితే మాత్రం ట్రోల్స్ చేస్తూ ఆడేసుకుంటారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి చెదు అనుభవాలను సెలబ్రెటీలు చాలానే ఎందుర్కొంటున్నారు. చదవండి: ఆ నటుడితో పీకల్లోతు ప్రేమలో బిగ్‌బి మనవరాలు! తాజాగా రష్యన్ మోడల్‌కు ఇలాంటి సంఘటనే ఎదురైంది. తాను చేసిన పనికి గర్వపడుతూ సోషల్ మీడియాలో షేర్ చేసి చేదు అనుభవాన్ని ఎదుర్కొంది రష్యన్ మోడల్ అన్నా స్టూపక్. అయితే సెలబ్రెటీలకు ఎక్కువగా పెట్స్‌ని ఇష్టపడతారనేది తెలిసిన విషయమే. వాటికి కాస్తా సమయం ఎక్కువగా కేటాయిస్తుంటారు. ఖాళీ సమయంలో వాటితో ఆడుకుంటూ రిలాక్స్ అవుతుంటారు. ఇంకా కొంతమంది అయితే ఎక్కడికి వెళ్లిన పెట్స్‌ని తమ వెంట తీసుకేళ్తారు. వాటిపై ప్రత్యేకంగా శ్రద్ధా పెడుతుంటారు. చెప్పాంటే సొంత మనిషిలా చూసుకుంటారు. ఈ క్రమంలో ఓ మోడల్ తన పెంపుడు కుక్కపై ఇంకాస్తా ఎక్కువ శ్రద్ద పెట్టింది. చదవండి: ముంబై వెళ్లి సల్మాన్‌ను ప్రత్యేకంగా కలిసిన జక్కన్న, అందుకేనా? అదే విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ పంచుకుంది. అది కాస్తా బెడిసి కొట్టడంతో నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మీకు తెలిసిందే. నెటిజన్లకు కోపం వస్తే ఏం చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అవును ఎప్పటి లాగే ఆమెను సోషల్ మీడియాలో ఆడేసుకున్నారు. ఇంతకి నెటిజన్లకు కోపం తెప్పించిన విషయకం ఏంటంటే కాస్తా కుక్క హేర్‌కు డై చేయించింది. నియాన్ ఆరెంజ్‌తో పూర్తిగా కుక్కకు కలర్ డై చేయించిందట. దీని కోసం ఆమె ఏకంగా రూ. 5వేల యూరోలు(భారత కరెన్సీలో 5 లక్షల రూపాయలు). ఈ విషయాన్ని స్వయంగా సదరు మోడల్ చెప్పుకొచ్చింది. ఇంకేముంది మోడల్ చేసిన పనికి నెటిజన్లు ఆమెపై మండిపుడుతున్నారు. మీ సరద కోసం మూగ జీవిని హింసించడం ఏంటంటూ తమదైన శైలిలో ఆమెను తిట్టిపోస్తున్నారు. దీంతో అన్నా స్టూపక్ వార్తల్లోకి ఎక్కింది. View this post on Instagram A post shared by Anna Stupak (@anna3.0.5) -
బైడెన్ రాకతో అక్కడ పెంపుడు జంతువుల సందడి!
వాషింగ్టన్: ఒబామా అనంతరం పెంపుడు జంతువులు లేకుండా పోయిన వైట్‌హౌస్‌లోకి మరలా బైడెన్ రాకతో పెంపుడు జంతువుల సందడి మొదలైంది. బైడెన్‌కు చెందిన రెండు జర్మన్ షెపర్డ్ కుక్కలు ఛాంప్, మేజర్ వైట్‌హౌస్‌లోకి కాలుమోపాయి. వైట్‌హౌస్‌లో కుదురుకున్నతర్వాత కుక్కలను తెచ్చుకోవాలని బైడెన్ కుటుంబం భావించిందని జిల్‌బైడెన్ ప్రతినిధి మైఖెల్ లారోసా చెప్పారు. వీటిలో మేజర్ అనే కుక్కతో ఆడుకుంటూ గతేడాది బైడెన్ కిందపడిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం ఈ రెండూ వైట్‌హౌస్‌లో తమకు కేటాయించిన బెడ్స్‌ను ఎంజాయ్ చేస్తున్నాయని మైఖెల్ చెప్పారు. మేజర్ డాగ్‌ను బైడెన్ 2018లో డెలావర్ హ్యూమనె అసోసియేషన్ నుంచి దత్తత తీసుకున్నారు. బజారు కుక్క నుంచి దేశ ఫస్ట్ డాగ్‌గా మేజర్ జర్నీని పురస్కరించుకొని ఈ అసోసియేషన్ గతవారం ఫండ్ రైజింగ్ చేసి 2 లక్షల డాలర్లు సమీకరించింది. త్వరలో బైడెన్ కుటుంబం ఒక పిల్లిని కూడా తెచ్చుకోవాలని భావిస్తున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. గతంలో ధియోడర్ రూజ్వెల్ట్, హార్డింగ్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, ట్రూమన్, జార్జ్‌బుష్, క్లింటన్, ఒబామాలు తమ తమ పెంపుడు జంతువులను వైట్‌హౌస్‌లో తమతో ఉంచుకున్నారు. -
లెక్కలున్నాయి.. జాగ్రత్త!
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ నిబంధనల మేరకు ప్రతి పెంపుడు కుక్క(పెట్‌డాగ్)కూ లైసెన్సు ఉండాలి. గ్రేటర్ నగరంలో దాదాపు 50 వేల పెట్‌డాగ్స్ ఉన్నప్పటికీ, ఇందులో లైసెన్సులున్నవి ఆరువేలు మాత్రమే. ఇందుకు కారణాలనేకం. తీసుకోవాలని తెలియనివారు కొందరు కాగా.. తెలిసినా దాన్నిపొందేందుకు జీహెచ్ఎంసీ కార్యాలయాల చుట్టూ తిరగలేక, దరఖాస్తులోని వివరాలు భర్తీ చేసి, అవసరమైన ధ్రువీకరణలు అందజేయలేక ఎంతోమంది నిరాసక్తత కనబరుస్తున్నారు. ఈ పరిస్థితి నివారణతోపాటు .. జీహెచ్ఎంసీలో పెట్‌డాగ్స్ డేటాబేస్ కోసం..పెట్ లవర్స్‌కు ఎప్పటికప్పుడు యానిమల్ వెల్ఫేర్‌బోర్డు నుంచి అందే సూచనలు, సలహాలు తెలియజేసేందుకు, నిర్ణీత వ్యవధుల్లో యాంటీర్యాబిస్ వ్యాక్సిన్ వేయించేలా అలర్ట్ చేసేందుకు, ఇతరత్రా విధాలుగా వినియోగించుకునేందుకు ఆన్లైన్ డేటా అవసరమని జీహెచ్ఎంసీ భావించింది. చదవండి: ‘పెట్’.. బహుపరాక్! దాంతోపాటు లైసెన్సుల కోసం ప్రజలు కార్యాలయాల దాకా రానవసరం లేకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ ఆన్లైన్ ద్వారానే పెట్‌డాగ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకునేందుకు, ప్రతియేటా రెన్యూవల్స్‌కు ఆన్లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్లోనే ఈ ప్రక్రియను పూర్తిచేస్తే లైసెన్సు జారీ అవుతుంది. టోకెన్ కోసం మాత్రం ఒక్కసారి కార్యాలయానికి వెళ్తే సరిపోతుంది. లైసెన్సు పొందిన ప్రతికుక్కకూ యూనిక్‌ఐడీ ఉంటుంది. అది జీవితకాలం పనిచేస్తుంది. ప్రతియేటా లైసెన్సు రెన్యూవల్, ఇతరత్రా అవసరమైన సందర్భాల్లో ఐడీ ఉంటే చాలు. చదవండి: పాపం: ఇరుకింట్లో 164 కుక్కలు ► జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లోని సంబంధిత లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత అధికారులు పరిశీలించాక లైసెన్స్ ఇస్తారు. దాంట్లో జీహెచ్ఎంసీ జోన్, లైసెన్సు నెంబర్, తదితర వివరాలుంటాయి. ► దరఖాస్తులో యజమాని వివరాలతోపాటు కుక్క పేరు, ఆడ/మగ, రంగు, బ్రీడ్ ఆఫ్ డాగ్, ఐడెంటిఫికేషన్ మార్క్స్, వయసు, వ్యాక్సిన్ వేయించిన తేదీ, రెన్యూవల్స్‌కు టోకెన్ నంబర్‌ను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసేముందు కావాల్సినవి.. ► మొబైల్ నెంబర్ u ఇటీవలి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కాపీ ► ఇరుగుపొరుగు ఇద్దరి నుంచి ఎన్ఓసీ ► నివాస ధ్రువీకరణకు (విద్యుత్ బిల్/వాటర్‌బిల్/హౌస్ ట్యాక్స్ బిల్/ఆధార్/డ్రైవింగ్ లైసెన్స్) కాపీ. ► ఆన్లైన్లో రూ.50 చెల్లించాలి. -
వీటి పేర్లు చెప్పుకోండి చూద్దాం!
పెట్ లవర్స్.. వీరి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనుషుల మీద ఎంత ప్రేమ చూపిస్తారో అంతకంటే పెంపుడు జంతువులపై ఒకింత ప్రేమ ఎక్కువే. ప్రతి విషయంలోనూ వాటిని ఇంట్లో మనుషుల్లాగానే జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే ఎక్కువ మంది పెట్స్‌లో కుక్కలను పెంచుకునేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతారు. వీరిలో సెలబ్రిటీలూ లేకపోలేదు. నటి అక్కినేని అమల.. జంతు ప్రేమికురాలు అన్న విషయం తెలిసిందే. ఆమె బ్లూ క్రాస్ సొసైటీలో పనిచేస్తున్నారు. ఇక ఆ ఇంటికి పెద్ద కోడలిగా అడుగు పెట్టిన సమంతకు కూడా పెంపుడు జంతువులంటే పిచ్చి. ప్రస్తుతం సమంత ఇంట్లో రెండు జాతుల కుక్కలు ఉన్నాయి. (108 సార్లు సూర్య నమస్కారాలు: సమంత) సామ్‌కు ఆ కుక్కలంటే చచ్చేంత ప్రేమ. వీటిని అత్యంత ప్రేమగా, అపురూపంగా చూసుకుంటారు. సామ్, నాగ చైతన్య ఇద్దరు వాటికి హానీ కలగకుండా కంటికి రెప్పలా జాగ్రత్తగా పెంచుకుంటారు. ఎక్కడికి వెళ్లిన తమ వెంట ఇవి ఉండాల్సిందే. లాక్డౌన్ కారణంగా ఖాళీ సమయం దొరకడంతో ఈ రెండు కుక్కలతో ఎంజాయ్ చేస్తున్నారు. వీటితో సరదాగా గడుపుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. మరి సమంత పెంచుకునే కుక్కలా పేర్లు ఎంటో తెలుసా.. (నితిన్ సినిమాకు నో చెప్పిన బుట్టబొమ్మ!) ‘ముకుంద’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే అనంతరం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా ఎదిగారు. అరవింద సమేద, అల వైకుంఠపురములో వంటి వరుస సక్సెస్‌లతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్‌తో జోడీగా రాధే శ్యామ్ సినిమాతో పాటు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లోనూ నటిస్తున్నారు. ఇక చాలామందికి తెలియని విషయమేంటంటే పూజా కూడా జంతు ప్రేమికురాలే. ప్రస్తుతం ఆమె వద్ద ఓ జాతి కుక్క ఉంది. దానితోనూ ఎంతో సమయం కేటాయిస్తూ ఆనందంగా గడుపుతారు. ఈ ఫోటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్, ట్విటర్లోనూ షేర్ చేస్తూ ఉంటారు. మరి పూజా పెంచుకుంటున్న కుక్క పేరు మీకు తెలుసా.. వీలైతే కనుక్కునేందుకు ప్రయత్నించండి. ఒకవేళ మీ వాళ్ల కాదు అంటే ఇక మేమే సమాధానం చెప్పేస్తాం.. సమాధానాలు.. సమంత పెంపుడు కుక్కల పేర్లు :హాష్ అక్కినేని, డ్రోగో అక్కినేని పూజా హెగ్డే పెంపుడు కుక్క పేరు : బ్రూనో -
పెట్.. మా ఇంటి నేస్తం
‘‘‘పెట్ అంటే పంచ ప్రాణాలు.. పెట్ కోసం ఏదైనా చేసేందుకు, ఎంతఖర్చు చేసి కొనేందుకు పెట్ లవర్స్ వెనకడుగు వేయట్లేదు. తమ పిల్లల్ని ఎంత గారాబంగా చూసుకుంటారో.. అంతకంటే ఎక్కువగా పెట్‌ను చూసుకుంటున్నారు. కుక్కల పెంపకంపై నగరవాసులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. మార్కెట్, షాపింగ్, పార్లర్, ఫంక్షన్ ఇలా ఎక్కడికెళ్లినా స్నేహితుడిలా, ఆప్తుడిలా, కాపలాదారుడిలా వెంట తెచ్చుకుంటూ మురిసిపోతున్నారు. సిటీలో పలు దేశాలకు చెందిన కుక్కలు సందడి చేస్తున్నాయి. ఓనర్స్ వాటిని ఎంతో ఖర్చుతో కొనుగోలు చేసి మరీ వాటిని లక్కీగా చూసుకుంటున్నారు. నేడు ప్రపంచ జూనోసెస్ డే. జూనోసెస్ డేను పురస్కరించుకుని సిటీలో తారసపడుతున్న కుక్కలు, సర్వీసెస్, రెస్టారెంట్స్ తదితర వాటిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.’’ -చైతన్య వంపుగాని సాక్షి, హైదరాబాద్ : నిషి జీవితంలో పెంపుడు జంతువులు ఒక భాగమయ్యాయి. కుక్క, పిల్లి, కుందేలు లాంటివి పెంచుకోవడం చాలా మందికి ఇష్టం. అయితే నగరవాసులు ఎక్కువగా కుక్కల్ని పెంచుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంట్లో పిల్లల మాదిరిగా కుక్కకు కూడా ప్రత్యేక గుర్తింపును ఇస్తున్నారు. కుక్క బిక్కమొహం పెట్టినా, మౌనంగా ఉన్నా భరించలేరు. వెంటనే వైద్యుడిని సంప్రదించి కావాల్సిన వైద్యాన్ని అందిస్తారు. ప్రపంచంలోని పలు జాతులకు చెందిన కుక్కలు ఎంత రేటైనా పెట్టి మరీ ఇతర దేశాల నుంచి ఇక్కడకు తెప్పించుకుంటున్నారు. ఇంట్లోని పిల్లలను ఏ విధంగా అయితే అల్లారుముద్దుగా చూసుకుంటున్నారో.. అలాగే పెట్స్‌ను కూడా చూసుకుంటూ వాటిపై ఉన్న మమకారాన్ని బాహ్యప్రపంచానికి వ్యక్తం చేస్తున్నారు. జూనోసిస్ డే అని ఎందుకు అంటారు జంతువులకు వాటి నుంచి మనుషులకు సక్రమించే వ్యాధులను ‘జోనోటిక్’ అంటారు. ఈ వ్యాధుల్లో రేబిస్ ప్రధానమైంది. లూయీపాశ్చర్ 1885 జూలై 6న యాంటీరేబిస్ వ్యాక్సిన్‌ను తొలిసారిగా ఉపయోగించారు. అందుకే ఈ దినాన్ని జోనోసెస్ డే అని అంటారు. అంతేకాదు యాంటీ రేబిస్ డేగా కూడా పిలుస్తారు. ఇవి నాలుగో సింహాలు ► పోలీస్ కుక్కలు భారతమాత చిత్రాన్నీ గుర్తించి సలాం చేస్తాయి.. ► మాస్టర్ మినహా ఇతరులు ఇచ్చిన ఆహారం తీసుకోవు.. ► నడుస్తున్న వాహనాల్లోంచీ దూకి టార్గెట్‌ను అడ్డుకుంటాయి. ► మనం ఇంట్లో పెంచుకునే పెట్స్‌పై అమితమైన ప్రేమను చూపిస్తాం. అవి ఏవైనా చిన్న పనులు చేస్తే చాలు మురిసిపోతుంటాం. అయితే పోలీసు పెట్స్ చాలా డిఫ్రెంట్. అవి పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలను, నేరగాళ్ల జాడను ఇట్టే పసిగట్టేస్తాయి. ఎంతటి వారైనా సరే తప్పు చేసి ఎంత దూరం పరిగెత్తినా సరే వారి భరతం పట్టడంలో పోలీసు కుక్కలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. మొయినాబాద్‌లోని ఇంటిగ్రేడెట్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (ఐఐటీఏ)లో శిక్షణలో ఏడు జాతులకు చెందిన 49 జాగిలాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఆరితేరాయి... ► ఈ జాగిలాలు నిత్యం ఇష్టంగా తినే ఆహారాన్నైనా ఎవరు పడితే వాళ్లు పెడితే ముట్టవు. కేవలం హ్యాండ్లర్ లేదా మాస్టర్ ఇస్తేనే స్వీకరిస్తాయి. విషప్రయోగాలకు ఆస్కారం లేకుండా శిక్షణ ఇస్తారు. ► కదులుతున్న వాహనం నుంచి అమాంతం కిందికి దూకడంతో పాటు టార్గెట్‌ను కరిచి పట్టుకుని కదలకుండా చేస్తాయి. ► హ్యాండ్లర్ ఇచ్చిన కమాండ్స్‌ను స్పష్టంగా అర్థం చేసుకోవడంతో పాటు తూ.చ. తప్పకుండా పాటిస్తాయి. ► ఇండియా మ్యాప్‌ను స్పష్టంగా గుర్తించడంతో పాటు రెండు కాళ్లూ ఎత్తి నమస్కరిస్తాయి. ► బాంబులు, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలు, అనుమానిత వస్తువులు, నేరగాళ్ల జాడ కనిపెట్టడంలోనూ నిష్ణాతులుగా మారాయి. ప్రముఖులకు పుష్పగుచ్ఛాలు అందించడం, చిన్న చిన్న పనులు చేస్తూ హ్యాండ్లర్లకు సహకారం అందిస్తాయి. పెట్స్ వెకేషన్ కుటుంబం అంతా కలసి ఏదైనా ఊరు వెళ్లాలి అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది పెట్. దీనిని ఎలా తీసుకెళ్లాలి, ట్రావెలింగ్‌లో ఏదైనా ఇబ్బంది వస్తదేమోనని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటాం. ఇటువంటి వారి కోసం ‘పెట్ ఏ టౌలీ’ అనే పేరుతో పెట్ వెకేషన్‌ను ప్రారంభించారు నగరానికి చెందిన శుభా మంజూష. ఏదైనా ఊరికి వెళ్లేప్పుడు మన పెట్ని ఇక్కడ వదిలేసి వెళ్తే వీళ్లే అన్ని అవసరాలు చూసుకుంటారు. గ్రూమింగ్ కూడా చేస్తారు. ఎప్పటికప్పుడు పెట్ యజమానికి పెట్ గురించి సమాచారం ఇస్తుంటారు. 15 నుంచి నెల రోజుల వరకు కూడా ఇక్కడ ఉంచొచ్చు. విదేశాల నుంచి దిగుమతి చిహౌహుహా, బీగిల్, దాల్మటియన్, న్యూఫౌండ్‌ల్యాండ్, సెయింట్ బెర్నార్డ్, రాట్వెల్లర్, గ్రేట్‌డేన్, రోడి షియన్ రిడ్జ్‌బ్యాక్, ఆఫ్ఘన్హౌండ్, బుల్మస్తిఫ్, షిట్జూ, లసాప్సో, ‘పమేరియన్, జర్మన్షెప్పర్, లేబ్రడార్, పగ్(హట్చ్ కుక్కపిల్ల), గ్రేట్డీన్, చోచో, టెర్రియర్, డాబర్‌మ్యాన్, బుల్డాగ్, మస్టిఫ్, గోల్డెన్ రిట్రవర్, షిట్జూ’లతో మరికొన్ని జాతి కుక్కలు మనకు ఇక్కడ నిత్యం కనిపిస్తుంటాయి. మన దేశానికి చెందిన జాతి కుక్క అయితే ‘మాంగ్రిల్’ ఒక్కటే అని చెప్పొచ్చు. లంచ్ విత్ పెట్స్ వీకెండ్, ఫెస్టివల్ సమయంలో ఫ్రెండ్స్‌తో కలిసి మనం లంచ్‌ను ప్లాన్ చేసుకోవడం ఆనవాయితీ. మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే పెట్స్‌ను ఆ సమయంలో ఇంట్లో పెట్టి లంచ్‌కు వెళ్లిపోతాం. అయితే ఈ స్టైల్‌కి స్వస్తి పలికి లంచ్విత్ పెట్స్ అనే కాన్సెప్ట్‌తో హోటల్ తాజ్‌కృష్ణా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సిటీలో ఉన్న పెట్ లవర్స్ అంతా ప్రతి నెలా మొదటి వారంలో తాజ్‌కృష్ణాలో ‘లంచ్ విత్ పెట్స్’కి వెళ్తున్నారు. సరదాగా పెట్స్‌కు నచ్చిన ఫుడ్ ఐటంలను ఆర్డర్ చేసుకోవచ్చు. మనకు నిచ్చినవి కూడా తినేయోచ్చు. పసందైన రెస్టారెంట్ ► పెట్స్‌కు వినూత్న సేవలు అందిస్తున్న గచ్చిబౌలిలోని ‘కేఫే దె లోకో’ ► బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా మనం మనకు సంబంధించిన బర్త్‌డే, పెళ్లిరోజు వంటి ఫంక్షన్లను ఖరీదైన ప్రదేశాల్లో జరుపుకుంటుంటాం. మరి మనం అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న మన పప్పీల సంగతేంటీ? వాటికి ఉన్నాయి మంచి రెస్టారెంట్లు. వెజ్ నాన్ వెజ్లలో 20కి పైగా వెరైటీల్లో గచ్చిబౌలిలో ‘కేఫే దె లోకో’ పేరుతో హేమంత్, మంచి రుచి ఏర్పాటు చేశారు. మనమే కాకుండా మన పెట్స్‌కి కూడా రెస్టారెంట్‌కు తీసికెళ్లి మంచి విందును ఆరగించే ఏర్పాట్లు చేయోచ్చు. ఫీడింగ్ విధానం ఇదీ కుక్క జాతి మాంసాహారి.. వీటికి మాంసానికి సంబంధించిన ఫుడ్ ఐటంలు పెడితేనే ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం పలు కంపెనీలు కూడా ప్యాకెట్ ఫుడ్స్ అందిస్తున్నాయి. ఇంట్లో ఉన్న పెట్స్‌కు ‘పాలు, ఉడకబెట్టిన గుడ్డు, రొట్టె’లతో పాటు విటమిన్స్, మినరల్స్ ఉన్న మందులు వాడితే ఆరోగ్యంగా ఉంటాయి. బ్రీడింగ్ విధానం ఇలా.. ► ప్రతి ఆడకుక్క 8నెలలకు హీట్‌కి వస్తుంది. ► కుక్క గర్భం దాల్చాలంటే సమయం ఏడాది. ► ఏడాది దాటాక దాన్ని క్రాసింగ్‌కు పంపాలి. ► ఏడాది దాటాక స్వజాతి కుక్కతోనే క్రాసింగ్ చేయించాలి. ► ఒక్క గర్భంలో 4నుంచి 8 పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ► క్రాసింగ్ అయ్యాక 62రోజులకు డెలవరీ అవుతుంది. ► పుట్టిన పిల్లలు 14రోజులకు కళ్లు తెరుస్తాయి. ► పిల్లలకు తల్లి పాలతో పాలు చాలకపోతే ప్యాకెట్ పాలు ఇవ్వొచ్చు. ► మొదటి నెల రోజుల ఎదుగుదలే ప్రాముఖ్యం. పాలతో పాటు అదనంగా సెరిలాక్, ఉడకబెట్టిన గుడ్డును కూడా ఇవ్వొచ్చు. ► ఆరోగ్యంగా ఉండేందుకు నట్టల మందును 21వ రోజుకు ఇవ్వాలి .రెండు రాష్ట్రాల్లో ఏకైక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రోజు రోజుకు మనుషులతో పాటు కుక్కలు సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ తరుణంలో కుక్కలకు ఏమైనా జబ్బులు వస్తే వాటికి చికిత్స చేసేందుకు ఆసుపత్రుల సంఖ్య తక్కువగా ఉందనే చెప్పాలి. నారాయణగూడలో ఉన్న ‘వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్’ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకైక హాస్పిటల్. ఇక్కడ ‘ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్, ఆపరేషన్ థియేటర్’ సౌకర్యాలు ఉన్నాయి. ఐదుగురు వైద్యుల పర్యవేక్షణలో ఇక్కడ హాస్పిటల్ నడుస్తోంది. గ్రామాల్లో, మండలాల్లో, సిటీల్లో కూడా నయంకాకపోతే ఇక్కడకు తీసుకొస్తారు. ఇక్కడ వైద్యుల పర్యవేక్షణలో జబ్బును నయం చేసి ఇంటికి పంపిస్తామని డాక్టర్ స్వాతి తెలిపారు. నెక్లెస్‌రోడ్డులో విహారం సిటీలో ఉన్న పెట్స్ దాదాపు ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం నెక్లెస్ రోడ్డుకు వస్తుం టాయి. వాటి యజమానులు వాటిని సరదాగా విహారానికి తీసుకొస్తారు. దీనిని డాగ్స్ పార్క్ అని కూడా పిలుస్తారు. కొన్ని వందల పెట్స్ అన్నీ ఒకే చోటకు చేరి ఆహ్లాదంగా, ఆనందంగా గడుపుతుంటాయి. పెట్స్ యజమానులు కూడా ఒకరికొకరు ఇంట్రాక్ట్ అవుతూ తమ తమ పెట్స్ విశేషాలను షేర్ చేసుకుంటుంటారు. తప్పక పాటించాల్సినవి ► పెంపుడు జంతువులు నాకిన శరీర భాగాల్ని సబ్బుతో శుభ్రపర్చుకోవాలి. ► కుక్కలను ఎక్కువగా ముట్టుకోవద్దు. ముట్టుకుంటే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ► వైద్యుల సలహా మేరకే పెంపుడు జంతువులకు ఆహారాన్ని అందించాలి. ► బైక్‌పై తీసుకెళ్లాలనుకుంటే మౌత్గ్యాగ్ తప్పనిసరిగా అమర్చాలి. -
ఇక 'కీలు' గుర్రమే!
హైదరాబాద్: ఖర్చుకు వెనుకాడకుండా పెంపుడు జంతువులకు అధునాతన వైద్యం అందిస్తున్నారు జంతుప్రేమికులు. ఆసియాలోనే మొదటిసారిగా డ్యూయల్ హిప్ రిప్లేస్మెంట్(తుంటి ఎముక కీలు మార్పిడి) శస్త్ర చికిత్సకు నగరంలోని ‘డాక్టర్ డాగ్ పెట్’హాస్పిటల్ వేదికగా నిలిచింది. డాక్టర్ ఎన్.రమేశ్ ఆది వారం శస్త్రచికిత్స వివరాలను వెల్లడించారు. బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారవేత్త శ్రీనివాస్ ఎనిమిదేళ్లుగా లాబ్రడార్ జాతి శునకాన్ని పెంచుకుంటున్నారు. ఈ శునకం కొంతకాలంగా తుంటి కీలు నొప్పితో సతమతమవుతోంది. దీంతో బం జారాహిల్స్‌లోని డాక్టర్ డాగ్ పెట్ హాస్పిటల్‌కు శునకాన్ని తీసుకెళ్లారు. శునకాన్ని పరిశీలించిన డాక్టర్ రమేశ్ వివిధ పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స అవసరమని నిర్ధారించారు. విదేశాల నుంచి పరికరాలను తెప్పించి ఈ నెల 17న డ్యూయల్ హిప్ రిప్లేస్మెంట్ శస్త్రచికిత్స నిర్వహించారు. నాలుగు గంటలపాటు వైద్యుల బృందం నిర్వహించిన ఆపరేషన్ విజయవంతమైంది. ప్రస్తుతం శునకం కోలుకుంటోంది. మరో రెండ్రోజుల్లో పూర్తిస్థాయిలో నడుస్తుందని డాక్టర్ రమేశ్ తెలిపారు. పెంపుడు జంతువుల్లో సైతం.. పెంపుడు జంతువుల్లో ఆర్థరైటిస్ సమస్య వస్తుందని డాక్టర్ రమేశ్ తెలిపారు. అయితే, డ్యూయల్ హిప్ రిప్లేస్మెంట్ మాత్రం ఇప్పటివరకు ఎక్కడా నిర్వహించలేదన్నారు. మనుషుల్లో సైతం తుంటి కీలు, మోకాళ్ల చిప్పల మార్పిడి అనేవి సాధారణమయ్యాయని చెప్పారు. పెంపుడు జంతువుల్లో సైతం ఈ చికిత్స అవసరముంటుందని చెప్పారు. ఆసియాలోనే మొదటిసారిగా శునకానికి డ్యూయల్ హిప్ రిప్లేస్మెంట్ చికిత్స నిర్వహించినట్లు వివరించారు. -
అనుకోని అతిథి!
అటెన్షన్ ప్లీజ్! స్పీకర్స్‌లో మృదువుగా ఎయిర్‌హోస్టెస్ వాయిస్! ప్రయాణికులు ఒక్కొక్కరుగా విమానం ఎక్కుతున్నారు. లోపలికి అడుగు పెట్టగానే షాక్! ఎదురుగా సీట్లో దర్జాగా ఆశీనుడై ఉన్నాడో అనుకోని అతిథి! ఉలుకు... బెరుకు లేదు! హుందాగా కూర్చుని... వచ్చినవారందరినీ ఓ లుక్ వేస్తున్నాడు. అలాగని ఏ ఫుట్‌బాల్ స్టారో కాదు. హాలీవుడ్ సూపర్స్టారూ కాదు. ‘రెక్కలు తొడిగి’ మనం గగనంలో విహరిస్తుంటే... ‘రెక్కలు ముడిచి’ తన యజమానితో కలసి విమానంలో ఎగిరేందుకు సిద్ధంగా ఉన్నాడా అతిథి. ఇంతకీ ఎవరనేగా..! టర్కీ కోడి! సన్నివేశం చూసి ఓ క్షణంపాటు నిశ్చేష్టు లైనా... ఆ వెంటనే తేరుకుని అబ్బురంగా సెల్ కెమెరాల్లో ‘క్లిక్’మనిపించారు ప్రయాణికులు! అలా తీసిందే ఈ చిత్రం. ఓ ఫ్లయిట్ అటెండెంట్ మిత్రుడు సామాజిక మాధ్యమంలో దీన్ని షేర్ చేస్తే వేల కొద్దీ లైక్‌లు కొట్టేస్తోంది. ‘షేరింగ్’లతో నెట్టింట పాకేస్తోంది. ‘భావోద్వేగ మద్దతునిచ్చే జంతువుల’ కోటాలో ఈ కోడి విమానం ఎక్కేసింది. విమాన ప్రయాణమంటే ఉండే ఉత్సుకత, భయం దరిచేరకుండా ఉండేందుకు అమెరికాలోని కొన్ని ఎయిర్‌లైన్స్ శునకం తదితర తమ పెంపుడు జంతువులను వెంట తెచ్చుకోవడానికి ప్రయాణికులకు అనుమతినిస్తున్నాయి. ఇందుకు గాను కొన్ని అదనపు చార్జి వసూలు చేస్తుండగా, కొన్ని ఉచితంగా ఈ సేవలందిస్తున్నాయి. అన్నట్టు... యూకేలో కూడా ఈ తరహా వెసులుబాటు ఉంది.