రష్మిక ఇంటికి కొత్త అతిథి.. ‘3 ఏళ్లలో నా ఇల్లు అడవిగా మారుతుందేమో’ | Rashmika Mandanna Introduce Her New Pet Cat Snow See Pics | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: రష్మిక ఇంటికి కొత్త అతిథి.. ‘3 ఏళ్లలో నా ఇల్లు అడవిగా మారుతుందేమో’

Published Wed, Jul 13 2022 3:26 PM | Last Updated on Wed, Jul 13 2022 3:29 PM

Rashmika Mandanna Introduce Her New Pet Cat Snow See Pics - Sakshi

‘నేషనల్‌ క్రష్‌’ రష్మిక మందన్నా క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. భాషతో సంబంధం లేకుండా వరుస టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌లో పలు సినిమాలు చేస్తోంది. అయితే హీరోయిన్‌గా ఎంత బిజీగా ఉన్న ఎప్పటికప్పుడు తన తాజా అప్‌డేట్స్‌ ఇస్తూ నెట్టింట ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. అందుకే ఆమెకు తెరపై మాత్రమే కాదు సోషల్‌ మీడియాలోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇదిలా ఉంటే రష్మికకు పెట్స్‌ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ఇప్పటికే ఆమె ఆరా అనే పెట్‌ డాగ్‌ను పెంచుకుంటుంది. తాజాగా ఆమె తన ఇంటికి మరో కొత్త అతిథికి స్వాగతం పలికింది. తన పేరు స్నో అంటూ ఫాలోవర్స్‌కు పరిచయం చేసింది రష్మిక.

చదవండి: విజయ్‌తో డేట్‌కి వెళ్తానన్నా సారా.. లైగర్‌ రియాక్షన్‌ చూశారా!

ఇంతకి ఆ కొత్త అతిథి ఎవరంటే మరో పెంపుడు జంతువు పిల్లి. దానిని ముద్దుగా స్నో అని పిలుచుకుంటుందామె. ఈ సందర్భంగా స్నోతో కలిసి దిగిన ఫొటోలు, వీడియోను షేర్‌ చేస్తూ రష్మిక ఆసక్తికర క్యాప్షన్‌ ఇచ్చింది. ‘ఇది నా కొత్త పెట్‌ స్నో. ఇంకో 3 సంవత్సరాల్లో నా ఇల్లు చిన్నపాటి అడవిగా మారుతుందేమో’ అంటూ క్రేజీ క్యాప్షన్‌ జత చేసింది. అలాగే తన పెట్స్‌(కుక్క, పిల్లి) బెడ్‌పై ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. వాళ్లిద్దరు నా కోసం ఎలా ఎదురు చూస్తున్నాయో చూశారా.. మీకు తెలుసా ఇమ్మా ఇప్పుడు ఏడుస్తుంది. నా గుండె నిండిపోయింది’ అంటూ ఎమోషనల్‌ ఏమోజీని జత చేసింది. ఇదిలా ఉంటే రష్మిక ప్రస్తుతం పుష్ప 2, రణ్‌బీర్‌ కపూర్‌ యానిమల్‌, విజయ్‌ వరిసు(తెలుగులో వారసుడు) చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement