బైడెన్‌ రాకతో అక్కడ పెంపుడు జంతువుల సందడి! | Bidens 2 Dogs Settle In At White House | Sakshi
Sakshi News home page

బైడెన్‌ రాకతో వైట్‌హౌస్‌లో పెంపుడు జంతువుల సందడి!!

Published Wed, Jan 27 2021 12:55 AM | Last Updated on Wed, Jan 27 2021 12:49 PM

Bidens 2 Dogs Settle In At White House - Sakshi

వాషింగ్టన్‌: ఒబామా అనంతరం పెంపుడు జంతువులు లేకుండా పోయిన వైట్‌హౌస్‌లోకి మరలా బైడెన్‌ రాకతో పెంపుడు జంతువుల సందడి మొదలైంది. బైడెన్‌కు చెందిన రెండు జర్మన్‌ షెపర్డ్‌ కుక్కలు ఛాంప్, మేజర్‌ వైట్‌హౌస్‌లోకి కాలుమోపాయి. వైట్‌హౌస్‌లో కుదురుకున్నతర్వాత కుక్కలను తెచ్చుకోవాలని బైడెన్‌ కుటుంబం భావించిందని జిల్‌బైడెన్‌ ప్రతినిధి మైఖెల్‌ లారోసా చెప్పారు. వీటిలో మేజర్‌ అనే కుక్కతో ఆడుకుంటూ గతేడాది బైడెన్‌ కిందపడిన సంగతి తెలిసిందే!

ప్రస్తుతం ఈ రెండూ వైట్‌హౌస్‌లో తమకు కేటాయించిన బెడ్స్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాయని మైఖెల్‌ చెప్పారు. మేజర్‌ డాగ్‌ను బైడెన్‌ 2018లో డెలావర్‌ హ్యూమనె అసోసియేషన్‌ నుంచి దత్తత తీసుకున్నారు. బజారు కుక్క నుంచి దేశ ఫస్ట్‌ డాగ్‌గా మేజర్‌ జర్నీని పురస్కరించుకొని ఈ అసోసియేషన్‌ గతవారం ఫండ్‌ రైజింగ్‌ చేసి 2 లక్షల డాలర్లు సమీకరించింది. త్వరలో బైడెన్‌ కుటుంబం ఒక పిల్లిని కూడా తెచ్చుకోవాలని భావిస్తున్నట్లు వైట్‌హౌస్‌ వర్గాలు తెలిపాయి. గతంలో ధియోడర్‌ రూజ్‌వెల్ట్, హార్డింగ్, ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్, ట్రూమన్, జార్జ్‌బుష్, క్లింటన్, ఒబామాలు తమ తమ పెంపుడు జంతువులను వైట్‌హౌస్‌లో తమతో ఉంచుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement