దేశంలో వీధికుక్కల దాడులు, దుర్మరణాలు సంఖ్య పెరుగుతూ ఉండటం ఆందోళన రేపుతోంది. ప్రతి ఏడాదీ మిలియన్ల కొద్దీ దాడుల కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు , సీనియర్ సిటిజన్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయి. దేశంలో 3.5 కోట్లకు పైగా వీధికుక్కలు ఉన్న నేపథ్యంలో ఇదొక సవాలుగా మారుతోంది. అంతేకాదు ఇటీవలి కాలంలోక ఒన్ని పెంపుడుకుక్కలు కూడా మనుషులకు తీరనిహాని చేస్తున్న ఘటనలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
23 జాతుల కుక్కలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం
దేశంలో పెరుగుతున్న కుక్క కాటు కేసుల నేపథ్యంలో పిట్‌బుల్ టెర్రియర్, అమెరికన్ బుల్‌డాగ్, రోట్‌వీలర్ లాంటి పలు కుక్క జాతుల పెంపకాన్ని నిషేధించాలని కేంద్రం ఈ ఏడాది మార్చిలో రాష్ట్రాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. తమిళనాడులో పిట్‌బుల్ టెర్రియర్, తోసా ఇను సహా 23 రకాల క్రూరమైన కుక్క జాతులను నిషేధించినట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ నిన్న (గురువారం, ఏప్రిల్ 9)ప్రకటించింది. ఇటీవల చెన్నైలో రోట్‌వీలర్ డాగ్ బాలుడిని గాయపరిచిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
క్రూరమైనవిగా భావించే 23 జాతుల దిగుమతి, పెంపకం, అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అలాగే వీటి పెంపకం, విక్రయాలను నిలిపివేయాలని రాష్ట్రాలను కోరింది. అదే సమయంలో వాటికి గర్భనిరోధకానికి చర్యలు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పశుసంవర్ధక శాఖ, పాడిపరిశ్రమ శాఖలకు లేఖ రాసింది. కొన్ని జాతుల కుక్కలను పెంపుడు జంతువులుగా, ఇతర ప్రయోజనాల కోసం ఉపగించకుండా నిషేధించాలని పౌరులు, సిటిజన్ ఫోరమ్‌లు, యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (AWO) ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
దూకుడు , మానవులకు హాని కలిగించే లక్షనాలున్న ఈ జాతులు ప్రమాదకరమైనవిగా పరిగణించబడతాయి కేంద్రంస్పష్టం చేసింది . 2024 నాటికి భారతదేశంలో నిషేధించిన జాబితాను ప్రకటించింది.
కేంద్రం నిషేధించిన కుక్కల జాతుల జాబితా
పిట్‌బుల్ టెర్రియర్, టోసా ఇను, అమెరికన్ స్టాఫోర్డ్‌షైర్ టెర్రియర్, ఫిలా బ్రసిలీరో, డోగో అర్జెంటీనో, అమెరికన్ బుల్‌డాగ్, బోర్‌బోయెల్ కంగల్, సెంట్రల్ ఏషియన్ షెపర్డ్ డాగ్, కాకేసియన్ షెపర్డ్ డాగ్. ఇంకా సౌత్ రష్యన్ షెపర్డ్ డాగ్, టోర్న్‌జాక్, సర్ప్లానినాక్, జపనీస్ టోసా, అకిటా, మాస్టిఫ్స్, టెర్రియర్స్, రోడేసియన్ రిడ్జ్‌బ్యాక్, వోల్ఫ్ డాగ్స్, కానరియో, అక్బాష్ డాగ్, మాస్కో గార్డ్ డాగ్, కేన్ కోర్సో, బ్యాండాగ్ ఉన్నాయి.
దాడులు ఎందుకు పెరుగుతున్నాయి
భారతదేశంలో దాదాపు 1 కోటి పెంపుడు కుక్కలు ఉన్నాయి. అయితే వీధికుక్కల జనాభా చాలా ఎక్కువ.2019లో దేశంలో 4,146 కుక్కకాటు కేసులు నమోదై మానవ మరణాలకు దారితీశాయి. 2019 నుంచి దేశవ్యాప్తంగా భారతదేశం 1.5 కోట్లకు పైగా కుక్క కాటు కేసులు వెలుగు చూశాయి. ఉత్తరప్రదేశ్, తమిళనాడు ,మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్నాయి.
- వీధికుక్కలు రెచ్చగొట్టినా, బెదిరించినా, లేదా తన బిడ్డలకు (కుక్క పిల్లలకు) హాని జరుగుతుందని భావించిన సూడి కుక్క దాడికి తెగబడుతుంది.
- వీధి కుక్కల దాడులకు దోహదపడే కారకాలు ప్రభుత్వం, జంతు సంక్షేమ సంస్థల నిర్లక్ష్యం మరియు వ్యక్తిగత ఉదాసీనత.
- వీధి కుక్కల జనాభాను నియంత్రించడానికి సమర్థవంతమైన చర్యలు లేకపోవడం కూడా ప్రధానకారణంగా నిలుస్తోంది.
- వీధి కుక్కలకు ఆహారం ఇవ్వడం చట్టవిరుద్ధం కానప్పటికీ, వాటికి ఆహారం ఇచ్చినందుకు వ్యక్తులపై దాడి చేస్తున్న ఘటను చూస్తున్నాం.
- జంతు ఆరోగ్య సంరక్షణ , నియంత్రణ లేకపోవడం
- ఆకలి లేదా ఇన్ఫెక్షన్ కారణంగా వీధికుక్కలు దూకుడుగా మారతాయి.
- 19604 నాటి జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం ప్రకారం వీధి కుక్కలపైక విషప్రయోగం చేయడం చట్టరీత్యా నేరం.
- వీధి కుక్కల దాడుల సమస్యను పరిష్కరించడానికి మెరుగైన జంతు నియంత్రణ, అవగాహనతోపాటు బాధ్యతాయుతమైన పెంపుడు జంతువుల యాజమాన్యంతో కూడిన సమగ్ర విధానం అవసరం. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూనే జంతువుల పట్ల దయ, కరుణ కలిగి ఉండటం చాలా అవసరం.
ఇప్పటికే ఈ నిషేధిత జాతులలో ఏదైనా జాతికి చెందిన కుక్క మీ దగ్గర ఉంటే, వాటి సంతానోత్పత్పిని అరికట్టేలా స్టెరిలైజేషన్ చేయించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment