న్యూఢిల్లీ: పెంపుడు కుక్కల పెంపకం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తరుచూ ప్రజలపై దాడులకు ప్రాడుతూ మరణాలకు కారణమవుతున్న 23 జాతులకు చెందిన పెంపుడు శునకాల అమ్మకాలపై నిషేధం విధించాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ 23 బ్రీడ్స్ అత్యంత ప్రమాదకరమైనవిగా కేంద్రం పేర్కొంది.
బ్యాన్ విధించిన వాటిలో పిట్ బుల్ టెర్రియర్, అమెరికన్ బుల్‌డాగ్, రోట్ వీలర్, మస్టిఫ్స్, టొసా ఇను, అమెరికన్ స్టాఫర్డ్‌షైర్ టెర్రియర్, డోగో అర్జెంటీనో, సెంట్రల్ ఆసియన్ షెఫర్డ్, సౌత్ రష్యన్ షెఫర్డ్, వూల్ఫ్ డాగ్స్, మాస్కో గార్డ్ తదితర జాతుల శునకాలు ఈ జాబితాలో ఉన్నాయి.
వీటి సంతాన వృద్ధి(బ్రీడింగ్)ని కూడా అడ్డుకొనేలా చర్యలు చేపట్టాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర పశుసంవర్ధక శాఖ లేఖలు రాసింది. పౌరులు, పౌర సంస్థలు, జంతు సంరక్షణ సంస్థల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment