ఒక్కోసారి మనం ప్రేమగా పెంచుకునే జంతువుల వల్లే ఇబ్బందులు తలెత్తిన ఘటనలు కోకొల్లలు. అవి ఒక్కొసారి యమపాశంగా మారి మన ప్రాణాలను తీసేంత వరకు వస్తాయి. అచ్చం అలానే ఇక్కడొక వృద్ధురాలు తన కొడుకు పెంచుకునే జంతువు చేత హతమయ్యింది.
వివరాల్లోకెళ్తే...లక్నోలోని కైసర్‌బాగ్‌లో 82 ఏళ్ల సుశీల త్రిపాఠి అనే వృద్ధురాలు తన కొడుకుతో కలిసి ఉంటుంది. ఏమైందో ఏమో గానీ వాళ్లు పెంచుకుంటున్న బ్రౌనీ అను కుక్క ఆమె పై దాడి చేసి చంపేసింది. ఈ ఘటన తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో జరిగింది. ఆమె సహాయం కోసం కేకలు వేయడంతో...ఆమెకు సాయం చేద్దామని ఇరుగుపొరుగు వారు స్పదించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే లోపల నుంచి తాళం వేసి ఉండటంతో వారు కూడా ఏం చేయలేకపోయారు.
ఇంతలో ఆమె కొడుకు వచ్చి చూచేట్టప్పటికీ ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే అతను ఆస్పత్రికి తరలించిగా...ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమె శరీరం పై సుమారు 12 చోట్ల తీవ్రమైన గాయాలయ్యాయని పోస్ట్‌మార్టం నివేదిక పేర్కొంది. వాస్తవానికి ఆమె కొడుకు పిట్‌బుల్, లాబ్రడార్ అనే రెండు కుక్కలను పెంచుకుంటున్నాడు. అతని తల్లిపై దాడి చేసిన బ్రౌని అనే కుక్కను మూడేళ్ల క్రితమే తీసుకువచ్చారు. ఏదీఏమైన పెంచుకున్న కుక్క దాడిచేయడం అత్యంత బాధకరం.
(చదవండి: ఎప్పుడూ ల్యాప్‌టాపేనా?.. స్కూటర్‌పైన వెళ్తూ కూడా అవసరమా!!)
Comments
Please login to add a commentAdd a comment