pitbull dog
-
23 జాతుల పెంపుడు శునకాలపై కేంద్రం బ్యాన్!
న్యూఢిల్లీ: పెంపుడు కుక్కల పెంపకం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తరుచూ ప్రజలపై దాడులకు ప్రాడుతూ మరణాలకు కారణమవుతున్న 23 జాతులకు చెందిన పెంపుడు శునకాల అమ్మకాలపై నిషేధం విధించాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ 23 బ్రీడ్స్ అత్యంత ప్రమాదకరమైనవిగా కేంద్రం పేర్కొంది. బ్యాన్ విధించిన వాటిలో పిట్ బుల్ టెర్రియర్, అమెరికన్ బుల్డాగ్, రోట్ వీలర్, మస్టిఫ్స్, టొసా ఇను, అమెరికన్ స్టాఫర్డ్‌షైర్ టెర్రియర్, డోగో అర్జెంటీనో, సెంట్రల్ ఆసియన్ షెఫర్డ్, సౌత్ రష్యన్ షెఫర్డ్, వూల్ఫ్ డాగ్స్, మాస్కో గార్డ్ తదితర జాతుల శునకాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటి సంతాన వృద్ధి(బ్రీడింగ్)ని కూడా అడ్డుకొనేలా చర్యలు చేపట్టాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర పశుసంవర్ధక శాఖ లేఖలు రాసింది. పౌరులు, పౌర సంస్థలు, జంతు సంరక్షణ సంస్థల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. -
ఏమైందో ఏమో! ప్రేమగా పెంచుకున్న కుక్కే ఉసురు తీసింది!
ఒక్కోసారి మనం ప్రేమగా పెంచుకునే జంతువుల వల్లే ఇబ్బందులు తలెత్తిన ఘటనలు కోకొల్లలు. అవి ఒక్కొసారి యమపాశంగా మారి మన ప్రాణాలను తీసేంత వరకు వస్తాయి. అచ్చం అలానే ఇక్కడొక వృద్ధురాలు తన కొడుకు పెంచుకునే జంతువు చేత హతమయ్యింది. వివరాల్లోకెళ్తే...లక్నోలోని కైసర్‌బాగ్‌లో 82 ఏళ్ల సుశీల త్రిపాఠి అనే వృద్ధురాలు తన కొడుకుతో కలిసి ఉంటుంది. ఏమైందో ఏమో గానీ వాళ్లు పెంచుకుంటున్న బ్రౌనీ అను కుక్క ఆమె పై దాడి చేసి చంపేసింది. ఈ ఘటన తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో జరిగింది. ఆమె సహాయం కోసం కేకలు వేయడంతో...ఆమెకు సాయం చేద్దామని ఇరుగుపొరుగు వారు స్పదించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే లోపల నుంచి తాళం వేసి ఉండటంతో వారు కూడా ఏం చేయలేకపోయారు. ఇంతలో ఆమె కొడుకు వచ్చి చూచేట్టప్పటికీ ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే అతను ఆస్పత్రికి తరలించిగా...ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమె శరీరం పై సుమారు 12 చోట్ల తీవ్రమైన గాయాలయ్యాయని పోస్ట్‌మార్టం నివేదిక పేర్కొంది. వాస్తవానికి ఆమె కొడుకు పిట్‌బుల్, లాబ్రడార్ అనే రెండు కుక్కలను పెంచుకుంటున్నాడు. అతని తల్లిపై దాడి చేసిన బ్రౌని అనే కుక్కను మూడేళ్ల క్రితమే తీసుకువచ్చారు. ఏదీఏమైన పెంచుకున్న కుక్క దాడిచేయడం అత్యంత బాధకరం. (చదవండి: ఎప్పుడూ ల్యాప్‌టాపేనా?.. స్కూటర్‌పైన వెళ్తూ కూడా అవసరమా!!) -
ఘోరం : విశ్వాసం లేని కుక్క!...
లండన్ : విశ్వాసం లేని ఓ పెంపుడు కుక్క తన యజమానిని దారుణంగా కొరికి చంపేసింది. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బర్మింగ్‌హామ్‌లోని కిట్స్ గ్రీన్ ఏరియాకు చెందిన కైరా లాడ్లో కుటుంబం ఓ పిట్‌బుల్ డాగ్‌ను పెంచుకుంటోంది. శుక్రవారం కైరా ఒక్కత్తే ఇంట్లో ఉంది. ఆమె తన గదిలోని బెడ్‌పై నిద్రపోతున్న సమయంలో పిట్‌బుల్ దాడి చేసింది. ఆమె చేతిని కొరికి, చీల్చిపడేసింది. ప్రాణాల కోసం ఆమె ఎంత అరుస్తున్నా అది విడిచిపెట్టలేదు. ఆ అరుపులు విన్న పొరుగింటి వారికి ఆ ఇంట్లో ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ( యజమానికి గుండెపోటు.. కుక్క ఏం చేసిందంటే? ) కైరా పెంపుడు పిట్బుల్డాగ్ కైరాకు ఫోన్ చేసిన ఆమె బంధువు ఒకరు ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాకపోవటంతో మధ్యాహ్నం సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చింది. అక్కడికి చేరుకున్న పోలీసులు తీవ్రగాయాలతో పడి ఉన్న ఆమెను గుర్తించారు. కైరాను పరీక్షించి చనిపోయినట్లుగా తేల్చారు. సంఘటనా స్థలంలో ఉన్న పిట్‌బుల్ డాగ్ కారణంగా ఆమె మరణించిందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రెచ్చిపోయిన పెంపుడు కుక్క.. 15 నిమిషాల పాటు..
-
రెచ్చిపోయిన కుక్క.. 15 నిమిషాల పాటు..
జలందర్ : పంజాబ్‌లో జలందర్ ఘోరం జరిగింది. ఓ 15 ఏళ్ల బాలుడిపై ఓ పెంపుడు కుక్క దాడి చేసింది. మాములుగా పిచ్చి కుక్కలు దాడి చేసినప్పుడు ఇతరులు బెదిరిస్తే.. లేదా రాళ్లతో కొడితే పారిపోతాయి. కానీ ఈ కుక్క మాత్రం బాలుడి కాలిని పళ్లతో గట్టిగా పట్టి ఎంతకీ వదలలేదు. బాటసారులు వచ్చి దాడి చేసినా.. ఆ కుక్క ఆదరలేదు.. బెదరలేదు. జలందర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జలందర్‌కు చెందిన ఓ బాలుడు గత మంగళవారం సాయంత్రం సైకిల్‌పై ట్యూషన్‌కి వెళ్లాడు. సాయంత్రం తిరిగి వచ్చే క్రమంలో ఇంటికి సమీపంలో ఓ పెంపుడు కుక్క దాడికి దిగింది. అతని కుడికాలిని పళ్లతో పట్టి కొరకసాగింది. ఇది గమనించిన బాటసారులు.. కుక్కను రాళ్లతో, కర్రలతో కొట్టారు. అయినప్పటికీ కుక్క బాలుడిని వదలలేదు. బాలుడి తల్లి కాళ్లతో తన్నినా, నీళ్లు చల్లినా కుక్క మాత్రం అక్కడి నుంచి పారిపోలేదు. దాదాపు 15 నిమిషాల తర్వాత కుక్క అతన్ని వదిలి పారిపోయింది. కుక్క దాడిలో తీవ్రగాయాలపాలైన బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. -
ఇది కుక్కా.. గుర్రమా?
ఖడ్గమృగంలా కనిపిస్తున్న ఈ పిట్‌బుల్ పేరు హల్క్, 17 నెలలకే 80 కిలోల బరువుండి గుర్రంలా ఎదుగుతూ ఇప్పటికే ప్రపంచంలోకెల్లా అతి పెద్ద కుక్కగా పేరు గడించింది. దీనికి హల్క్ కన్నా మంచి పేరు పెట్టగలమా? మార్వెల్ కామిక్స్ పబ్లికేషన్స్ ప్రచురిస్తున్న పుస్తకాల్లో కామిక్ సూపర్ హీరో పేరు హల్క్ గురించి పిల్లలకైతే కచ్చితంగా పరిచయం చేయక్కర్లేదు. కదనానికి కాలుదువ్వే పిట్‌బుల్‌ను వేట కోసం ఉపయోగిస్తారు తప్ప, సాధు జంతువులా సాధారణంగా ఎవరూ పెంచుకోరు. కానీ, న్యూహాంప్‌షైర్‌లోని మార్లాన్, లీసా గ్రెన్నన్ దంపతులు మాత్రం అలాగే పెంచుకుంటున్నారు. ఈ పిట్‌బుల్ తోకాడిస్తూ తమతో తిరగడమే కాకుండా తమ మూడేళ్ల పిల్లాడు జార్డన్ను గుర్రంలా ఎక్కించుకొని తిప్పుతోందని ఆ దంపతులు చెబుతున్నారు. బుల్డాగ్, టెర్రియర్స్ను సంకరం చేయడం ద్వారా ఈ పిట్‌బుల్ జాతి కుక్కలు పుట్టుకొచ్చాయి. ఒకప్పుడు పలు దేశాల్లో వీటితో బుల్ ఫైట్ చేయించేవారు. అందుకోసమే వీటిని పెంచేవారు. బ్రిటన్‌లో ఈ ఫైట్‌ను ముందుగా నిషేధించారు. జంతుకారుణ్య సంస్థల కారణంగా కాలక్రమేణా పలు దేశాల్లో పిట్‌బుల్ ఫైట్లను నిషేధించారు. పిల్లాడిని ఆడించడం తప్ప మరే పనిలేని ఈ హల్క్ మాత్రం పూటకు మూడు, నాలుగు కిలోల ఎద్దు మాంసం తింటుందట. ఇంకా ఎదిగే వయస్సున్నందున ఇది ఇంకా ఎంత ఎత్తు ఎదుగుతుందో?