
జలందర్ : పంజాబ్‌లో జలందర్ ఘోరం జరిగింది. ఓ 15 ఏళ్ల బాలుడిపై ఓ పెంపుడు కుక్క దాడి చేసింది. మాములుగా పిచ్చి కుక్కలు దాడి చేసినప్పుడు ఇతరులు బెదిరిస్తే.. లేదా రాళ్లతో కొడితే పారిపోతాయి. కానీ ఈ కుక్క మాత్రం బాలుడి కాలిని పళ్లతో గట్టిగా పట్టి ఎంతకీ వదలలేదు. బాటసారులు వచ్చి దాడి చేసినా.. ఆ కుక్క ఆదరలేదు.. బెదరలేదు. జలందర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జలందర్‌కు చెందిన ఓ బాలుడు గత మంగళవారం సాయంత్రం సైకిల్‌పై ట్యూషన్‌కి వెళ్లాడు. సాయంత‍్రం తిరిగి వచ్చే క్రమంలో ఇంటికి సమీపంలో ఓ పెంపుడు కుక్క దాడికి దిగింది. అతని కుడికాలిని పళ్లతో పట్టి కొరకసాగింది. ఇది గమనించిన బాటసారులు.. కుక్కను రాళ్లతో, కర్రలతో కొట్టారు. అయినప్పటికీ కుక్క బాలుడిని వదలలేదు. బాలుడి తల్లి కాళ్లతో తన్నినా, నీళ్లు చల్లినా కుక్క మాత్రం అక్కడి నుంచి పారిపోలేదు. దాదాపు 15 నిమిషాల తర్వాత కుక్క అతన్ని వదిలి పారిపోయింది. కుక్క దాడిలో తీవ్రగాయాలపాలైన బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment