breed dogs
-
23 జాతుల పెంపుడు శునకాలపై కేంద్రం బ్యాన్!
న్యూఢిల్లీ: పెంపుడు కుక్కల పెంపకం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తరుచూ ప్రజలపై దాడులకు ప్రాడుతూ మరణాలకు కారణమవుతున్న 23 జాతులకు చెందిన పెంపుడు శునకాల అమ్మకాలపై నిషేధం విధించాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ 23 బ్రీడ్స్ అత్యంత ప్రమాదకరమైనవిగా కేంద్రం పేర్కొంది. బ్యాన్ విధించిన వాటిలో పిట్ బుల్ టెర్రియర్, అమెరికన్ బుల్డాగ్, రోట్ వీలర్, మస్టిఫ్స్, టొసా ఇను, అమెరికన్ స్టాఫర్డ్షైర్ టెర్రియర్, డోగో అర్జెంటీనో, సెంట్రల్ ఆసియన్ షెఫర్డ్, సౌత్ రష్యన్ షెఫర్డ్, వూల్ఫ్ డాగ్స్, మాస్కో గార్డ్ తదితర జాతుల శునకాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటి సంతాన వృద్ధి(బ్రీడింగ్)ని కూడా అడ్డుకొనేలా చర్యలు చేపట్టాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర పశుసంవర్ధక శాఖ లేఖలు రాసింది. పౌరులు, పౌర సంస్థలు, జంతు సంరక్షణ సంస్థల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. -
ఉత్తమ కాపలా కుక్కలు.. అత్యంత అరుదుగా మొరిగే కుక్కలు
-
ఇది జిరాఫీ కాదు!! కుక్క.. అత్యంత అరుదైన బ్రీడ్!! కానీ కారు ప్రమాదంలో..
అతిపెద్ద మెడ జిరాఫీకి మాత్రమే ఉంటుందని అనుకుంటే పొరపాటే..! ఇంకెవరికుంటుందబ్బా.. అని ఆలోచిస్తున్నారా? పొడవాటి మెడ, శరీరంపై మచ్చలతో ఉన్న ఓ వింత కుక్కను జిరాఫీతో పోలుస్తున్నారందరు. దీని అందం వెనుక తీవ్ర విషాదం కూడా దాగి ఉంది. అసలేం జరిగిందంటే.. లూయిసా క్రూక్ అనే యువతి 2016లో కారు ప్రమాదంలో గాయపడిన బ్రాడీ అనే అజ్వాక్ జాతి కుక్కను రక్షించింది. అప్పుడు బ్రాడీ వయస్సు 6-7 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఐతే ఈ ప్రమాదంలో బ్రాడీ ఒక కాలు, చెయ్యి కోల్పోయింది. సాధారణంగా అజ్వాఖ్ జాతి కుక్కల మెడలు పొడవుగా ఉంటాయి. ఐతే కారు ప్రమాదం తర్వాత బ్రాడీ రూపం గణనీయంగా మారింది. లూయిసా మాటల్లో.. ‘బ్రాడీ నేను చూసిన అత్యంత అందమైన కుక్కపిల్ల. బ్రాడీని మొదటిసారి చూసినప్పుడు రక్తపు మడుగులో విపరీతమైన బాధతో కదలలేకపోయింది. బ్రాడీ మెడ చాలా పొడవుగా ఉండటం గమనించాను. కానీ దాని తెగిపోయిన భుజం, మెడతో ముడిపడి ఉన్నట్లు అనిపిస్తుంది. అది చాలా పొడవుగా ఉన్నట్లు కూడా కనిపించిందని తెల్పింది. ఐతే అన్ని అజ్వాక్ జాతి కుక్కలకు మచ్చలు ఉండవని లూయిసా పేర్కొంది. ఇది బ్రాడీ ప్రత్యేక లక్షణాల్లో ఒకటి. ప్రస్తుతం బ్రాడీ చాలా ఆరోగ్యంగా ఉందని, మా ఇద్దరికీ మంచి స్నేహం కుదిరిందని స్థానిక మీడియాకు తెలిపింది. చదవండి: శీతాకాలంలో చలిని తట్టుకోవాలంటే ఇది ఎక్కువగా తినాలి..! -
జాతి కుక్కలతో ఉగ్రవాదుల వేట!
బీజింగ్:ఇప్పటి వరకూ పోలీసులకు కొన్ని సందర్భాల్లోనే సాయపడే కుక్కలు ఇక నుంచి టెర్రరిస్టుల వేటకు కూడా సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే కొన్ని జాతి కుక్కలకు శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ తరహా ప్రణాళికతో ఉగ్రవాదులకు అడ్డుకట్టవేయడానికి మన పొరుగుదేశం చైనా తాజాగా శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన 650 కుక్కలకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే పలు కుక్కలు పోలీస్ పెట్రోలింగ్ లో భాగస్వామ్యమయ్యాయని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. గత కొన్నాళ్లుగా చైనాలోని పలుచోట్ల ఉగ్రవాద దాడులు ఎక్కువ కావడం వల్లనే కుక్కలకు శిక్షణ ఇవ్వాల్సి వస్తోందన్నారు. బీజింగ్ లోని రైల్వేస్టేషన్లు, బస్సు స్టేషన్ల లాంటి రద్దీ ప్రదేశాల్లో ఎక్కడైనా ఉగ్రవాదులు విధ్వంసానికి ప్రణాళిక రచించే సమయంలో తిప్పికొట్టేందుకు ఇదొక విధానమన్నారు. ఈ మధ్య కాలంలో చైనాలోని అత్యధిక జనాభా గల నగర, పట్టణ ప్రాంతాల్లోనూ, రవాణా స్థావరాల్లోనూ ఉగ్రవాద దాడులు తీవ్రమైన సంగతి తెలిసిందే.