పెంపుడు కుక్కకు హెయిర్ డై, లక్షలు ఖర్చు చేసిన మోడల్‌ | Netizens Fires On Russian Model Who Coloring Her Pet Dog Fur Neon Orange | Sakshi
Sakshi News home page

Pet Dog: కుక్క హెయిర్ డైకి లక్షలు ఖర్చు చేసిన మోడల్‌, నెటిజన్ల ఆగ్రహం

Published Sat, Nov 20 2021 8:38 PM | Last Updated on Sat, Nov 20 2021 8:41 PM

Netizens Fires On Russian Model Who Coloring Her Pet Dog Fur Neon Orange - Sakshi

సోషల్‌ మీడియాను సెలబ్రెటీలు బాగా ఉపయోగించుకుంటున్నారు. వారి సంబంధించిన ప్రతి యాక్టివిటీని, వ్యక్తిగత విషయానలు ఎప్పటికప్పుడు నెట్టింట షేర్‌ చేసుకుంటుంటారు. అందుకే నెటిజన్లు ఎక్కువ సమయం సామాజిక మాధ్యమాలకు కెటాయిస్తారు. వారి ప్రతి అడుగును గమనిస్తూ వారిని నిత్యం ఫాలో అవుతుంటారు. అలా వారు పెట్టిన పోస్టులను వైరల్‌ చేస్తుంటారు.  అయితే కొన్ని సార్లు వారు చేసే పోస్ట్స్ నచ్చితే నెటిజన్లు వారిని ఆకాశానికి ఎత్తేస్తారు.. అదే పోస్టులు బెడిసికొట్టితే మాత్రం ట్రోల్స్ చేస్తూ ఆడేసుకుంటారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి చెదు అనుభవాలను సెలబ్రెటీలు చాలానే ఎందుర్కొంటున్నారు.

చదవండి: ఆ నటుడితో పీకల్లోతు ప్రేమలో బిగ్‌బి మనవరాలు!

తాజాగా రష్యన్‌ మోడల్‌కు ఇలాంటి సంఘటనే ఎదురైంది. తాను చేసిన పనికి గర్వపడుతూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి చేదు అనుభవాన్ని ఎదుర్కొంది రష్యన్‌ మోడల్‌ అన్నా స్టూపక్. అయితే సెలబ్రెటీలకు ఎక్కువగా పెట్స్‌ని ఇష్టపడతారనేది తెలిసిన విషయమే. వాటికి కాస్తా సమయం ఎక్కువగా కేటాయిస్తుంటారు. ఖాళీ సమయంలో వాటితో ఆడుకుంటూ రిలాక్స్‌ అవుతుంటారు. ఇంకా కొంతమంది అయితే ఎక్కడికి వెళ్లిన పెట్స్‌ని తమ వెంట తీసుకేళ్తారు. వాటిపై ప్రత్యేకంగా శ్రద్ధా పెడుతుంటారు. చెప్పాంటే సొంత మనిషిలా చూసుకుంటారు. ఈ క్రమంలో ఓ మోడల్‌ తన పెంపుడు కుక్కపై ఇంకాస్తా ఎక్కువ శ్రద్ద పెట్టింది.

చదవండి: ముంబై వెళ్లి సల్మాన్‌ను ప్రత్యేకంగా కలిసిన జక్కన్న, అందుకేనా?

అదే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ పంచుకుంది. అది కాస్తా బెడిసి కొట్టడంతో నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మీకు తెలిసిందే. నెటిజన్లకు కోపం వస్తే ఏం చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అవును ఎప్పటి లాగే ఆమెను సోషల్‌ మీడియాలో ఆడేసుకున్నారు. ఇంతకి నెటిజన్లకు కోపం తెప్పించిన విషయకం ఏంటంటే కాస్తా కుక్క హేర్‌కు డై చేయించింది. నియాన్‌ ఆరెంజ్‌తో పూర్తిగా కుక్కకు కలర్‌ డై చేయించిందట. దీని కోసం ఆమె ఏకంగా రూ. 5వేల యూరోలు(భారత కరెన్సీలో 5 లక్షల రూపాయలు). ఈ విషయాన్ని స్వయంగా సదరు మోడల్ చెప్పుకొచ్చింది. ఇంకేముంది మోడల్ చేసిన పనికి నెటిజన్లు ఆమెపై మండిపుడుతున్నారు. మీ సరద కోసం మూగ జీవిని హింసించడం ఏంటంటూ తమదైన శైలిలో ఆమెను తిట్టిపోస్తున్నారు. దీంతో అన్నా స్టూపక్ వార్తల్లోకి ఎక్కింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement