russian model
-
పెంపుడు కుక్కకు హెయిర్ డై, లక్షలు ఖర్చు చేసిన మోడల్
సోషల్ మీడియాను సెలబ్రెటీలు బాగా ఉపయోగించుకుంటున్నారు. వారి సంబంధించిన ప్రతి యాక్టివిటీని, వ్యక్తిగత విషయానలు ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేసుకుంటుంటారు. అందుకే నెటిజన్లు ఎక్కువ సమయం సామాజిక మాధ్యమాలకు కెటాయిస్తారు. వారి ప్రతి అడుగును గమనిస్తూ వారిని నిత్యం ఫాలో అవుతుంటారు. అలా వారు పెట్టిన పోస్టులను వైరల్ చేస్తుంటారు. అయితే కొన్ని సార్లు వారు చేసే పోస్ట్స్ నచ్చితే నెటిజన్లు వారిని ఆకాశానికి ఎత్తేస్తారు.. అదే పోస్టులు బెడిసికొట్టితే మాత్రం ట్రోల్స్ చేస్తూ ఆడేసుకుంటారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి చెదు అనుభవాలను సెలబ్రెటీలు చాలానే ఎందుర్కొంటున్నారు. చదవండి: ఆ నటుడితో పీకల్లోతు ప్రేమలో బిగ్‌బి మనవరాలు! తాజాగా రష్యన్ మోడల్‌కు ఇలాంటి సంఘటనే ఎదురైంది. తాను చేసిన పనికి గర్వపడుతూ సోషల్ మీడియాలో షేర్ చేసి చేదు అనుభవాన్ని ఎదుర్కొంది రష్యన్ మోడల్ అన్నా స్టూపక్. అయితే సెలబ్రెటీలకు ఎక్కువగా పెట్స్‌ని ఇష్టపడతారనేది తెలిసిన విషయమే. వాటికి కాస్తా సమయం ఎక్కువగా కేటాయిస్తుంటారు. ఖాళీ సమయంలో వాటితో ఆడుకుంటూ రిలాక్స్ అవుతుంటారు. ఇంకా కొంతమంది అయితే ఎక్కడికి వెళ్లిన పెట్స్‌ని తమ వెంట తీసుకేళ్తారు. వాటిపై ప్రత్యేకంగా శ్రద్ధా పెడుతుంటారు. చెప్పాంటే సొంత మనిషిలా చూసుకుంటారు. ఈ క్రమంలో ఓ మోడల్ తన పెంపుడు కుక్కపై ఇంకాస్తా ఎక్కువ శ్రద్ద పెట్టింది. చదవండి: ముంబై వెళ్లి సల్మాన్‌ను ప్రత్యేకంగా కలిసిన జక్కన్న, అందుకేనా? అదే విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ పంచుకుంది. అది కాస్తా బెడిసి కొట్టడంతో నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మీకు తెలిసిందే. నెటిజన్లకు కోపం వస్తే ఏం చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అవును ఎప్పటి లాగే ఆమెను సోషల్ మీడియాలో ఆడేసుకున్నారు. ఇంతకి నెటిజన్లకు కోపం తెప్పించిన విషయకం ఏంటంటే కాస్తా కుక్క హేర్‌కు డై చేయించింది. నియాన్ ఆరెంజ్‌తో పూర్తిగా కుక్కకు కలర్ డై చేయించిందట. దీని కోసం ఆమె ఏకంగా రూ. 5వేల యూరోలు(భారత కరెన్సీలో 5 లక్షల రూపాయలు). ఈ విషయాన్ని స్వయంగా సదరు మోడల్ చెప్పుకొచ్చింది. ఇంకేముంది మోడల్ చేసిన పనికి నెటిజన్లు ఆమెపై మండిపుడుతున్నారు. మీ సరద కోసం మూగ జీవిని హింసించడం ఏంటంటూ తమదైన శైలిలో ఆమెను తిట్టిపోస్తున్నారు. దీంతో అన్నా స్టూపక్ వార్తల్లోకి ఎక్కింది. View this post on Instagram A post shared by Anna Stupak (@anna3.0.5) -
యువతి సెన్సేషన్ కోసం అర్థనగ్నంగా..
-
మ్యాచ్ జరుగుతుండగా.. అర్ధనగ్నంగా
మాడ్రిడ్: ప్రస్తుత యువత సెన్సేషన్ కోసం దేనికైనా తెగిస్తున్నారు. ఎవరో ఏదో ఒక చోట ఓవర్ నైట్ స్టార్ అయ్యారని, వారిని ఆదర్శంగా తీసుకొని మరికొందరు వెకిలిచేష్టలకు పాల్పడుతున్నారు. నలుగురు ఏమనుకుంటారు, ఎవరికైనా ఇబ్బందులు కలిగిస్తున్నామా అనే విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా తమకు నచ్చినట్టు చేసేస్తున్నారు. ఒక్కోసారి వారు చేసే వెకిలిచేష్టలు విజయవంతమయి ఓవర్ నైట్ స్టార్ అవుతున్నారు. మరికొందరి ప్రయత్నాలు విఫలమై కటకటాల పాలవుతున్నారు. స్పెయిన్‌లోని మాడ్రిడ్ లో చాంపియన్స్ లీగ్ ఫుట్ బాల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా, ఓ యువతి అర్థనగ్నంగా గ్రౌండ్ లోకి వచ్చి సంచలనం సృష్టించింది. కిన్సే వోలాన్స్స్కీగా అనే రస్యా మోడల్ తరచూ ఇలా సంచలనం కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకోవడం అలవాటుగా మార్చుకుందట. అందుకే ఫుట్ బాల్ మ్యాచ్ లో ఇలా బరితెగించి ఒళ్లు మైమరిచి పరుగులు అందుకుంది. సెక్యూరిటికి దొరకకుండా గ్రౌండ్ మొత్తం పరిగెత్తింది. దీంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. చివరికి మ్యాచ్ నిర్వాహకులు ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో గర్వంగా షేర్ చేసింది వోలాన్స్స్కీగా. ‘ఈ రోజు చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ మ్యాచ్‌కోసం ఇలా వెళ్లాను. ఎంతో గర్వంగా ఉంది’అంటూ ఫోటోతోపాటు ఈ కామెంట్‌ను జతచేసింది. యువతి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్‌నైట్ స్టార్ కావడం కోసం స్విమ్మింగ్ డ్రెస్‌లో మ్యాచ్‌కు వెళతావా నీకు ఇంతనైనా సిగ్గుందా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మోడల్‌ను 140 సార్లు కత్తితో పొడిచి.. కళ్లు పీకి..
రష్యాలో ఘోరం జరిగింది. టీనేజిలో ఉన్న ఒక మోడల్‌ను ఆమె సొంత అక్కే దారుణాతి దారుణంగా హతమార్చింది. 140 సార్లు కత్తితో పొడిచి, కనుగుడ్లు బయటకు లాగేసి, చెవులు కోసేసి మరీ చంపింది. మృతురాలి పేరు స్టెఫానియా డుబ్రోవినా. ఆమె సోదరి ఎలిజవెటా బాగా డ్రగ్స్ తీసుకుని, ఆ మత్తులోనే ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందిన స్టెఫానియా.. తన సొంత ఫ్లాట్‌లోనే హత్యకు గురైంది. అప్పటికి స్టెఫానియా, ఆమె సోదరితో పాటు మరో వ్యక్తి కూడా ఆ ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. అతడు మద్యం కొనుక్కోడానికి బయటకు వెళ్లగానే ఎలిజవెటా తలుపులన్నీ మూసేసి, చెల్లెలిని దారుణాతి దారుణంగా పొడిచి చంపింది. అక్కడితో ఆమె కోపం చల్లారలేదు. చెవులు కోసేసి, నానా బీభత్సం సృష్టించింది. ఆ తర్వాత మృతదేహానికి బాగా జుట్టు దువ్వి, మేకప్ చేసింది కూడా! చెల్లెలికి మోడల్‌గా బాగా పేరు రావడంతో ఈర్ష్య తట్టుకోలేకనే ఆమె ఇలా చేసిందని పోలీసులు భావిస్తున్నారు. స్టెఫానియా తన షోలలో బాగా పనిచేసేదని, ఆమె చాలా ఆకర్షణీయంగా ఉండేదని సెయింట్ పీటర్స్బర్గ్కు చెందిన స్టాస్ బారెట్స్కీ చెప్పారు. అలాంటి అమ్మాయి హత్యకు గురైందన్న విషయం తెలిసి షాకయ్యానన్నారు. అమ్మాయి బంధువు కూడా ఈ విషయం గురించి చెప్పారు. ఈ దారుణ హత్య గురించి తెలిసినప్పుడు ఒక్కసారిగా తనకు వెన్నులో వణుకు పుట్టిందని, రక్తం గడ్డకట్టుకుపోయినట్లు అయ్యిందని ఆమె అన్నారు. ఇంత దారుణానికి కారణం ఏమై ఉంటుందో చెప్పలేకపోతున్నానని ఆమె తెలిపారు. -
కళ్లు తిరిగే సాహసం..మోడల్‌కు సమన్లు
దుబాయ్: ఓ సాహస మోడల్‌కు దుబాయ్ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఎత్తయిన భవనం వద్ద రష్యన్ మోడల్ వికీ ఓడింట్కోవా చేసిన సాహసం ప్రాణాలతో చెలగాటం ఆడటం లాంటిదని పోలీసు ఉన్నతాధికారి ఖలీల్ ఇబ్రహీం మన్సూరీ పేర్కొన్నారు. ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించకుండా దుబాయ్‌లో ప్రాణాలకు అపాయం కలిగించే సాహసాలు చేయొద్దని సూచించారు. సంబంధిత అధికారుల నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఇలాంటివి చేయాలన్నారు. ఎత్తయిన భవనం వద్ద రష్యన్ మోడల్ చేసిన సాహసం కళ్లు తిరిగేలా ఉంది. దుబాయ్‌లోని ఓ ఆకాశహర్మ్యం ఎక్కింది. అక్కడ పై అంతస్తు వద్ద ఓ వ్యక్తిని ఇవతల నిలబెట్టి, కేవలం అతడి చెయ్యి మాత్రమే పట్టుకుని గాల్లో వేలాడింది. ఏమాత్రం పట్టు తప్పినా వెయ్యి అడుగుల కిందకు పడి తల వంద ముక్కలు కావాల్సిందే. 73 అంతస్థులకు పైగా ఉన్న అలాంటి భవనం ఎక్కి మామూలుగా కిటికీలోంచి కిందకు చూస్తేనే మనకు కళ్లు తిరుగుతాయి. అలాంటిది ఈ మోడల్ ఏకంగా కిటికీలోంచి బయట గాల్లోకి వేలాడిందంటే.. చెప్పాలా! ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో కూడా తీసి దాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోను ఇప్పటికి ఐదు లక్షల మందికిపైగా చూశారు. Full video (link in bio)! @a_mavrin #MAVRINmodels #MAVRIN #VikiOdintcova #Dubai A post shared by Viki Odintcova (@viki_odintcova) on Feb 3, 2017 at 7:12am PST -
మోడల్ సాహసం చూస్తే కళ్లు తిరగాల్సిందే
-
మోడల్ సాహసం చూస్తే కళ్లు తిరగాల్సిందే
ప్రపంచంలోనే ఎత్తయిన భవనం ఏదంటే వెంటనే బుర్జ్ దుబాయ్ అని చెబుతాం. దుబాయ్‌లో ఇంత కాకపోయినా ఇలాంటి భవనాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. సరిగ్గా అలాంటి ఓ ఎత్తయిన భవనం వద్ద రష్యన్ మోడల్ చేసిన సాహసం కళ్లు తిరిగేలా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ఫేమస్ అయిన వికీ ఓడింట్కోవా అనే ఈ మోడల్.. దుబాయ్‌లోని ఓ ఆకాశహర్మ్యం ఎక్కింది. అక్కడ పై అంతస్తు వద్ద ఓ వ్యక్తిని ఇవతల నిలబెట్టి, కేవలం అతడి చెయ్యి మాత్రమే పట్టుకుని గాల్లో వేలాడింది. ఏమాత్రం పట్టు తప్పినా వెయ్యి అడుగుల కిందకు పడి తల వంద ముక్కలు కావాల్సిందే. 70 అంతస్థులకు పైగా ఉన్న అలాంటి భవనం ఎక్కి మామూలుగా కిటికీలోంచి కిందకు చూస్తేనే మనకు కళ్లు తిరుగుతాయి. అలాంటిది ఈ మోడల్ ఏకంగా కిటికీలోంచి బయట గాల్లోకి వేలాడిందంటే.. చెప్పాలా! ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో కూడా తీసి దాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆమెకు అక్కడ 32 లక్షల మంది ఫాలోవర్లున్నారు. ఈ వీడియోకు ఇప్పటికి 99 వేలకు పైగా లైకులు వచ్చాయి. అయితే, ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి సాహసం చేస్తావా అని కొంతమంది తిట్టి పోసినా, ఆమె మాత్రం ఇలాంటివి చేస్తూనే ఉంటానంటోంది. ఆమె చేతిని అంత గట్టిగా పట్టుకున్న మొనగాడు ఎవరా అని చూస్తున్నారా.. అది దర్శకుడు అలెగ్జాండర్ టిఖొమిరోవ్. ఆయన కిటికీ మీద నిలబడి, అమ్మడి చేతిని చాలా జాగ్రత్తగా పట్టుకున్నారు. ఒక్క చేత్తోనే ఆమె బరువును మోసి, తర్వాత మళ్లీ పైకి లాగేశారు. ఈ వీడియోను ఇప్పటికి 4.2 లక్షల మంది చూశారు. ఇంతకుముందు కూడా ఒడింట్కోవా తాను చేసిన సినిమాలకు సంబంధించిన బిహైండ్ ద సీన్స్ వీడియోలు షేర్ చేసింది.