స్పెయిన్ లోని మాడ్రిడ్ లో చాంపియన్స్ లీగ్ ఫుట్ బాల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా, ఓ యువతి అర్థనగ్నంగా గ్రౌండ్ లోకి వచ్చి సంచలన సృష్టించింది. కిన్సే వోలాన్స్‌స్కీగా అనే రస్యా మోడల్ తరచూ ఇలా సంచలనం కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకోవడం అలవాటుగా మార్చుకుందట. అందుకే ఫుట్ బాల్ మ్యాచ్ లో ఇలా బరితెగించి ఒళ్లు మైమరిచి పరుగులు అందుకుంది. సెక్యూరిటికి దొరకకుండా గ్రౌండ్ మొత్తం పరిగెత్తింది. దీంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. చివరికి మ్యాచ్ నిర్వాహకులు ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు.