స్వర్ణలత భవిష్యవాణి..
ప్రజలందరినీ బాగా చూసుకుంటా
పంటలకు రసాయనాలు తగ్గించుకోండి
ముగిసిన ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు
రాంగోపాల్‌పేట్(హైదరాబాద్): సికింద్రా బాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు సోమవారంతో అంగరంగ వైభవంగా ముగిశాయి. ఉత్స వాల్లో రెండో ఘట్టమైన రంగం కార్యక్రమంలో భాగంగా ఉదయం 9.55 గంటల సమ యంలో అమ్మవారి గర్భగుడికి ఎదురుగా ఉండే మాతంగేశ్వరి గుడి ముందు పచ్చికుండపై నిలబడి స్వర్ణలత భవిష్య వాణి వినిపించారు. ‘ఈ ఏడాది భక్తులు సమర్పించిన బోనాలు, సాక, పూజలు నాకు ఆనందాన్ని చ్చాయి. కోరినన్ని వర్షాలు కురుస్తాయి. నా ప్రజలందరినీ బాగా చూసుకుంటా, నన్ను నమ్ముకున్న వారిని నేను కాపా డుకుంటా.
నా రూపాన్ని పెట్టాలనే సంకల్పాన్ని నెర వేర్చుకుంటా. నాకు శాశ్వత రూపం పెట్టా లని చూస్తున్నారు అది చేయండి, నాకు రక్తబలిని ఇవ్వడం లేదు. మీకు నచ్చింది ఇస్తున్నారు. దాంతోనే నేను సంతోషంగా ఉన్నాను. అదే చాలు. 5 వారాలపాటు పప్పు, బెల్లంతో సాక పెట్టండి. పంటల్లో ఎక్కువ రసాయనాలు వాడుతున్నారు, వాటితో రోగాలు పెరిగిపోతున్నాయి, వాటి ని తగ్గించుకోండి. పిల్లలు, గర్భిణీలకు ఏ ఇబ్బంది రానివ్వను. అంద రినీ సంతోషంగా ఉండేలా చూసుకుంటా ను’అని అన్నా రు.
ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ ముఖ్య కార్య దర్శి శైలజా రామయ్యర్, కమి షనర్ హన్మంతరావు, కలెక్టర్ అనుదీప్ దురి శెట్టి, ఈవో మనోహర్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
ఘనంగా అమ్మవారికి సాగనంపు..: బోనా లు, రంగం అనంతరం అమ్మవారి సాగనంపు కార్యక్రమాన్ని ఘనంగా చేప ట్టారు. అమ్మవారిని అంబారీపై ఉంచి, అమ్మవారి ఘటంతో సాగనంపు కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనితో జాతర ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment