
ఘటం.. ఘనం
పాతబస్తీలో బోనాల ఉత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ మాతేశ్వరీ ఘటాల ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. అంబారీపై అమ్మవారిని కొలువుదీర్చి...భక్తకోటి తరలిరాగా అంగరంగ వైభవంగా ఊరేగించారు. మీరాలం మండి మహంకాళి దేవాలయానికి చెందిన ఘటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.