
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ సంబరాల్లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోనాలు తెలంగాణకు ప్రత్యేకమైన పండుగ అని, ప్రకృతిని ఆరాధించే పండుగ బోనాలు అని అన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం, లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో బోనాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అమ్మవారి ఘట్టాన్ని నిన్న (బుధవారం) ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకూ ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్టించారు. వేడుకల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రాములు, ప్రకాశ్, లింగయ్య, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప‍్రతినిధి రామచంద్రు పాల్గొన్నారు.