
మద్యం దుకాణాలు బంద్
బోనాల నేపథ్యంలో నగరంలో మద్యం విక్రయాలను నిషేధించారు.
హైదరాబాద్ : బోనాల ఉత్సవాల నేపథ్యంలో నగరంలో మద్యం విక్రయాలను నిషేధిస్తూ నగర కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 నుంచి మంగళవారం ఉదయం 6 వరకు నగరంలోని స్టార్ హోటళ్ళలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్బుల మినహా ఎక్కడా మద్యం విక్రయించకూడదని ఆయన స్పష్టం చేశారు.