Wines
-
Telangana: రూ.150 బీరు.. రూ.180కి విక్రయం..!
భైంసాటౌన్: బీర్ల ధరల పెంపునకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కానీ ఎంతమేర పెంచాలన్న దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయినా పట్టణంలో కొందరు వైన్స్ నిర్వాహకులు బీర్ల ధరలు పెంచి విక్రయిస్తున్నారు. మంగళవారం పట్టణంలోని బాసర రోడ్డులో గల ఓ వైన్స్షాపులో రూ.150 ఎమ్మార్పీ ఉన్న బీరును రూ.180కి విక్రయించినట్లు ఓ మద్యం ప్రియుడు వాపోయాడు. ఈ మేరకు తన ఫోన్‌పే నంబర్ ద్వారా డబ్బులు చెల్లించినట్లు రశీదు చూపాడు. ధరల పెరుగుదలకు ముందే పెంచి విక్రయించడం ఎంతవరకు సబబని అతడు ప్రశ్నిస్తున్నాడు. బీర్ల ధరల పెంపు విషయమై ఎక్సైజ్ సీఐ నజీర్హుస్సేన్ను ఈ సందర్భంగా వివరణ కోరగా తమకు అధికారికంగా ఎలాంటి ఆదేశాలు లేవన్నారు. పాత స్టాకును పాత రేట్లకే విక్రయించాల్సి ఉండగా ఎలాంటి ఆదేశాలు లేకుండానే అధిక ధరలకు విక్రయించడంపై మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బీరులో చెత్త, చెట్నీలో బొద్దింక
-
ఎనీ టైం మద్యం రెడీ..
నిజామాబాద్: జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి వరకు బార్లు తెరిచి ఉంచి జోరుగా మద్యం అమ్ముతున్నప్పటికీ ఎకై ్సజ్, పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలో 13 బార్లు ఉండగా అందులో 12 బార్లు నడుస్తున్నాయి. ఎకై ్సజ్ నిబంధనల మేరకు బార్లలో మద్యాన్ని బార్లోపలే అమ్మాలి. కాని నగరంలో గత కొన్నేళ్లుగా లిక్కర్ దందాలో ఆరితేరిన వ్యాపారి ఒకరు తన బార్లో దర్జాగా రాత్రి 10 గంటల తర్వాత షట్టర్ తెరిచి బయటకు అమ్మకాలు సాగిస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ తతంగం జరుగుతున్నా ఎకై ్స జ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరం నడిబొడ్డున.. నగరంలోని శివాజీనగర్ చౌరస్తా, గుర్బాబాది రోడ్డు, అర్సపల్లి రోడ్డులో ఉన్న బార్లు రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు బాహాటంగానే బయటకు మద్యాన్ని అమ్ముతున్నారు. ఎకై ్సజ్ నిబంధనల ప్రకారం వైన్స్‌లు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మాలి. బార్లు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11:30 వరకు తెరిచి ఉంచాలి. కాని నగరంలోని ఈ మూడు ప్రాంతాల్లో ఉన్న బార్లు రాత్రి 10 గంటల తర్వాత వైన్స్‌లు మూసిన అనంతరం 10 గంటల నుంచి రాత్రి 11:30 వరకు బయటి వ్యక్తులకు మద్యాన్ని అమ్ముతున్నారు. అధికారికంగా బార్ తలుపులు మూసి ఉంచినప్పటికీ అనధికారికంగా రాత్రి ఒంటి గంట వరకు కూడా దర్జాగా మద్యం అమ్ముతున్నారు. ఎకై ్స్జ్ అధికారులకు నెలవారీగా మామూళ్లు అందుతుండడం వల్లే వాటి జోలికి వెళ్లట్లేదనే ఆరోపణలున్నాయి. అధికారుల నిర్లక్ష్యమే.. నగరంలోని బార్లకు వైన్స్ మద్యం తరులుతున్నా ఎకై ్సజ్ అధికారులు తనిఖీలు చేయడం లేదు. గతంలో ఓ బార్లో వైన్స్ మద్యం దొరకడంతో అప్పుడు ఉన్న ఓ ఎకై ్సజ్ అధికారితో బేరసారాలు కుదుర్చుకున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై డిప్యూటీ కమిష నర్ ఆదేశాల మేరకు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి విచారణ చేపట్టారు. ఈ విచారణ కూడా నామమాత్రంగానే జరిగినట్లు సమాచారం. అలాగే అర్ధరాత్రి తర్వాత బార్లో మద్యం బయటకు అమ్మడంపై తనిఖీలు చేయాలని ఎకై ్సజ్ ఎస్సైకి ఆదేశాలు అందినప్పటికీ తనిఖీలు చేపట్టకపోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైన్స్‌ల ఆదాయానికి గండి.. నిజామాబాద్ ఎకై ్సజ్ ఎస్‌హెచ్‌వో పరిధిలో 19 వైన్స్‌లు ఉన్నాయి. ఈ వైన్స్‌లో రాత్రి 10 గంటలకు మూసివేస్తున్నారు. కాని బార్లు అర్ధరాత్రి వరకు మద్యం అమ్ముతుండడంతో తమ ఆదాయానికి గండి పడుతోందని వైన్స్ యజమానులు ఎకై ్సజ్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ బార్లు కూడా బీర్‌కు రూ. 20, విస్కీకి రూ. 50 చొప్పున అధిక ధరలకు మద్యం అమ్ముతున్నట్లు తెలిసింది. తనిఖీలు చేస్తాం.. రాత్రివేళ్లలో తనిఖీలు చేపట్టాలని ఎస్‌హెచ్‌వో దిలీప్‌కు ఆదేశాలిచ్చాను. ఎకై ్సజ్ ఎస్సై మల్లేశ్‌కు తనిఖీలు చేపట్టాలని సూచించాం. బార్లకు వచ్చిన మద్యంను బయటకు అమ్మడానికి లేదు. ఇలా చేస్తే నోటీసులు అందిస్తాం. బార్లు అ ర్ధరాత్రికి అమ్మకాలు చేస్తున్నారని వైన్స్ యాజ మాన్యాల నుంచి ఫిర్యాదు వచ్చింది. దీనిపై చర్యలు తీసుకుంటాం. – మల్లారెడ్డి, -
చోరీ మామూలే..కానీ ఈ దొంగకు ఓ ప్రత్యేకత ఉంది
సాక్షి, అశ్వారావుపేట(ఖమ్మం) : అశ్వారావుపేటలోని ఓ వైన్స్‌లో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. కేవలం చోరీ అయితే మామూలు విషయమే కావొచ్చు కానీ ఈ చోరీకి ఓ ప్రత్యేకత ఉంది. చోరీకి పాల్పడింది ఒకరో, ఇద్దరో తెలియదు కానీ దాదాపు రూ.2 లక్షల విలువైన మద్యం బాటిళ్లను అపహరించుకుపోయారు. రానున్న దసరాకు అమ్మకాలు జోరుగానే సాగుతాయనే భావనతో భారీగా స్టాక్ తెప్పించినట్లు సమాచారం. చదవండి: హుజురాబాద్ ఉపఎన్నిక: సమరభేరిలో సకుటుంబం.. అయితే, వైన్స్షాపులో సీసీ కెమెరాలు ఉండగా.. వైర్లను కత్తిరించిన నిందితులు లోపలికి ప్రవేశించారు. షాపులో వివిధ రకాల ఖరీదైన బ్రాండ్ల మద్యం ఉన్నా... కేవలం మాన్షన్ హౌస్ బ్రాందీ సీసాలు మాత్రమే ఎత్తుకెళ్లారు. ఇక వెళ్లిపోయే క్రమంలో వైన్స్‌లోని సీసీ కెమెరాల పుటేజీ హార్డ్ డిస్క్ కూడా ఎత్తుకెళ్లడం విశేషం. ఈ మేరకు సమాచారం అందుకున్న సీఐ ఉపేంద్రరావు, ఎస్సై చల్లా అరుణ సంఘటనా స్థలానికి చేరుకుని కొత్తగూడెం నుంచి క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. చదవండి: Stegosaurus: గుడ్డు నుంచి ఆకాశానికి.. నెల రోజుల క్రితం ఊట్లపల్లిలో.. నెల రోజుల క్రితం మండలంలోని ఊట్లపల్లి గ్రామం వద్దగల మద్యం దుకాణంలో కూడా గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ. లక్ష విలువైన మద్యం అపహరించారు. కాగా ఈ రెండు చోరీ ఘటనపై స్థానిక పోలీసులు కేసులు నమోదు చేయలేదు. నెలరోజుల వ్యవధిలో రెండుసార్లు మద్యం చోరీ జరగడం గమనార్హం. చోరీ ఘటనలపై స్థానిక ఎస్సై చల్లా అరుణను ‘సాక్షి’ వివరణ కోరగా..చోరీ జరిగినట్లు సమాచారం ఉందని, కానీ వాటిపై బాధితుల నుంచి లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు రాకపోవడంతో కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు. -
వైన్స్ సిట్టింగ్ రూమ్‌లో ఘర్షణ
-
నేటి నుంచి వైన్‌షాపులు రాత్రి 8:30 వరకు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి మద్యం దుకాణాలు రాత్రి 8:30 గంటల వరకూ తెరిచి ఉంటాయని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. హరితహారంలో భాగంగా ఈ ఏడాది 45 లక్షల తాటి, ఈత మొక్కలను నాటేందుకు తగినంత ప్రణాళిక సిద్ధం చేయాలని, గుడుంబా తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎక్సైజ్‌శాఖపై శుక్రవారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి గీత కార్మికునికీ శాఖాపరమైన సభ్యత్వ కార్డులను అందజేయాలని, సొసైటీలకు ఇచ్చే తాటి, ఈత చెట్ల కాలపరిమితిని కూడా పదేళ్ల పాటు పెంచుతూ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. అదనంగా తాటి, ఈత చెట్లను అదనపు రేషన్ కావాలంటే శాఖా పరంగా సంబంధిత అధికారులను సంప్రదించి అనుమతి తీసుకోవాలన్నారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ పనితీరును మరింత సమర్థవంతంగా ఉండేలా స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలను పటిష్టపరిచేందుకు ఒక సమర్థవంతమైన అధికారిని నియమిస్తామన్నారు. ఆబ్కారీ శాఖలో మహిళా ఉద్యోగులకు ఎలాంటి వేధింపులు జరిగినా కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. నీరా అమ్మకాలను ప్లాస్టిక్ సీసాలలో కాకుండా టెట్రా ప్యాక్‌లలో మాత్రమే జరపాలని మంత్రి కోరారు. ఈ సమీక్షలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు కమిషనర్ అజయ్‌రావు, డిప్యూటీ కమిషనర్లు ఖురేషీ, కేఏబీ శాస్త్రి, సహాయ కమిషనర్ హరికిషన్, ఈఎస్‌లు దత్తరాజుగౌడ్, చంద్రయ్య, ప్రదీప్ రావు, గణేశ్ గౌడ్, రఘురాం, జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. -
ఇకపై దగ్గు మందుకూ ప్రిస్క్రిప్షన్ ఉండాల్సిందే!
సాక్షి, అనంతపురం: లాక్డౌన్ నేపథ్యంలో కొద్ది మంది మద్యం ప్రియులు అడ్డదారులు తొక్కుతున్నారు. మద్యం దాహాన్ని తీర్చుకునేందుకు కొద్ది మంది నాటుసారా, కల్లు, అక్రమ మద్యాన్ని ఆశ్రయిస్తుండగా.. మరికొందరు అడుగు ముందుకు వేసి ఏకంగా దగ్గు మందు, డైజోఫామ్ ట్యాబ్లెట్లు, వైట్‌నర్‌లను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే నాటుసారా, కల్తీ కల్లు, మద్యంపై చర్యలు ప్రారంభించిన అధికారులు.. మెడికల్ షాపులపైనా దృష్టి సారించారు. గుర్తింపు పొందిన డాక్టరు ప్రిస్క్రిప్షన్ లేకుండా దగ్గు మందు, వైట్నర్లు, డైజోఫామ్ ట్యాబ్లెట్లను విక్రయించవద్దని మెడికల్ షాపు యాజమాన్యాలకు తేల్చిచెప్పారు. ఇందుకు అనుగుణంగా జిల్లా ఎక్సైజ్‌శాఖ అధికారులు.. మెడికల్ షాపు యాజమాన్యాలకు నోటీసులను కూడా అందజేశారు. చదవండి: 8 వేలు దాటిన కరోనా కేసులు ప్రధానంగా లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను బంద్ చేశారు. అంతేకాకుండా బార్లు కూడా మూతపడ్డాయి. దీంతో మద్యం దొరకడం కష్టంగా మారింది. ఇదే అదనుగా కొద్ది మంది అక్రమ మద్యం వ్యాపారానికి తెరలేపారు. టమాట లోడులతో పాటు అక్రమంగా మద్యాన్ని కర్ణాటక నుంచి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే జిల్లా ఎక్సైజ్‌శాఖ అధికారులు పక్కా సమాచారంతో ఆదిలోనే అడ్డుకట్ట వేశారు. ఈ నేపథ్యంలో మందుబాబులు దగ్గు మందు, వైట్నర్లు, డైజోఫామ్ ట్యాబ్లెట్లను వాడుతున్నట్లు తెలుస్తోంది. ఇది అంతిమంగా ఆరోగ్యాన్ని దెబ్బతీయనుంది. ఈ నేపథ్యంలో గుర్తింపు పొందిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని విక్రయించవద్దని మెడికల్ షాపు యాజమాన్యాలకు ఎక్సైజ్‌శాఖ అధికారులు నోటీసులు జారీచేశారు. మద్యం నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు జిల్లాలో మద్యం అక్రమ రవాణా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. నాటుసారా తయారీపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇక మద్యానికి బానిసైన కొద్ది మంది డైజోఫామ్ ట్యాబ్లెట్లు, దగ్గుమందు, వైట్నర్ వాడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. డాక్టరు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు విక్రయించవద్దని మెడికల్ షాపు యాజమాన్యాలకు నోటీసులు జారీచేశాం. – విజయశేఖర్, ఎక్సైజ్‌శాఖ డీసీ చదవండి: కరోనా మిస్టరీలు -
ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం..
సాక్షి, విశాఖపట్నం: మందుబాబులకు మద్యం ధరలు నిజంగానే కిక్ ఇస్తున్నాయి. నూతన మద్యం పాలసీలో భాగంగా మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మద్యం ధరలను పెంచేసింది. పెంచిన ధరలు జిల్లాలో గురువారం నుంచి అమలులోకి వచ్చాయి. ధర ముద్రించకనే.. మద్యం బాటిళ్లకు ఎమ్మార్పీపై రూ.10 నుంచి రూ.30 వరకు మోత మోగుతోంది. అయితే పెంచిన ధరలు బాటిళ్లపై ఇంకా ముద్రించలేదు. ప్రస్తుతం డిస్టలరీ డిపోల్లో పాత ఎమ్మార్పీతో ఉన్న సరుకునే మద్యం వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇన్వాయిస్లో మాత్రం కొత్త రేట్లు వసూలు చేస్తున్నారు. పేరొందిన డిస్టలరీల కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న మద్యంపై ఒక రేటు, కొత్తగా వచ్చిన కంపెనీలు తయారు చేసే మద్యంపై మరో రేటుతో ఇన్వాయిస్ వసూలు చేస్తున్నారు. మొన్నటి వరకు ఒక సాధారణ బ్రాండ్ క్వార్టర్ బాటిల్‌పై ఉండే ఎమ్మార్పీ రూ.80 ఉంటే, ప్రస్తుతం బ్రాండ్‌ను బట్టి రూ.90 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. ఇంకా మంచి బ్రాండ్స్ అయితే ఒక్కో బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 పెంచి విక్రయిస్తున్నారు. ధరల పెంపు వల్ల కనీసం 15 శాతం ఆదాయం అదనంగా వస్తుందని ఎక్సైజ్‌శాఖ అంచనా వేస్తోంది. పెంచిన రేట్లతో లైసెన్స్ గడువు పూర్తయ్యే సమయానికి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుందని అంచనా. ‘స్వైప్’ చేసేశారు బార్ కోడింగ్ విధానం జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. మద్యం కొనుగోలు చేసే వినియోగదారుడికి ప్రతి బాటిల్‌పై స్వైప్ మిషన్ ద్వారా కోడింగ్ చేసి బిల్లు ఇవ్వాలి. తద్వారా లూజు విక్రయాలకు చెక్ పెట్టవచ్చున్నది ప్రభుత్వ ఆలోచన. కానీ ఈ విధానానికి మద్యం వ్యాపారులు తూట్లు పొడిచారు. స్వైపింగ్ మిషన్ల వినియోగానికి ఏమాత్రం ఆసక్తి చూపలేదు. వీటి ద్వారా అమ్మకాలు జరిపితే లూజు విక్రయాలు పూర్తిగా పడిపోయి వ్యాపారం దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలోచనతో వీటిని పక్కన పెట్టేశారు. -
'ఆయనవి దరిద్రమైన ఆలోచనలు'
హైదరాబాద్: బంగారు తెలంగాణ అని చెప్పి.. మద్యం తెలంగాణగా మారుస్తున్నారని టీఆర్ఎస్నుద్దేశించి బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్‌వి దరిద్రమైన ఆలోచనలని మండిపడ్డారు. షాపింగ్ మాల్స్‌లో మద్యం అమ్మకాలకు ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. తెలంగాణ సర్కార్ మద్యం పాలసీలు సిగ్గు పడేలా ఉన్నాయని మండిపడ్డారు. మహిళల ఆత్మ గౌరవ సమస్య ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. నూతన మద్యం పాలసీని వెంటనే రద్దు చేయాలన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు మహిళలంటే గౌరవం లేదన్నారు. ఆసియాలోనే అత్యధిక మద్యం అమ్మకాలు జరిపిన సీఎంగా కేసీఆర్‌కు అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టిన గతే 2019 లో టీఆర్ఎస్కు పడుతుందని ఆకుల విజయ అన్నారు. అక్టోబర్ 1 నుంచి వైన్‌షాపుల్లోనే కాదు షాపింగ్‌మాల్స్‌లో కూడా కోరిన మందు బాటిల్స్ లభించనున్న విషయం తెలిసిందే. -
ఇక షాపింగ్ మాల్స్‌లో మద్యం
-
మాల్స్‌లో మద్యం
► షాపింగ్ మాల్స్‌కు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ► ఇక రాత్రి 11 గంటల వరకు వైన్‌షాప్‌లు ► ప్రతి వైన్‌షాప్ వద్ద రెండు సీసీ కెమెరాలు.. ► కంట్రోల్ రూంతో అనుసంధానం ► లైసెన్స్ ఫీజు శ్లాబుల సంఖ్య ఆరు నుంచి నాలుగుకు కుదింపు ► దరఖాస్తు ధర రెట్టింపు.. లైసెన్స్ ఫీజులూ పెంపు ► 13 నుంచి 19 వరకు దరఖాస్తుల స్వీకరణ.. 22న లాటరీ ► అక్టోబర్ 1 నుంచి కొత్త షాపులు... రెండేళ్ల పాటు లైసెన్స్ ► 2,216 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల సాక్షి, హైదరాబాద్ మందుబాబులకు ఇక పండుగే పండుగ! అక్టోబర్ 1 నుంచి వైన్‌షాపుల్లోనే కాదు షాపింగ్‌మాల్స్‌లో కూడా కోరిన మందు బాటిల్స్ లభించనున్నాయి. రానున్న రెండేళ్ల కోసం రాష్ట్ర సర్కారు రూపొందించిన ఎక్సైజ్ పాలసీలో ఇందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఈ పాలసీ ప్రకారం దరఖాస్తు చేసుకుని, నిర్దేశిత ఫీజు కట్టే ప్రతి షాపింగ్‌మాల్‌కూ మద్యం అమ్ముకునే వెసులుబాటు లభించనుంది. అలాగే వైన్‌షాపులు ఓ గంట పాటు ఎక్కువ సమయం అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటివరకు రాత్రి 10 గంటలకు షాపులు మూసేయాల్సి ఉండగా.. కొత్త పాలసీలో దాన్ని 11 గంటల వరకు పొడిగించారు. అక్టోబర్ నుంచి అమ్మకాలు 2017–19 కాలానికిగాను మద్యం షాపుల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 2,216 మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారం నోటిఫికేషన్ ఇచ్చారు. దీని ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి 2019 సెప్టెంబర్ 30 వరకు కొత్త దుకాణాలకు లైసెన్స్ ఇస్తారు. ఇందుకు లాటరీల ద్వారా దుకాణ యజమానులను ఎంపిక చేస్తారు. లాటరీలో పాల్గొనేందుకు బుధవారం నుంచి ఈ నెల 19 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 22న లాటరీలు తీసి దుకాణ యజమానులను ఎంపిక చేస్తారు. అక్టోబర్ 1 నుంచి కొత్త షాపుల్లో మద్యం విక్రయాలు జరుగుతాయి. దరఖాస్తు ధర, ఫీజులు ఇలా.. గతంలో రూ.50 వేలు ఉన్న దరఖాస్తు ఫీజును ఈసారి రూ.లక్షగా నిర్ణయించారు. దరఖాస్తు కింద తీసుకునే ఈ ఫీజు తిరిగి ఇవ్వరు. దరఖాస్తుతోపాటు లైసెన్స్ ఫీజులో 10 శాతం ఈఎండీగా కట్టాల్సి ఉంటుంది. లాటరీలో షాపు రాకపోతే ఈ ఈఎండీని తిరిగి చెల్లిస్తారు. ఈసారి లైసెన్స్ ఫీజు కూడా పెంచారు. గతంలో ఉన్న ఆరు శ్లాబులను నాలుగు శ్లాబులుగా కుదించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. 50 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో ఏడాదికి రూ.45 లక్షలుగా ఫీజును నిర్ధారించారు. 50 వేల నుంచి 5 లక్షల వరకు జనాభా ఉంటే రూ.55 లక్షలు, 5 నుంచి 20 లక్షల వరకు ఉంటే.. రూ.85 లక్షలు, 20 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉంటే రూ.1.10 కోట్లుగా లైసెన్స్ ఫీజును నిర్ధారించారు. దరఖాస్తు ధర పెంపుతో రూ.100 కోట్లు, లైసెన్స్ ఫీజు పెంపుతో రూ.100 కోట్లకు పైగా అదనపు ఆదాయం వస్తుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. మొత్తంగా ఈ ఏడాది రూ.15,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని భావిస్తోంది. సీసీకెమెరాలు తప్పనిసరి కొత్త మద్యం దుకాణాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేశారు. ప్రతి దుకాణం పరిధిలో రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వాటిని ఎక్సైజ్ కంట్రోల్‌రూంకు అనుసంధానం చేస్తారు. అదే విధంగా ప్రతి షాపులో హోలోగ్రామ్ల తనిఖీకి అవసరమైన యంత్రాంగాన్ని కూడా సమకూర్చుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఒకవేళ నోటిఫైడ్ షాపులకు ఎవరూ దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోతే బేవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో షాపులు ఏర్పాటు చేసే నిబంధనను కూడా నోటిఫికేషన్లో పొందుపర్చారు. గతేడాది మిగిలిపోయిన 72 దుకాణాలను కూడా అవసరమైతే ఇతర ప్రాంతాలకు కేటాయిస్తామని నోటిఫికేషన్లో తెలిపారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై మద్యం దుకాణాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలను కచ్చితంగా పాటించనున్నట్టు పేర్కొన్నారు. జనాభా ప్రకారం నాలుగు శ్లాబులివే.. జనాభా ఫీజు ఏడాదికి రెండేళ్లకు (రూ.లక్షల్లో) 50 వేల వరకు 45 90 50,001–5 లక్షల వరకు 55 110 5,00,001–20 లక్షల వరకు 85 170 20 లక్షల పైన 110 220 -
నిబంధనలు మీరితే మద్యం షాపుల సీజ్
దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తాడేపల్లిగూడెం : నిబంధనలు మీరి మద్యం విక్రయిస్తే ఆయా షాపులను సీజ్ చేయాలని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో సమావేశం నిర్వహించారు. బెల్టు దుకాణాల పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా, దుకాణాల బయట మద్యం తాగేవారు ఎక్కువుగా ఉన్నట్టు చెప్పారు. దుకాణాల వద్ద లూజు విక్రయాలను అరికట్టాలన్నారు. ప్రజల సూచనల మేరకు పర్మిట్ రూమ్‌ల రద్దుకు సీఎం చంద్రబాబును కోరనున్నట్టు చెప్పారు. మద్యం దుకాణాల ఎదుట వినియోగించిన ప్లాస్టిక్ గ్లాసులు కనిపిస్తే షాపులకు తాళం వేయాలని ఎక్సైజ్ సీఐ ఆర్బీ పెద్దిరాజును ఆదేశించారు. గూడెంను ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. తోపుడు బండ్లు, కిరాణా, పండ్ల వ్యాపారులు, హోటల్స్ యజమానులతో సమావేశం నిర్వహించి ప్లాస్టిక్ కవర్లు వాడకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి పట్టణ శివారు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో రేవులు ఏర్పాటు చేయాలని, క్రేన్ల సాయంతో కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. 7, 9, 11వ రోజుల్లో నిమజ్జనాలను నిర్వహిస్తారన్నారు. లారీలను పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలుపుదల చేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ నాయకులు నరిశే సోమేశ్వరరావు. పోతుల అన్నవరం పాల్గొన్నారు. అంతకు ముందు అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. -
మద్యం దుకాణాలన్నీ జనావాసాల్లోకే!
కడప అర్బన్ : నిబంధనలు పక్కాగా పాటించాలంటే యజమానులు తప్పనిసరిగా షాపులను జనావాసాల్లోకి తీసుకు వెళ్లాల్సి వస్తోంది. అయితే అక్కడ స్థానికులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. నిబంధనలు పాటించకపోతే షాపు లైసెన్సులు కూడా రద్దు చేసేందుకు వెనుకాడబోమని అధికారులు ఓవైపు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ నూతన మద్యం విధానంలో ఒకవైపు యజమానులు, మరోవైపు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని తెలుస్తోంది. జిల్లాలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిబంధనలు అమలు చేస్తే చాలా మద్యంషాపులు అర్హత కూడా పొందలేవని, ఇప్పటికే ఒక జాబితాను ఎక్సైజ్ అధికారులు తయారుచేశారు. ఇవిగాక 31 మద్యం దుకాణాలను సుప్రీంకోర్టు నిబంధనల మేరకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా నూతన మద్యం విధానంలో 255 మద్యం షాపులు ప్రారంభించాల్సి ఉంది. ప్రజల్లో వ్యతిరేకత.. దుకాణాల రద్దు సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి జనావాసాల మధ్య మద్యం దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటికే ప్రయత్నిస్తున్నారు. దీంతో స్థానిక ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తోంది. కడప నగరంలోని రైతుబజార్ సమీపంలో ఏర్పాటు చేయాలనుకున్న మద్యం దుకాణానికి సంబంధించి ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఇప్పటికే రద్దుచేశారు. ఆ దుకాణాన్ని మరలా సంధ్య థియేటర్ సమీపంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడం అక్కడికి చర్చి దగ్గరలో ఉందనీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇలాగే జిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాల ఏర్పాటును స్థానికులు అడ్డుకుంటున్నారు. సుప్రీంకోర్టు నిబంధనలు ఇలా... సుప్రీంకోర్టు మద్యం దుకాణాల ఏర్పాటు విషయంలో స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. జాతీయ రహదారులకు ఇరువైపులా రోడ్డు నుంచి 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణం ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ బడి, గుడి, మసీదు, చర్చిలు ఉండరాదు. వీటికి 100 మీటర్ల దూరం తప్పనిరిగా వుండాలి. మద్యం దుకాణం ఏర్పాటు చేసే గ్రామ పరిధిలో 20వేల జనాభాకుపైగా ఉంటే రహదారులకు 500 మీటర్ల దూరంలోను, 20 వేల లోపు జనాభా ఉంటే 220 మీటర్ల దూరంలోను మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి. నిబంధనలు పాటించక పోతే చర్యలు తప్పవు నూతన మద్యం విధానంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందే. నిబంధనలకు వర్తించని వాటిని ఇప్పటికే గుర్తించి తప్పనిసరిగా ఏర్పాటు చేసుకునే విధంగా సూచనలు చేశాం. ప్రజల్లో ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని అనిపిస్తే, తగిన కారణాలతో తమ దృష్టికి ఫిర్యాదులు తీసుకుని రావచ్చు. – డాక్టర్ ఏనుగుల చైతన్యమురళి, ఎక్సైజ్ డీసీ, కడప ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలా? సుండుపల్లి: పీలేరు–సుండుపల్లి మార్గమధ్యంలోని పట్టణప్రాంతంలో పోలీస్‌స్టేషన్ సమీపాన జనావాసాల మధ్యలో మద్యందుకాణం ఏర్పాటుచేస్తుండటంతో స్థానిక మహిళలు, యువకులు ఆందోళన చేపట్టారు. శనివారం ఉదయం మద్యం దుకాణానికి ఇస్తున్న ఇంటి దగ్గర ధర్నా నిర్వహించారు. సాయంత్రం సైతం ఆందోళన చేస్తుండటంతో తహసీల్దార్ సుబ్రమణ్యంరెడ్డి అక్కడకు చేరుకున్నారు. ఇళ్ల మధ్య మద్యందుకాణాలు ఎలా నిర్వహిస్తారని మహిళలు నిలదీశారు. అయితే ఒకవైపు పోలీస్‌స్టేషన్ మరొకవైపు ప్రైవేటు పాఠశాల, అదేవిధంగా స్త్రీశక్తిభవనం, ఎంపీడీఓ కార్యాలయం, వెటర్నరీ కార్యాలయాలు అతిదగ్గరలో ఉన్నాయని ఇక్కడ ఏర్పాటుచేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తమ సమస్యను వినతిపత్రం ద్వారా తెలిపారు. బ్రాందీషాపు వద్దని మహిళల రాస్తారోకో రాజంపేట: పట్టణంలోని మన్నూరులో బ్రాందీషాపు ఏర్పా టు చేయవద్దని మహిళలు ఆందోళనకు దిగారు. శనివారం పట్టణ ప్రధానరహదారిపై బైఠాయించారు. నివాసాల మధ్య మద్యంషాపు ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుందని మహిళలు తెలిపారు. మహిళలు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో మన్నూరు పోలీసులు రంగప్రవేశం చేశారు. మహిళలతో చర్చించారు. ఫిర్యాదు చేస్తే సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని సర్దిచెప్పడంతో వారు ఆందోళనను విరమింపచేశారు. ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పూలభాస్కర్తోపాటు స్థానిక మహిళలు పాల్గొన్నారు. గుడి వెనుక... వైన్స్ కడప కార్పొరేషన్ : స్థానిక సంధ్యాహాల్ సర్కిల్లో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం 1949 నుంచి ఉంది. దీని పక్కనే పురాతన ఎస్పీజీ చర్చి కూడా ఉంది. సంధ్యా సర్కిల్లోని దేవాలయంలో శ్రీరామనవమి, హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రైతుబజార్‌కు పోవాలన్నా, డాన్‌బోస్కో ఐటీఐ, గాయత్రీ కళాశాల, ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లాలంటే ఈ మార్గం గుండానే పోవాల్సి ఉండటంతో ఈ ప్రాంతంలో వైన్‌షాపుతో ఇబ్బందులు ఏర్పడుతాయని స్థానికులు హెచ్చరిస్తున్నారు. స్థానికులు, దేవాలయ భక్తుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండానే ఇక్కడ వైన్స్ ఏర్పాటు చేసేందుకు చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకపోవడంతో స్థానిక ప్రజలు, దేవాలయ భక్తులు కలెక్టర్‌ను కలవాలనే యోచనలో ఉన్నారు. అప్పటికీ న్యాయం జరగకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగేందుకు వారు సమాయత్తమవుతున్నారు. ఆర్ఎస్ రోడ్డులో ఇళ్ల మ«ధ్యలోనే... ఆర్టీసీ బస్టాండు నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లే మార్గంలో ప్రకాష్‌నగర్ వద్ద బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేసేందుకు యత్నాలు సాగుతున్నాయి. నివాస గృహాల పక్కనే బార్ అండ్ రెస్టారెంట్‌కు అనుమతి ఇవ్వడంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవలే ఇద్దరు బాడుగకు ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి వేరొక చోటుకు వెళ్లిపోయినట్లు తెలిసింది. -
మద్యం దుకాణాలు బంద్
హైదరాబాద్ : బోనాల ఉత్సవాల నేపథ్యంలో నగరంలో మద్యం విక్రయాలను నిషేధిస్తూ నగర కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 నుంచి మంగళవారం ఉదయం 6 వరకు నగరంలోని స్టార్ హోటళ్ళలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్బుల మినహా ఎక్కడా మద్యం విక్రయించకూడదని ఆయన స్పష్టం చేశారు. -
41 మద్యం దుకాణాలు సిద్దిపేటకు బదిలీ
కరీంనగర్ క్రై: జిల్లా మద్యం డిపో పరిధిలో ఉన్న 41 మద్యం దుకాణాలు, 5 బార్లను మెదక్ జిల్లా సిద్దిపేటలో కొత్తగా ప్రారంభంకానున్న మద్యం డిపోకు బదిలీచేస్తూ బుధవారం రాత్రి ఎకైసజ్‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గంభీరావుపేట మండలం పరిధిలోని 9 దుకాణాలు, సిరిసిల్ల ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని 15 మద్యం దుకాణాలు, 3 బార్లు, వేములవాడ ఎకై ్సజ్ ఠాణా పరిధిలోని 17 మద్యం దుకాణాలు, 2 బార్లను బదిలీ చేశారు. ఆగస్టు 1 నుంచి వీటికి సిద్దిపేట డిపో నుంచి మద్యం సరఫరా చేస్తారు. ఈ మేరకు జగిత్యాల ఎకై ్సజ్ సూపరింటెండెంట్‌కు ఉత్తర్వులు పంపించారు. దీంతో ఆయా మద్యం దుకాణాలు, బార్లకు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. -
మద్యం షాపులపై ఎన్ఫోర్స్మెంట్ దాడులు
గుంతకల్లు (అనంతపురం జిల్లా) : గుంతకల్లు పట్టణంలో గురువారం మధ్యాహ్నం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మద్యం షాపులపై దాడులు నిర్వహించారు. పాత గుంతకల్లు, కొత్త గుంతకల్లులోని పలు దుకాణాలను సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. మద్యం నిల్వలను పరిశీలించారు. పాత గుంతకల్లులోని శ్రీసాయి వైన్స్‌లో చీప్ లిక్కర్లో నీళ్లు కలిపి విక్రయిస్తున్నట్లు గమనించారు. దీనిపై దుకాణం యాజమాన్యాన్ని వివరణ కోరారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. -
మొదలైన జోష్.. కిక్కిరిసిన వైన్ షాపులు!
హైదరాబాద్: భాగ్యనగరంలో నూతన సంవత్సరం జోష్ అప్పుడే ప్రారంభమైంది. హైదరాబాద్ అంతటా సంబరాల వాతావరణం వెల్లివిరుస్తోంది. ఆనందోత్సాహాలతో కొత్త సంవత్సరాన్ని భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు హైదరాబాద్ వాసులు సిద్ధమవుతున్నారు. నగరంలో ఎటుచూసినా రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు, పబ్బులు, రిసార్ట్లు సందడిగా కనిపిస్తున్నాయి. డీజేల సంగీతం హోరెత్తుతోంది. మందుబాబులు ముందుజాగ్రత్త ఏర్పాట్లలో నిమగ్నమవ్వడంతో నగరంలోని బార్లు, వైన్‌షాపులు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఊహించినవిధంగానే కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం అమ్మకాలు రికార్డుస్థాయిలో కొనసాగే అవకాశం కనిపిస్తున్నది. యువత సందడిగా గడిపేందుకు డీజేలు, మ్యూజిక్ నైట్లతో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పలు ఆంక్షలు విధించిన పోలీసులు.. ఎలాంటి అవాంఛీనయ ఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. -
ఏపీ సర్కార్ విదానాలపై ఐద్వా ఫైర్
-
మద్యంషాపులకోసం భారీగా దరఖాస్తులు
-
భారీగా కల్తీ మద్యం పట్టివేత
- జంగాలపల్లిలో ఎక్సైజ్ అధికారుల దాడులు - పట్టుకున్న మద్యం విలువ రూ.లక్ష ములుగు : ములుగు మండలం జంగాలపల్లిలోని ఓ వైన్స్‌లో ఎక్సైజ్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించి రూ.లక్ష విలువైన కల్తీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో అధికారులు నిర్వహించిన దాడుల్లో పెద్దమొత్తంలో కల్తీ మద్యం లభించడం మండలంలో చర్చనీయూంశంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నారుు. జంగాలపల్లిలోని నవ తెలంగాణ వైన్స్‌లో కల్తీ మద్యం అమ్ముతున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నర్సారెడ్డికి సమాచారం అందింది. ఈ మేరకు ఆయన ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రామకృష్ణారెడ్డి సిబ్బందితో కలిసి మంగళవారం వైన్స్‌పై దాడి నిర్వహించారు. ఎంసీ డైట్ నాలుగు ఫుల్ బాటిళ్లు, ఆఫీసర్ ఛాయిస్ 32 ఫుల్ బాటిళ్లు, ఇంపీరియల్ బ్లూ 9 ఫుల్ బాటిళ్లు, ఎంసీ డైట్ 23 హాఫ్ బాటిళ్లు, ఓసీ 18 హాఫ్ బాటిళ్లు, ఐబీ 88 క్వాటర్ బాటిళ్లు కలిపి మొత్తం 174 ఫుల్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా నిర్వాహకుడు సాంకేటి కొమురయ్యపై కేసు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను ములుగు ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. కఠిన చర్యలు తీసుకుంటాం.. నవ తెలంగాణ వైన్స్‌లో తనిఖీల అనంతరం టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి తన కార్యాలయం లో విలేకరులతో మాట్లాడారు. కల్తీ మద్యం ఎవరు అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా బాధ్యుల షాప్‌లను సీజ్ చేస్తామని, ఆయూ షాపులకు వచ్చే ఏడాది టెండర్లు పిలిచే అవకాశం కూడా ఉందని స్పష్టం చేశారు. కాగా, ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న మద్యం విలువ రూ.లక్ష ఉంటుందని, శాంపిళ్లను ప్రయోగశాలకు పంపిస్తామని తెలిపారు. నివేదిక అందిన తర్వాత చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఆయన వెంట ములుగు ఎస్సై సరిత కూడా ఉన్నారు. అందిన కాడికి దండుకోవాలని.. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో టెండర్లు దక్కించుకున్న షాపు గడువు జూన్ 30తేదీతో ముగియనుంది. ఆ తేదీలోగా పెద్ద మొత్తంలో సంపాదించాలన్న ఉద్దేశంతో వ్యాపారులు కల్తీ మద్యం తెప్పించినట్లు సమాచారం. అరుుతే, షాపుల్లో కల్తీ దందా కొంతకాలంగా సాగుతున్నా అధికారులకు తెలిసే పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నారుు. ఇటీవల ములుగు మండలంలోని మరో రెండు షాపుల్లో కూడా కల్తీ మద్యం అమ్ముతుండగా సీజ్ చేసిన విషయం విదితమే. ఇవన్నీ పరిశీలిస్తే వ్యాపారులకు అధికారులకు అండ ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
మందేసి, చిందేస్తా అంటే.. ఇక కుదరదు!
-
ధరలిలా ఉంటే.. మందెలా కొనాలి!!
-
తెలంగాణ ప్రభుత్వ కొత్త మద్యం పాలసీ
-
అటు బడి.. ఇటు గుడి మధ్యలో వైన్ షాప్
-
అంబులెన్స్‌లో ప్రత్యక్షమైన నాటుసారా