గుంతకల్లు (అనంతపురం జిల్లా) : గుంతకల్లు పట్టణంలో గురువారం మధ్యాహ్నం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మద్యం షాపులపై దాడులు నిర్వహించారు. పాత గుంతకల్లు, కొత్త గుంతకల్లులోని పలు దుకాణాలను సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. మద్యం నిల్వలను పరిశీలించారు. పాత గుంతకల్లులోని శ్రీసాయి వైన్స్‌లో చీప్ లిక్కర్‌లో నీళ్లు కలిపి విక్రయిస్తున్నట్లు గమనించారు. దీనిపై దుకాణం యాజమాన్యాన్ని వివరణ కోరారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.