మొదలైన జోష్‌.. కిక్కిరిసిన వైన్ షాపులు! | new year josh kicked off in hyderabad | Sakshi
Sakshi News home page

మొదలైన జోష్‌.. కిక్కిరిసిన వైన్ షాపులు!

Published Thu, Dec 31 2015 6:43 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

మొదలైన జోష్‌.. కిక్కిరిసిన వైన్ షాపులు! - Sakshi

మొదలైన జోష్‌.. కిక్కిరిసిన వైన్ షాపులు!

హైదరాబాద్: భాగ్యనగరంలో నూతన సంవత్సరం జోష్ అప్పుడే ప్రారంభమైంది. హైదరాబాద్ అంతటా సంబరాల  వాతావరణం వెల్లివిరుస్తోంది. ఆనందోత్సాహాలతో కొత్త సంవత్సరాన్ని భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు హైదరాబాద్‌ వాసులు సిద్ధమవుతున్నారు. నగరంలో ఎటుచూసినా రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు, పబ్బులు, రిసార్ట్‌లు సందడిగా కనిపిస్తున్నాయి. డీజేల సంగీతం హోరెత్తుతోంది. మందుబాబులు ముందుజాగ్రత్త ఏర్పాట్లలో నిమగ్నమవ్వడంతో నగరంలోని బార్‌లు, వైన్‌షాపులు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఊహించినవిధంగానే కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం అమ్మకాలు రికార్డుస్థాయిలో కొనసాగే అవకాశం కనిపిస్తున్నది.

యువత సందడిగా గడిపేందుకు డీజేలు, మ్యూజిక్‌ నైట్‌లతో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పలు ఆంక్షలు విధించిన పోలీసులు.. ఎలాంటి అవాంఛీనయ ఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement