భారీగా కల్తీ మద్యం పట్టివేత | Excise officials attacked wines adulterated alcohol | Sakshi
Sakshi News home page

భారీగా కల్తీ మద్యం పట్టివేత

Published Wed, May 20 2015 1:55 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

భారీగా కల్తీ మద్యం పట్టివేత - Sakshi

భారీగా కల్తీ మద్యం పట్టివేత

- జంగాలపల్లిలో ఎక్సైజ్ అధికారుల దాడులు
- పట్టుకున్న మద్యం విలువ రూ.లక్ష
ములుగు :
ములుగు మండలం జంగాలపల్లిలోని ఓ వైన్స్‌లో ఎక్సైజ్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించి రూ.లక్ష విలువైన కల్తీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో అధికారులు నిర్వహించిన దాడుల్లో పెద్దమొత్తంలో కల్తీ మద్యం లభించడం మండలంలో చర్చనీయూంశంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నారుు. జంగాలపల్లిలోని నవ తెలంగాణ వైన్స్‌లో కల్తీ మద్యం అమ్ముతున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నర్సారెడ్డికి సమాచారం అందింది.  ఈ మేరకు ఆయన ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎల్.రామకృష్ణారెడ్డి సిబ్బందితో కలిసి మంగళవారం వైన్స్‌పై దాడి నిర్వహించారు. ఎంసీ డైట్ నాలుగు ఫుల్ బాటిళ్లు, ఆఫీసర్ ఛాయిస్ 32 ఫుల్ బాటిళ్లు, ఇంపీరియల్ బ్లూ 9 ఫుల్ బాటిళ్లు, ఎంసీ డైట్ 23 హాఫ్ బాటిళ్లు, ఓసీ 18 హాఫ్ బాటిళ్లు, ఐబీ 88 క్వాటర్ బాటిళ్లు కలిపి మొత్తం 174 ఫుల్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా నిర్వాహకుడు సాంకేటి కొమురయ్యపై కేసు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను ములుగు ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు.

కఠిన చర్యలు తీసుకుంటాం..
నవ తెలంగాణ వైన్స్‌లో తనిఖీల అనంతరం టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణారెడ్డి తన కార్యాలయం లో విలేకరులతో మాట్లాడారు. కల్తీ మద్యం ఎవరు అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా బాధ్యుల షాప్‌లను సీజ్ చేస్తామని, ఆయూ షాపులకు వచ్చే ఏడాది టెండర్లు పిలిచే అవకాశం కూడా ఉందని స్పష్టం చేశారు. కాగా, ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న మద్యం విలువ రూ.లక్ష ఉంటుందని, శాంపిళ్లను ప్రయోగశాలకు పంపిస్తామని తెలిపారు. నివేదిక అందిన తర్వాత చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఆయన వెంట ములుగు ఎస్సై సరిత కూడా ఉన్నారు.

అందిన కాడికి దండుకోవాలని..
ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో టెండర్లు దక్కించుకున్న షాపు గడువు జూన్ 30తేదీతో ముగియనుంది. ఆ తేదీలోగా పెద్ద మొత్తంలో సంపాదించాలన్న ఉద్దేశంతో వ్యాపారులు కల్తీ మద్యం తెప్పించినట్లు సమాచారం. అరుుతే, షాపుల్లో కల్తీ దందా కొంతకాలంగా సాగుతున్నా అధికారులకు తెలిసే పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నారుు. ఇటీవల ములుగు మండలంలోని మరో రెండు షాపుల్లో కూడా కల్తీ మద్యం అమ్ముతుండగా సీజ్ చేసిన విషయం విదితమే. ఇవన్నీ పరిశీలిస్తే వ్యాపారులకు అధికారులకు అండ ఉన్నట్లు స్పష్టమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement