శివాజీనగర్‌లో అర్ధరాత్రి తెరిచి ఉన్న బార్(ఫైల్)
నిజామాబాద్: జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి వరకు బార్‌లు తెరిచి ఉంచి జోరుగా మద్యం అమ్ముతున్నప్పటికీ ఎకై ్సజ్, పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలో 13 బార్‌లు ఉండగా అందులో 12 బార్‌లు నడుస్తున్నాయి. ఎకై ్సజ్ నిబంధనల మేరకు బార్‌లలో మద్యాన్ని బార్‌లోపలే అమ్మాలి. కాని నగరంలో గత కొన్నేళ్లుగా లిక్కర్ దందాలో ఆరితేరిన వ్యాపారి ఒకరు తన బార్‌లో దర్జాగా రాత్రి 10 గంటల తర్వాత షట్టర్ తెరిచి బయటకు అమ్మకాలు సాగిస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ తతంగం జరుగుతున్నా ఎకై ్స జ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నగరం నడిబొడ్డున..
నగరంలోని శివాజీనగర్ చౌరస్తా, గుర్బాబాది రోడ్డు, అర్సపల్లి రోడ్డులో ఉన్న బార్‌లు రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు బాహాటంగానే బయటకు మద్యాన్ని అమ్ముతున్నారు. ఎకై ్సజ్ నిబంధనల ప్రకారం వైన్స్‌లు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మాలి. బార్‌లు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11:30 వరకు తెరిచి ఉంచాలి. కాని నగరంలోని ఈ మూడు ప్రాంతాల్లో ఉన్న బార్‌లు రాత్రి 10 గంటల తర్వాత వైన్స్‌లు మూసిన అనంతరం 10 గంటల నుంచి రాత్రి 11:30 వరకు బయటి వ్యక్తులకు మద్యాన్ని అమ్ముతున్నారు. అధికారికంగా బార్ తలుపులు మూసి ఉంచినప్పటికీ అనధికారికంగా రాత్రి ఒంటి గంట వరకు కూడా దర్జాగా మద్యం అమ్ముతున్నారు. ఎకై ్‌స్‌జ్ అధికారులకు నెలవారీగా మామూళ్లు అందుతుండడం వల్లే వాటి జోలికి వెళ్లట్లేదనే ఆరోపణలున్నాయి.
అధికారుల నిర్లక్ష్యమే..
నగరంలోని బార్‌లకు వైన్స్ మద్యం తరులుతున్నా ఎకై ్సజ్ అధికారులు తనిఖీలు చేయడం లేదు. గతంలో ఓ బార్‌లో వైన్స్ మద్యం దొరకడంతో అప్పుడు ఉన్న ఓ ఎకై ్సజ్ అధికారితో బేరసారాలు కుదుర్చుకున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై డిప్యూటీ కమిష నర్ ఆదేశాల మేరకు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి విచారణ చేపట్టారు. ఈ విచారణ కూడా నామమాత్రంగానే జరిగినట్లు సమాచారం. అలాగే అర్ధరాత్రి తర్వాత బార్‌లో మద్యం బయటకు అమ్మడంపై తనిఖీలు చేయాలని ఎకై ్సజ్ ఎస్సైకి ఆదేశాలు అందినప్పటికీ తనిఖీలు చేపట్టకపోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వైన్స్‌ల ఆదాయానికి గండి..
నిజామాబాద్ ఎకై ్సజ్ ఎస్‌హెచ్‌వో పరిధిలో 19 వైన్స్‌లు ఉన్నాయి. ఈ వైన్స్‌లో రాత్రి 10 గంటలకు మూసివేస్తున్నారు. కాని బార్లు అర్ధరాత్రి వరకు మద్యం అమ్ముతుండడంతో తమ ఆదాయానికి గండి పడుతోందని వైన్స్ యజమానులు ఎకై ్సజ్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ బార్‌లు కూడా బీర్‌కు రూ. 20, విస్కీకి రూ. 50 చొప్పున అధిక ధరలకు మద్యం అమ్ముతున్నట్లు తెలిసింది.
తనిఖీలు చేస్తాం..
రాత్రివేళ్లలో తనిఖీలు చేపట్టాలని ఎస్‌హెచ్‌వో దిలీప్‌కు ఆదేశాలిచ్చాను. ఎకై ్సజ్ ఎస్సై మల్లేశ్‌కు తనిఖీలు చేపట్టాలని సూచించాం. బార్‌లకు వచ్చిన మద్యంను బయటకు అమ్మడానికి లేదు. ఇలా చేస్తే నోటీసులు అందిస్తాం. బార్‌లు అ ర్ధరాత్రికి అమ్మకాలు చేస్తున్నారని వైన్స్ యాజ మాన్యాల నుంచి ఫిర్యాదు వచ్చింది. దీనిపై చర్యలు తీసుకుంటాం. – మల్లారెడ్డి,
Comments
Please login to add a commentAdd a comment