నిజామాబాద్: వైన్ దుకాణాలకు టెండర్లు నవంబర్‌లో జరగాల్సి ఉండగా ముందస్తుగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న వైన్స్‌లకు మరో రెండునెలల పాటు లైసెన్స్‌లు ఉండగానే ముందుస్తుగా టెండర్లు వేసేందుకు ప్రణాళికలు వేస్తోంది.
అక్టోబర్‌లో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశాలుండడంతో ఆ సమయంలో లాటరీల నిర్వహణకు ఇబ్బందులు ఏర్పడుతాయని ఎక్సైజ్ శాఖ ఉన్నతస్థాయి అధికారులు జిల్లాలోని డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో ముందుగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు. 2021–2023 పిరియడ్ ముగియకముందే 20 23–2025 సంబంధించి వైన్స్ దుకాణాలకు లైసెన్స్ లు ఇచ్చేందుకు జీవో నం. 86ను ఎక్సైజ్ శాఖ జారీ చేసింది. దీంతో ఈనెల 4వ తేదీ నుంచి ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులు అందించనున్నారు.
టెండర్లు ఇలా..
ఎక్సైజ్ శాఖ కొత్త ఎకై ్సజ్ పాలసీ ప్రకారం దరఖాస్తులు స్వీకరిస్తుందని డిప్యూటీ ఎకై ్సజ్ కమిషనర్ ద శరథం పేర్కొన్నారు. ఈనెల 3న జిల్లా కలెక్టర్ సమక్షంలో ఎస్సీ, ఎస్టీ, గౌడ, ఓపెన్ అభ్యర్థులకు వైన్ షాప్‌లు కేటాయిస్తారు. ఈనెల 3న వైన్ దుకాణాల కు నోటి ఫికేషన్ విడుదల చేస్తారని, 4న జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఈ దరఖాస్తులు నింపి రూ. 2 లక్షలు డీడీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈనెల 18న సాయంత్రం 6 గంటలకు దరఖాస్తులను తీసుకుంటామని, 21న వైన్స్ లైసెన్స్‌లకు సంబంధించిన డ్రా తీస్తామన్నారు. వైన్స్ లైసెన్స్‌లు లాటరీలో వచ్చిన వారు అదే రోజు గాని మరుసటి రోజు (21, 22 తేదీల్లో) మొదటి ఇన్‌స్టాల్ మెంట్ చెల్లించాలని, వైన్స్‌లకు మద్యంను ఈనెల 30న అందిస్తామని, డిసెంబర్ 1 నుంచి షాపులను లైసెన్స్ పొందినవారు నడిపించుకోవాలన్నారు.
దరఖాస్తుల ద్వారా రూ. 35.24 కోట్ల ఆదాయం
జిల్లాలో 102 వైన్స్‌షాపులు ఉండగా వీటిని దక్కించుకోవడానికి 2021 నవంబర్‌లో 1,762 మంది దరఖాస్తులు చేసుకున్నారు. 1,762 దరఖాస్తుదారులకు సంబంధించి రూ. 35.24 కోట్లు ఆదాయం చేకూరింది. ఒక్కో దరఖాస్తుదారుడు ప్రస్తుతం లాటరీలో పాల్గొనేందుకు రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ డబ్బులు తిరిగి ఇవ్వరు. ఈ ఏడాది ఎన్నికల సీజన్ కావడంతో జిల్లాలో వైన్స్‌లకు టెండర్లు సంఖ్య పెరిగి, రూ. 42 కోట్ల నుంచి 45 కోట్ల ఆదాయం వస్తుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.
నవంబర్‌లో పాత లైసెన్స్‌లు క్లోజ్..
2021–2023కు గాను వైన్ దుకాణాల లైసెన్స్‌లు నవంబర్‌లో పూర్తవుతాయి. అసలైతే నవంబర్‌లోనే వైన్స్‌లకు దరఖాస్తులు ఆహ్వానించి మూడో వారంలో లాటరీ తీసేవారు. ఈ లాటరీలో వచ్చిన వారికి ఎక్కడ వచ్చిందో అక్కడ డిసెంబర్ 1 నుంచి వైన్స్‌లలో మద్యం అమ్మకాలు సాగించాల్సి ఉండేది. కాని ఈసారి ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకునేందుకు ముందుగానే టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment