నిజామాబాద్: ఆర్మూర్ బల్దియాలో గురువారం అవిశ్వాస తీర్మాన సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో అవిశ్వాసం నెగ్గుతుందా.. వీగిపోతుందా.. లేదంటే వాయిదా పడుతుందా అనే సందిగ్ధత నెలకొంది. అయితే ఆర్మూర్‌లో బీఆర్‌ఎస్‌ను దెబ్బతీసే క్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ పండిత్ వినీతకు బీజేపీ, కాంగ్రెస్‌లకు చెందిన ముఖ్య నేతలు అండగా నిలుస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోయినా రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకొనే క్ర మంలో చైర్‌పర్సన్‌కు అండగా నిలుస్తున్నట్లు ప్రచా రం జరుగుతోంది. మరోవైపు చైర్‌పర్సన్ కుటుంబానికి చెందిన బీజేపీ ముఖ్యనేత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ద్వారా బీజేపీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్ల మద్దతు కూడగట్టుకొనే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మూడేళ్లపాటు అదే బీఆర్‌ఎస్ పాలకవర్గం అవినీతి అక్రమాలపై బీజేపీ పోరాటం చేయడం గమనార్హం.
సమావేశానికి ఏర్పాట్లు..
చైర్ పర్సన్ పండిత్ వినీతపై అవిశ్వాస తీర్మానం సమావేశాన్ని గురువారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ తెలిపారు. మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్, ఆర్డీవో వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడానికి మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మున్సిపల్ పరిధిలోని 36 మంది కౌన్సిలర్లతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి సైతం తన ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం ఉండడంతో ఎమ్మెల్యేతో కలిపి కోరం సభ్యులైన 25 మంది కౌన్సిలర్లు హాజరైన పక్షంలోనే అవిశ్వాస తీర్మానంలో ఓటింగ్ నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు చెందిన కౌన్సిలర్లు, చైర్ పర్సన్ పండిత్ వినీత వర్గానికి చెందిన కౌన్సిలర్లు వేర్వేరుగా క్యాంపులకు వెళ్లారు. దీంతో బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, స్వతంత్ర కౌన్సిలర్లలో ఎంతమంది సమావేశానికి హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తారో వేచిచూడాల్సిందే.
ఇవి చదవండి: ‘గృహలక్ష్మి’కి గుడ్‌బై.. చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం! వాటి స్థానంలో..
Comments
Please login to add a commentAdd a comment