chair person
-
మార్కులు కొట్టి... ‘మార్కెట్’ పట్టి...
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: అనుకోకుండా లభించిన అవకాశాన్ని ఓ మహిళ సద్వినియోగం చేసుకున్నారు. అడిగిన ప్రశ్నలకు మెప్పించేలా సమాధానం ఇచ్చారు. ఏకంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవిని చేజిక్కించుకున్నారు. మార్కెట్ కమిటీ పదవికి ప్రశ్నలేంటి? జవాబులేంటి? చైర్ పర్సన్‌ను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది కదా.. అనే సందేహాలు తలెత్తుతున్నాయా? అలాంటి సందేహాలు నిజమే..అలాగే ప్రశ్నలకు సరైన జవాబులివ్వడం ద్వారా చైర్ పర్సన్ పదవికి ఎంపికైంది కూడా వాస్తవమే. కామారెడ్డి జిల్లాలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఈ వినూత్న ప్రయోగం చేశారు. మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎంపికకు మౌఖిక పరీక్ష నిర్వహించారు. పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన యువతిని పదవికి ఎంపిక చేశారు. ప్రశ్నపత్రం రూపొందించి.. పరీక్ష నిర్వహించి.. సాధారణంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పేరు ను అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యేనో లేదా ఆ పార్టీ ముఖ్య నాయకులో ప్రభుత్వానికి ప్రతిపాదించి నామినేట్ చేయిస్తారు. కానీ లక్ష్మీకాంతారావు ఇందుకు భిన్నంగా ఈ పదవికి మౌఖిక పరీక్ష నిర్వహిస్తామని, అందులో ఎక్కువ మార్కులు సాధించిన వారినే చైర్మన్‌గా నియమిస్తామని ప్రకటించారు. దీనికి మార్కెట్ కమిటీ పరిధిలోని మద్నూర్, జుక్కల్, డోంగ్లీ మండలాల నాయకులు కూడా సరే అన్నారు. ఎస్సీ మహిళకు కేటాయించిన ఈ పదవికి నిర్వహించిన మౌఖిక పరీక్షకు స్థానిక నేతల కుటుంబాలకు చెందిన 15 మంది మహిళలు సిద్ధమయ్యారు. దీంతో ఎమ్మెల్యే స్థానిక పార్టీ నేతలతో కలిసి ఓ ప్రశ్నపత్రం రూపొందించారు. మార్కెట్ కమిటీల విధులు, బాధ్యతలు, అభివృద్ధికి సంబంధించిన 15 ప్రశ్నలను పొందుపరిచారు. సెప్టెంబర్ 29న నిర్వహించిన ఈ పరీక్షకు ఆ 15 మందీ హాజరయ్యారు. వీరిలో జుక్కల్ మండలం పెద్ద ఎడ్గి గ్రామానికి చెందిన అయిల్వార్ సౌజన్య అత్యధిక మార్కులు సాధించారు. దీంతో ఆమె పేరును ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ప్రభుత్వానికి పంపించారు. ఆ మేరకు ప్రభుత్వం తాజాగా సౌజన్యను చైర్ పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 15 ప్రశ్నలకు 12 సరైన జవాబులిచ్చిన సౌజన్య సౌజన్య ఎంఎస్సీ బీఈడీ చదివారు. పరీక్షలో 15 ప్రశ్నలకు గాను 12 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చారు. ఈ పరీక్షకు ఆయా మండలాలకు చెందిన పూజా సందే, నమేవార్ పద్మ, జి.పార్వతి, వాగ్మారే ప్రియాంక, నమేవార్ అనిత, వాగ్మారే సోని, సంగీత తుకారాం, గైక్వాడ్ రాజాబాయి, కర్మల్కార్ సంగీత, అర్పిత అంజనీకర్, ఎడికే రాంబాయితో పాటు మరో ముగ్గురు హాజరయ్యారని సమాచారం. కాగా రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావును, చైర్ పర్సన్‌గా నియమితులైన అయిల్వార్ సౌజన్యను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభినందించారు. బుధవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, నాయకులు మంత్రిని కలిశారు. ప్రతి ఎమ్మెల్యే ఇదే విధంగా ప్రయతి్నస్తే రైతులకు మరింత మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా కోమటిరెడ్డి చెప్పారు. ప్రజాస్వామ్యంలో సరికొత్త అధ్యాయం: సీఎం మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్‌గా సౌజన్య ఎంపిక కావడంపై సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్’వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రజాస్వామ్యంలో సరికొత్త అధ్యాయం.. పదవుల ఎంపికలో నయా దృక్పథం..ప్రజా పాలనకు తిరుగులేని సాక్ష్యం..ఈరోజు నిరుపేద కుటుంబానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, మన ఆడబిడ్డ సౌజన్య మద్నూర్ మార్కె ట్ కమిటీ చైర్ పర్సన్‌గా ఎంపిక కావడం చాలా సంతోషకరమైన విషయం. తొలిసారిగా ఇంటర్వ్యూ పద్ధతిలో, ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తూ, మహిళల చదువుకు.. ఆత్మస్థైర్యానికి ప్రోత్సాహమిచ్చేలా జరిగిన ఈ ఎంపిక రాష్ట్రంలో కొత్త ఒరవడిని సృష్టించింది..’అని సీఎం పేర్కొన్నారు. పారదర్శక విధానంలో ఈ పదవికి సౌజన్యను ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, సహచర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు అభినందనలు తెలిపారు. -
UPSC: యూపీఎస్సీ కొత్త చైర్‌పర్సన్‌గా ప్రీతిసుదాన్
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతి సుదన్.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా, ప్రస్తుతం ఆమె యూపీఎస్సీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రీతిసుదాన్.. 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి.కాగా, ఆగస్టు ఒకటో తేదీన, రాజ్యాంగంలోని ఆర్టికల్ 316ఏ ప్రకారం ఆమె బాధ్యతలు స్వీకరిస్తారని ఓ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం యూపీఎస్సీ కమిషన్‌లో సభ్యురాలిగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం వ్యక్తిగత కారణాల వల్ల మనోజ్ సోని రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 2029 మే 15 వరకూ పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన ఐదేళ్ల ముందుగానే వ్యక్తిగత కారణాలతో వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ప్రీతి సుదన్ ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు.ఇక, ప్రీతిసుదాన్.. 29 ఏప్రిల్ 2025 వరకు సేవలందిస్తారు. కాగా, సుడాన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఎకనామిక్స్ అండ్ సోషల్ పాలసీ అండ్ ప్లానింగ్‌లో ఆమె డిగ్రీలు పొందారు. వాషింగ్టన్లో పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్లో శిక్షణ తీసుకున్నారు. మరోవైపు.. ఆంధ్రా కేడర్‌కు చెందిన 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రీతిసుదాన్. సుడాన్ గతంలో ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. రక్షణ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ వంటి వివిధ కేంద్ర, రాష్ట్ర స్థాయి స్థానాల్లో పనిచేశారు. అలాగే విపత్తు నిర్వహణ, పర్యాటక రంగానికి సంబంధించిన హోదాలో పనిచేశారు. ఆమె ప్రపంచ బ్యాంకులో సలహాదారుగా కూడా పనిచేశారు. అలాగే కరోనా సమయంలో ఆమె క్రియాశీలకంగా విధులు నిర్వహించారు. ~ 1983 batch IAS officer Preeti Sudan will be the new UPSC Chairperson, with effect from 1st August 2024. ~ President Droupadi Murmu approves the appointment@rashtrapatibhvn #UPSC pic.twitter.com/parkcQUv9f— DD News Odia (@DDNewsOdia) July 31, 2024 -
చైర్‌పర్సన్‌కు అండగా బీజేపీ, కాంగ్రెస్!
నిజామాబాద్: ఆర్మూర్ బల్దియాలో గురువారం అవిశ్వాస తీర్మాన సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో అవిశ్వాసం నెగ్గుతుందా.. వీగిపోతుందా.. లేదంటే వాయిదా పడుతుందా అనే సందిగ్ధత నెలకొంది. అయితే ఆర్మూర్‌లో బీఆర్ఎస్ను దెబ్బతీసే క్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతకు బీజేపీ, కాంగ్రెస్‌లకు చెందిన ముఖ్య నేతలు అండగా నిలుస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోయినా రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకొనే క్ర మంలో చైర్‌పర్సన్‌కు అండగా నిలుస్తున్నట్లు ప్రచా రం జరుగుతోంది. మరోవైపు చైర్పర్సన్ కుటుంబానికి చెందిన బీజేపీ ముఖ్యనేత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ద్వారా బీజేపీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్ల మద్దతు కూడగట్టుకొనే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మూడేళ్లపాటు అదే బీఆర్ఎస్ పాలకవర్గం అవినీతి అక్రమాలపై బీజేపీ పోరాటం చేయడం గమనార్హం. సమావేశానికి ఏర్పాట్లు.. చైర్ పర్సన్ పండిత్ వినీతపై అవిశ్వాస తీర్మానం సమావేశాన్ని గురువారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ తెలిపారు. మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్, ఆర్డీవో వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడానికి మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలోని 36 మంది కౌన్సిలర్లతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి సైతం తన ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం ఉండడంతో ఎమ్మెల్యేతో కలిపి కోరం సభ్యులైన 25 మంది కౌన్సిలర్లు హాజరైన పక్షంలోనే అవిశ్వాస తీర్మానంలో ఓటింగ్ నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్లు, చైర్ పర్సన్ పండిత్ వినీత వర్గానికి చెందిన కౌన్సిలర్లు వేర్వేరుగా క్యాంపులకు వెళ్లారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, స్వతంత్ర కౌన్సిలర్లలో ఎంతమంది సమావేశానికి హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తారో వేచిచూడాల్సిందే. ఇవి చదవండి: ‘గృహలక్ష్మి’కి గుడ్‌బై.. చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం! వాటి స్థానంలో.. -
ఏపీ గిరిజన కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా శోభ స్వాతి ప్రమాణం
-
ప్రియాంక చోప్రాకు భలేఛాన్స్.. ‘మామి’ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవం
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన సహచర నటి దీపిక పదుకుణే స్థానాన్ని దక్కించుకుంది. జియో ‘ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్’ (ఎమ్‌ఏఎమ్‌ఐ-మామి) ఫిల్మ్ ఫెస్టివల్ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్న దీపికా స్థానాన్ని ప్రియాంక చోప్రా భర్తీ చేయనుంది. నాలుగు నెలల క్రితమే ఈ పదవి నుంచి దీపికా వైదొలిగింది. ఈ సందర్భంగా ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ సంస్ధ వచ్చే సంవత్సరానికి పలు ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ‘మామి’ బోర్డు సభ్యులు కో చైర్ పర్సన్ నీతా ముఖేశ్ అంబానీ, ఫిల్మ్ డైరక్టర్ అనుపమ చోప్రా, అజయ్ బిజ్లీ, ఆనంద్ జీ మహీంద్రా, ఫర్హన్ అక్తర్, ఇషా అంబానీ, కబీర్ ఖాన్, కౌస్తుభ్ ధావ్సే, కిరణ్ రావు, రానా దగ్గుబాటి, రితేశ్ దేశ్‌ముఖ్, రోహన్ సిప్పీ, సిద్ధార్థ్ రాయ్ కపూర్, విక్రమాదిత్య మోత్వానే, విశాల్ భరద్వాజ్, జోయా అక్తర్ ఏకగ్రీవంగా ప్రియంకా చోప్రాను ‘మామి’ చైర్ పర్సన్‌గా ఎన్నుకున్నారు. మామి చైర్‌పర్సన్‌గా ఎన్నికైన అనంతరం ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. మామి చైర్‌పర్సన్‌గా ఎన్నికవడం సంతోషంగా ఉందని తెలిపింది. మామిలోని సభ్యులతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొంది. ఫిల్మ్‌ఫెస్టివల్‌ను మరోస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తన అధికారిక సోషల్‌మీడియా ఖాతాలో వెల్లడించింది. చైర్ పర్సన్‌గా ఎన్నికైన ప్రియంకా చోప్రాను మామి బోర్డ్ ట్రస్టీ ఇషా అంబానీ స్వాగతించింది. ప్రియాంక తన సారథ్యంలో మామి ఫిల్మ్ ఫెస్టివల్‌ను నూతన శిఖరాలకు తీసుకువెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. 22వ ‘మామి’ ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ ఎడిషన్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్ 2021 అక్టోబర్ నుంచి 2022 మార్చి వరకు జరగనుంది. -
వాలంటీర్ టూ చైర్ పర్సన్
-
నామినేటెడ్ పదవుల్లో సగం మహిళలకే కట్టబెట్టారు : విజయనిర్మల
-
మనసున్న బాస్
దేశంలోని చాలా కంపెనీలు ఇప్పుడు ఒడిదుడుకుల్లో ఉన్నాయి. వాటిల్లో చాలా కంపెనీలకు మహిళలే కొత్త బాస్‌గా వస్తున్నారు. సోమా మండల్నే చూడండి. జనవరి 1 ఆమె భారత ప్రభుత్వసంస్థ సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా) చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 19కి 67 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సెయిల్ చరిత్రలోనే తొలి మహిళా చైర్మన్ సోమ. మొన్నటి వరకు సెయిల్‌కు డైరెక్టర్–కమర్షియల్‌గా ఉన్న సోమ.. చైర్పర్సన్ కాగానే భారత పారిశ్రామిక రంగంలోని దిగ్గజాల కళ్లన్నీ ఆమె ముళ్ల కీరీటం వైపు మళ్లాయి తప్ప, ‘ఐ కెన్’ అని ధీమాగా చెబుతున్నట్లున్న ఆమె చిరునవ్వుకు ఎవ్వరూ పెద్దగా గుర్తింపునివ్వడం లేదు! చైర్‌పర్సన్‌గా ఇప్పుడిక ఆమె చాలా చెయ్యాలి. యాభై వేల కోట్ల రూపాయలకు పైగా ఉన్న సెయిల్ అప్పుల్ని తగ్గించాలి. వచ్చే పదేళ్లలోపు ఏడాదికి కనీసం ఐదు కోట్ల టన్నుల ఉక్కు ఉత్పతిస్థాయికి సంస్థ సామర్థ్యాన్ని పెంచాలి. స్టాక్ మార్కెట్లో సెయిల్ సూచీని శిఖరం వైపు మళ్లించాలి. తక్షణం అయితే ఒకటి చేయాలి. ఏళ్లుగా కదలిక లేకుండా ఉన్న వేతనాలను సవరించి, స్థిరీకరించి సిబ్బందిలోని అసంతృప్తిని పోగొట్టాలి. ఇవన్నీ చేయగలరా? ‘చెయ్యగలను’ అని ఆమె అంటున్నారు. ‘ఆమె చెయ్యగలరు’ అని ప్రభుత్వం నమ్ముతోంది. స్టీల్ ధరలు పెరుగుతున్న ప్రస్తుత దశలో చైర్‌పర్సన్‌గా వచ్చిన సోమా మండల్ సెయిల్‌ను లాభాల్లో నడిపిస్తారనే సెయిల్ ఉద్యోగులు, స్టాక్ హోల్డర్లు ఆశిస్తున్నారు. అందుకు కారణం ఉంది. ∙∙ యాభై ఏడేళ్ల సోమ వ్యాపార వ్యూహాల నిపుణురాలు మాత్రమే కాదు. సోషల్ వర్కర్ కూడా కనుక సెయిల్ కింది స్థాయి సిబ్బందికి అన్నివిధాలా భరోసా లభించినట్లే. పైన మన కష్టం గుర్తెరిగే వారున్నారనే భావన కింది స్థాయి ఉద్యోగులు సంస్థ కోసం పాటు పడేలా చేస్తుంది. కంపెనీకి అది వెలకట్టలేని ఆస్తి. 2017 నుంచి సెయిల్‌లో ఉన్నారు సోమా. ఆ క్రితం వరకు ‘నాల్కో’లో (నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్) చేశారు. రూర్కెలా నిట్‌లో బీటెక్ చేశాక 1984లో నాల్కోలోనే మేనేజ్మెంట్ ట్రైనీగా చేరారు. సోమా భువనేశ్వర్‌లో జన్మించారు. ఆమె తండ్రి వ్యవసాయ ఆర్థికవేత్త. తన ముగ్గురు సంతానాన్ని డాక్టర్లను చేయాలని ఆశ. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. కొడుకు, ఒక కూతురు డాక్టర్లు అయ్యారు కానీ, సోమ ఇంజినీరింగ్‌ను ఎంచుకున్నారు. సోమకు ముగ్గురు పిల్లలు. భర్త కూడా ఇంజినీరే. యు.టి.ఐ.లో పని చేసేవారు. 2005లో చనిపోయారు. ‘‘నా ప్లస్ పాయింట్ ఏమిటంటే.. నేను చేసే ప్రతి పనిలోనూ హ్యూమన్ టచ్ ఉంటుంది’’ అన్నారు సోమ.. సెయిల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు తీసుకోగానే. ‘‘నా ప్లస్ పాయింట్ ఏమిటంటే.. నేను చేసే ప్రతి పనిలోనూ హ్యూమన్ టచ్ ఉంటుంది’’ అన్నారు సోమ.. సెయిల్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు తీసుకోగానే. -
లక్ష్మీపార్వతికి కీలక పదవి
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతికి కీలక పదవి దక్కింది. ఆమెను తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష్మీ పార్వతి తెలుగు విశ్వవిద్యాలయంలో పీజీ చేశారు. 2000 సంవత్సరంలో ఆమె తెలుగు సాహిత్యంలో ఎమ్. ఎ పూర్తి చేశారు. -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన వాసిరెడ్డి పద్మ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మంగళవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమితులైన అనంతరం వాసిరెడ్డి పద్మ తొలిసారి సీఎంను కలిశారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం వైఎస్ జగన్‌కు వాసిరెడ్డి పద్మ ప్రత్యేక కృతజ్క్షతలు తెలిపారు. రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగిన కృషి చేయాలని సీఎం చెప్పారని వాసిరెడ్డి పద్మ తెలిపారు. -
అవినీతిని ఒప్పుకున్న టీడీపీ చైర్పర్సన్
చిలకలూరిపేట: ఒక్కొక్కటి లక్ష రూపాయల చొప్పున విభజించి నామినేషన్ ప్రాతిపదికన గత ఐదేళ్లలో నిర్వహించిన పనుల్లో రూ.10కోట్ల అవినీతి జరిగిందని మున్సిపల్ చైర్పర్సన్ గంజి చెంచుకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రస్తుత అధికారులు విచారణ నిర్వహించాలని కోరారు. పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం మైలవరపు గుండయ్య కౌన్సిల్ హాలులో శనివారం చైర్పర్సన్ గంజి చెంచుకుమారి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో ఆమె జరిగిన అవినీతి గురించి మాట్లాడటంతో పాలక పక్షమైన టీడీపీ కౌన్సిలర్లు ఖంగుతిన్నారు. ఈ విషయమై మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ నాయుడు వాసు, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు షేక్ నాగుల్‌మీరా, సాపా సైదావలి తదితరులు మాట్లాడుతూ గత ఐదేళ్లుగా జరుగుతున్న అవినీతిపై తాము ఎంత మొత్తుకున్నా పట్టించుకోలేదని, అభ్యంతరాలు చెప్పినా ఎజెండాలు ఆమోదించుకొని వెళ్లి పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని కారణంగా కోట్లాది రూపాయాల ప్రజాధనం దోపిడీకి గురైందని మండిపడ్డారు. ఈ తరుణంలో టీడీపీ సభ్యులు వాదనకు దిగటంతో కొద్ది సేపు సమావేశంలో వాదోపవాదాలు జరిగాయి. మీ చైర్‌పర్సన్‌నే అవినీతి జరిగిందని ఒప్పుకున్నప్పుడు మీరెందుకు మాట్లాడుతున్నారంటూ వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు నిలదీశారు. రశీదులు ఇవ్వండి... పట్టణ ప్రజలు తమ సమస్యలపై అర్జీలు ఇస్తే అవి తీసుకొని మున్సిపల్ అధికారులు వాటికి రశీదులు ఇచ్చే విధానాన్ని అమలు పరచాలని సూచించారు. ఏ పని ఎన్ని రోజుల్లో చేస్తారో చిన్న చీటీపై రాసి ప్రజలకు అందించాలన్నారు. లంచాల కోసం ప్రజ లను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటే తగు చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించారు. పలు సమస్యలపై డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ షేక్ అబ్దుల్ రౌఫ్, ఏడో వార్డు కౌన్సిలర్ సాతులూరి దేవికుమారి, రెండో వార్డు కౌన్సిలర్ దారా అరుణకుమారి, కౌన్సిలర్లు నాంపల్లి పూర్ణిమ, బొల్లెద్దు కృపమ్మ, షేక్ బాజీబేగం, షేక్ కాలేషావలి, షేక్ పాచ్చాబుడే, చెమిటిగంటి పార్వతిదేవి, పుల్లగూర కల్పన, కుప్పాల ప్రశాంతి మాట్లాడారు. నిజాయితీతో కూడిన పాలన ప్రజలకు అందించాలి పురపాలక సంఘం గత ఐదేళ్లు దోపిడీకి గురైందని, ఇక ఆ విధానాలు విడనాడి నిజాయితీతో కూడిన పాలన ప్రజలకు అందించాలని ఎమ్మెల్యే విడదల రజని చెప్పారు. పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశంలో ఎక్స్అఫీషియో సభ్యురాలిగా తొలిసారి ఎమ్మెల్యే రజని కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగేతర శక్తిగా, అనధికార మంత్రిగా మాజీ మంత్రివర్యుడి సతీమణి పురపాలక సంఘాన్ని దోచుకుతిన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు పురపాలక సంఘ అధికారులు సైతం వత్తాసు పలికి ప్రజాధనాన్ని దోచిపెట్టారని ఆరోపించారు. అందుకే ప్రజలు ఓటు అనే ఆయుధంతో అడ్రస్‌లేకుండా చేశారని పేర్కొన్నారు. ర్యాటిఫికేషన్ ద్వారా నామినేషన్ పనుల రూపంలో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. టీడీపీకే చెందిన మున్సిపల్ చైర్పర్సన్ సైతం దారుణమైన అవినీతి జరిగిందని ఆవేదన వ్యక్తం చేయటం ఇక్కడి అవినీతికి అద్దం పట్టిందని పేర్కొన్నారు. -
మాచర్ల టీడీపీలో వర్గ విభేదాలు.. అజ్ఞాతంలో మంగమ్మ
సాక్షి, గుంటూరు : మాచర్ల టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ ఛైర్ పర్సన్ మంగమ్మ అజ్ఞాతంలోకి వెళ్లటంతో.. నూతన మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నికపై ఉత్కంఠ మొదలైంది. గతంలో అధిష్టానం ముగ్గురు ఛైర్ పర్సన్ల పదవీ కాలాన్ని పంచింది. అప్పట్లో శ్రీదేవి అనే ఛైర్ పర్సన్‌ను బలవంతంగా పదవీనుంచి తొలగించటంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తర్వాత వచ్చిన మంగమ్మను సైతం బలవంతంగా పదవీనుంచి రాజీనామా చేయించారు. మంగమ్మ స్థానంలో షాకీర్ హున్నీసాను ఎన్నుకోవాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 15 మంది కౌన్సిలర్లతో షాకీర్ హున్నిసా బుధవారం సమావేశానికి హాజరయ్యారు. కోరం సరిపోవడంతో ఆమెను మున్నిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి పుల్లయ్య ఉత్తర్వులు జారీ చేశారు.ఇందుకు అంగీకరించని మాజీ ఛైర్ పర్సన్ మంగమ్మ తన వర్గానికి చెందిన పదిమంది కౌన్సిలర్లతో అజ్ఞాతంలోకి వెళ్లింది. ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిన మంగమ్మ కోరం ఉంటుందా? ఎన్నిక జరుగుతుందా? అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
‘మగాళ్లు మారండి’.. కలకలం రేపిన వ్యాఖ్యలు
జైపూర్ : బీజేపీ నేత, రాజస్థాన్ మహిళా కమిషన్ చైర్పర్సన్ సుమన్ శర్మ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మగవాళ్ల వేషాధారణ మారాలంటూ ఉపన్యాసం ఇచ్చిన ఆమె.. ఈ క్రమంలో చేసిన వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కుంటున్నారు. ‘ప్రస్తుతం ట్రెండ్ పేరుతో మగవాళ్ల వేషధారణ మొత్తం మారిపోయింది. లో వెస్ట్ జీన్లు వేసుకునే మగాళ్లకి వాళ్ల బట్టలే వాళ్ల కంట్రోల్లో ఉండవు. అలాంటోళ్లు వాళ్ల ఇళ్లలోని మహిళలను ఎలా రక్షించుకుంటారు?. ఆడాళ్లు ఒకప్పుడు విశాలమైన ఛాతీ.. దాని నిండా జట్టు ఉన్న మగాళ్లను కావాలని కలలు కనేవాళ్లు. కానీ, ఇప్పుడు అలాంటోళ్లు కనిపించట్లేదు’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఆడాళ్లలా చెవి పోగులు ధరిస్తున్న పురుషులు.. మరి జీరో ఫిగర్ ఎందుకు మెయింటెన్ చెయ్యరని ఆమె ప్రశ్నిస్తున్నారు. ‘మగాళ్లు మగాళ్లలా బతకండి. నేనేం వారిని విమర్శించటం లేదు. కానీ, ఈ పద్ధతుల్లో మార్పు రావాల్సి ఉందని మాత్రమే చెబుతున్నా’ అని ఆమె తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుమన్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విమర్శలపై పలువురు మండిపడుతున్నారు. తమ వస్త్ర ధారణ ఎలా ఉంటే మీకేం బాధంటూ యువత ఆమెను సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. వీరికి పలువురు యువతులు కూడా మద్ధతు నిలుస్తుండటం ఇక్కడ విశేషం. ప్రస్తుతం దీనిపై రాజస్థాన్‌లో పెద్ద చర్చే నడుస్తోంది. -
మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ డ్రైవర్ ఆత్మహత్య
గద్వాల క్రైం: పురుగు మందు తాగి ఓ కారు డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం చోటుచేసుకుంది. గద్వాల సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. పెంట్లవెల్లి మండలం కొండూరుకు చెందిన చుక్క రామన్‌గౌడ్ కుమారుడు కుర్మయ్యగౌడ్(26) గత నాలుగేళ్ల నుంచి గద్వాలలోని పత్తి మిల్లు యజమాని చంద్రశేఖర్‌రెడ్డి వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల చంద్రశేఖర్‌రెడ్డి భార్య లక్ష్మీదేవమ్మ గద్వాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కావడంతో ఆమె కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే బుధవారం మధ్యాహ్నం మార్కెట్ కార్యాలయంలోని ఓ గదిలో పురుగు మందు తాగాడు. అనంతరం గదిలో నుంచి బయటికి వస్తున్న క్రమంలో కార్యాలయం ముందు కిందపడ్డాడు. గమనించిన స్థానికులు ఆరా తీయగా పురుగుమందు తాగినట్లు వివరించాడు. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. విషయం తె లుసుకున్న చంద్రశేఖర్‌రెడ్డి, చైర్మన్ లక్ష్మీదేవ మ్మ అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. వారు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. అయితే ఈ యన ఆత్మహత్యకు గల కారణాలు తెలి యాల్సి ఉంది.ఈ ఘటనపై కుర్మయ్యగౌడ్ తండ్రి రామన్‌గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. గద్వాలలో కలకలం.. మార్కెట్ చైర్మన్ డ్రైవర్ కుర్మయ్యగౌడ్ మార్కెట్ కార్యాలయంలో పురుగు మందు తాగి మృతి చెందడంతో గద్వాలలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పలువురు మార్కెట్ కమీషన్‌దారులు, కూలీలు, సిబ్బంది కలత చెందారు. అనంతరం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమోహన్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. -
జెడ్పీలో ముసలం !
జిల్లా పరిషత్‌లో మళ్లీ ముసలం మొదలైందా? చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, సీఈవో నగేష్‌ల మధ్య కోల్డ్ వార్ మరోసారి బయటపడిందా...అంటే నిజమే అంటున్నాయి ఉద్యోగ వర్గాలు! గతేడాది నుంచి చాపకింద నీరులా తీవ్రమవుతున్న ఈ వ్యవహారం తాజాగా కీలక ఉద్యోగుల స్థానచలనం నేపథ్యంలో వివాదాస్పదంగా మారింది. జెడ్పీలో కీలక స్థానాల్లో సూపరింటెండెంట్ల స్థానచలనం ఫైళ్ల విషయంపై ముందస్తుగా సీఈవో నగేష్‌కు సమాచారం లేకపోయినా ఒత్తిళ్ల మ«ధ్య పరిపాలనా సౌలభ్యం కోసం అన్నట్లుగా ఆయన ఆమోద సంతకం చేసి ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిసింది. ఇదే విషయంలో సీఈవో తీవ్ర మనస్తాపానికి గురయ్యారంటూ వార్తలు గుప్పు మంటున్నాయి. విధులు, పరిపాలన విషయంలో తనపై చైర్పర్సన్ పెత్తనాన్ని ఏమాత్రం సహించలేని ఆయన బదిలీ ప్రయత్నాల కోసం అమరావతికి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. అరసవల్లి: అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు చాలాచోట్ల అధికారులపై వేధింపులకు పాల్పడుతుండడం, రాజకీయ కక్షలు తీర్చుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో కూడా జిల్లా పరిషత్ సీఈవో స్థాయిని తగ్గించే యత్నంతో పాటు రబ్బర్ స్టాంప్‌లా ఆయన కుర్చీని మార్చేలా చైర్పర్సన్ ధనలక్ష్మి వ్యవహరిస్తున్న తీరు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. గతంలో జిల్లా పరిషత్‌కు చెందిన పాలనా వ్యవహారాలు, పలు ఆమోదాలకు చెందిన ఫైళ్లను అప్పటి జిల్లా కలెక్టర్‌కు నేరుగా పంపించేలా సీఈవో చర్యలు తీసుకోవడాన్ని తప్పుబట్టిన చైర్పర్సన్, ఇప్పుడు సీఈవో అభిప్రాయం లేకుండానే కీలకమైన సూపరింటెండెంట్ల స్థానచలనాన్ని చేపట్టి మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. అయితే గతేడాది సాధారణ బదిలీల వ్యవహారాల్లో ఈ ఇరువురి వ్యవహారంతోనే రాష్ట్రంలో బదిలీలు రద్దయిన ఏకైక జిల్లా పరిషత్గా రికార్డుల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే.. అలాగే పలు పరిణామాల అనంతరం సీఈవో నగేష్‌ను బదిలీ చేయిస్తున్నట్లు ఏకంగా జెడ్పీ చైర్పర్సన్ ధనలక్ష్మి ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించిన సంగతి విదితమే. అయితే అప్పట్లో సీఈవో నగేష్ ప్రయోగించిన ఎత్తులకు ఆమె ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆ తర్వాత జిల్లాకు చెందిన మంత్రులను సైతం రంగంలోకి దింపి సీఈవోపై ఒత్తిళ్లు తేచ్చే ప్రయత్నం చైర్పర్సన్ చేశారు. దీంతో అప్పటి నుంచి సీఈవో నగేష్ ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకొని..బదిలీ యత్నాల్లోనే ఉన్నారు. తాజాగా సూపరింటెండెంట్ల బదిలీ విషయంలో మరోసారి మనస్తాపానికి గురికావడంతో బదిలీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఇటీవల ఓ డెప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి నిమ్మాడలో మంత్రి అచ్చెన్నాయుడుని కలిసి జెడ్పీ సీఈవోగా అవకాశమివ్వాలంటూ ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితిలో జెడ్పీలో మరికొద్ది రోజుల్లో చాలా తేడాొస్తాయని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. సూపరింటెండెంట్ల స్థానచలనం.. జిల్లా పరిషత్‌లో ఈనెల ఒకటి నుంచి పలువురు సూపరింటెండెంట్ల స్థానాలను అనూహ్యంగా మార్పులు చేస్తూ సీఈవో నగేష్ ఆదేశాలు జారీ చేశారు. అయితే దీని వెనుక పెద్ద కథే నడిచింది. ఈ వ్యవహారంలో అంతా తానై అన్నట్లుగా పరిపాలన వ్యవహారాలపై చైర్పర్సన్ ధనలక్ష్మి హవా చలాయిస్తూ ఈ ఫైళ్లపై సీఈవో ఆమోద సంతకం చేసేలా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈక్రమంలో అమలైన ఉత్తర్వుల మేరకు ఫ్లానింగ్ సెక్షన్‌కు బి.వి.రమణమూర్తి, ఎస్టాబ్లిస్ (సీ) సెక్షన్‌కు కె.రామేశ్వరరావు, డిస్పాచ్ సెక్షన్‌కు ఎస్.వాసుదేవరావును నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు. అలాగే వరŠుక్స (బీ సెక్షన్) ఇన్చార్జిగా కె.రామేశ్వరరావుకు, ఎడ్యుకేషన్ సెక్షన్‌కు ఇన్చార్జిగా ఎస్.వాసుదేవరావుకు అప్పగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈమేరకు కొత్త స్థానాల్లో అధికారులు విధుల్లోకి చేరిపోయారు. ఈ విభాగాల్లో బదిలీలకు పరిపాలనా సౌలభ్యం పేరుతో స్థాన చలనాలకు చర్యలు చేపట్టారు. అయితే అక్కౌంట్స్ విభాగం, పీఎఫ్ సెక్షన్లకు సూపరింటెండెంట్ల స్థానాల్లో మార్పులు మాత్రం చేయకపోవడం గమనార్హం. ఏది ఏమైనా ఈ అధికారుల స్థానచలనం మళ్లీ చైర్‌పర్సన్‌కు, సీఈవోకు మధ్య చిచ్చు పెట్దిందనే చెప్పాలి. ఈ వివాదాల ముసలంతో జెడ్పీలో ఏమార్పులు జరుగుతాయో అని ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
జిల్లా అభివృద్ధికి కృషి
జెడ్పీ ఇన్చార్జ్ చైర్పర్సన్ సుభాషిణమ్మ అనంతపురం సిటీ: జిల్లా అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని జెడ్పీ చైర్‌పర్సన్‌గా తాత్కాలిక బాధ్యతలు స్వీకరించిన సుభాషిణమ్మ తెలిపారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆమె ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ, జెడ్పీ పాలకవర్గం చాలా బాగా పని చేసిందని, భవిష్యత్‌లో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు. జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడాలని కోరారు. చమన్ పదవీ కాలం ముగియడంతో ఈ స్థానంలో తాత్కాలికంగా వైస్ చైర్పర్సన్ సుభాషిణమ్మను నియమించినట్లు తెలిపారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన సుభాషిణమ్మను అధికారులు, పలువురు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, అనుకోకుండా తనకు వచ్చిన ఈ అవకాశాన్ని ప్రజాసేవకే వినియోగిస్తానన్నారు. బాధ్యతలు అప్పగించిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, శమంతకమణి, జెడ్పీ తాజా మాజీ చైర్మన్ చమన్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని, పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, నగర మేయర్ స్వరూపతో పాటు సీఈఓ శోభాస్వరూప రాణి, డిప్యూటీ సీఈఓ సూర్యనారయణలు పాల్గొన్నారు. -
గుత్తిలో ఎమ్మెల్యేకు చుక్కెదురు
– ఎమ్మెల్యేను చుట్టుముట్టిన జెండా కాలనీవాసులు – కమిషనర్, చైర్ పర్సన్లపై ఎమ్మెల్యే ఆగ్రహం గుత్తి : రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జితేందర్ గౌడ్‌కు కాలనీవాసుల నుంచి చుక్కెదురైంది. పట్టణంలోని జెండావీధిలో నాగరాజు స్టోర్ వద్ద మంగళవారం చంద్రన్న రంజాన్ తోఫా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. రంజాన్ తోఫాను ముస్లింలకు పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమం ముగుస్తున్న సమయంలో ఒక్కసారిగా జెండా వీధి కాలనీవాసులు స్టేజి వద్దకు దూసుకెళ్లారు. రంజాన్ తోఫా సంగతి పక్కన బెట్టండి ముందు కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. ఎమ్మెల్యే నచ్చజెప్పడానికి ప్రయత్నించినా కూడా వినలేదు. గత 15 రోజులుగా కాలనీకి నీళ్లు వదలలేదన్నారు. ఈ రోజు మీరు వస్తున్నారనే కారణంతో హడావుడిగా నీళ్లు వదిలారన్నారని ఆగ్రహించారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే అక్కడే ఉన్న మున్సిపల్ కమిషనర్ ఇబ్రహీం సాబ్, చైర్ పర్సన్ తులశమ్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి సమస్య ఉందని తనకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. మీకు చేత కాకపోతే నాకు చెప్పండి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అప్పటికీ జనాలు శాంతించకపోయే సరికి చేసేది లేక కోపంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
మహిళలపై దాడులు ఆందోళనకరం
తణుకు : ఇటీవల కొంతకాలంగా మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం తణుకు వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం దాడులు పెరుగుతున్నాయని, ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతున్నా కొన్ని వెలుగులోకి రావడంలేదన్నారు. దాడుల విషయంలో ఎవరి ప్రమేయం ఉన్నట్టు రుజువైనా పార్టీలకు సంబంధం లేకుండా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. దాడుల సంఘటనలు వెలుగులోకి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర వహిస్తోందని చెప్పారు. సమాజంలో మార్పు రావాలని, ప్రధానంగా మనిషి వ్యక్తిత్వంలో మార్పు వస్తేనే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని అన్నారు. వివాహ వ్యవస్థలో సైతం మార్పులు అనివార్యమన్నారు. విడాకులతో జీవితాలను నాశనం చేసుకుంటున్న వారికి రాష్ట్రవ్యాప్తంగా మహిళా కమిషన్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గృహహింస చట్టం అమల్లో కొన్ని లోపాలున్నాయని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు సమర్థనీయమన్నారు. కొన్ని చట్టాల్లో లోపాలను సవరించాల్సి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, మునిసిపల్ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్ పాల్గొన్నారు. -
ఔట్సోర్సింగ్ ఉద్యోగి మృతిపై నిరసన
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి మృతి ఉద్రిక్తతకు దారితీసింది. వివరాలు...బెల్లంపల్లికి చెందిన విఘ్నేష్ మున్సిపల్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు బుధవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. అయితే ఇతని మృతికి చైర్పర్సన్, కమిషనర్ వేదింపులే కారణమని ఉద్యోగుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అధికారుల చర్యలను నిరసిస్తూ గురువారం ఉదయం విఘ్నేష్ మృతదేహంతో మున్సిపల్ కార్యాలయం వైపు బయలుదేరారు. అయితే వారిని మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బెల్లంపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. (బెల్లంపల్లి) -
ప్రజల గోడు పట్టదా...
నివేదికల వెల్లడితోనే సరిపుచ్చిన అధికారులు సాదాసీదాగా తొలి స్థాయీ సంఘాల సమావేశం కొన్ని అంశాలకే పరిమితమైన ప్రజాప్రతినిధులు ఖమ్మం జెడ్పీ సెంటర్ : జిల్లా పరిషత్ స్థాయి సంఘాల తొలి సమావేశం తూతూ మంత్రంగానే ముగిసింది. జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నా వాటిపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు ప్రజాప్రతినిధులు ఆసక్తి చూపలేదు. కొందరు మాత్రమే ఆయా మండలాల్లోని పలు అంశాలపై ప్రశ్నించినప్పటికీ అధికారులు మాత్రం చేస్తాం..చూస్తాం.. అంటూ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. దీంతో కొందరు జెడ్పీటీసీ సభ్యులు నిరాశతోనే వెనుదిరగాల్సి వచ్చింది. అయితే పలువురు అధికారులు మాత్రం కొందరు సభ్యులను మండలస్థాయి సమస్యలకు మాత్రమే పరిమితం చేశారు. ఒకానొక దశలో చైర్ పర్సన్ సైతం సమావేశం తీరుపై అనాసక్తి చూపారు. ఎప్పుడు ముగిద్దామనే రీతిలో అధికారులు ఉండడం, సమయాభావం వల్ల స్థాయి సంఘాల సమావేశాన్ని కుదించారు. దీంతో పూర్తిస్థాయిలో సమావేశం జరగలేదు. మరోపక్క స్థాయి సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా హాజరు కాకపోవడం, శాసన మండలి సభ్యుల్లో కేవలం పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాత్రమే హాజరుకావడం గమనార్హం. సమావేశం జరిగిందిలా... తొలుత జెడ్పీ చైర్ పర్సన్ అధ్యక్షతన గ్రామీణ అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరాపథకం తీరు గురించి డీఆర్డీఏ ఏపీడీ వివరించారు. ఆసరా పథకం కింద 3,13,831 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 3,11,545 దఖాస్తులను విచారించి వారిలో 2,14,605 మందిని అర్హులుగా గుర్తించామని, ఇంకా కొంతమంది దరఖాస్తులు విచారణ చేపట్టాల్సి ఉందని, ఇప్పటికే అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేశారని తెలిపారు. దీనిపై ఇల్లెందు, బయ్యారం జెడ్పీటీసీలు చండ్ర అరుణ, గౌని ఐలయ్య మాట్లాడుతూ అర్హులకు కాకుండా అనర్హులకు మాత్రమే పింఛన్లు ఇస్తున్నారని, ఈ పింఛన్లపై కూడా ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా అధికారులు, ఎంపీడీఓలే చూస్తున్నారని అన్నారు. అందుకు స్పందించిన ఏపీడీ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జిల్లాలో తహశీల్దార్, ఎంపీడీఓ, రెవెన్యూ సిబ్బందితో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి గ్రామస్థాయిలో పింఛన్లు అందించేలా చర్యలు చేట్టామని అన్నారు. ఏజెన్సీలోని రిజిస్టర్ సొసైటీల గీత కార్మికులకు పింఛన్ రావడం లేదని, వారికి పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని, సదరం క్యాంప్‌లో 2010 - 11 సంవత్సరంలో వచ్చిన వారికి సైతం పింఛన్లు రావడం లేదని, దీనిపై దృష్టి సారించాలని పలువురు జెడ్పీటీసీలు కోరారు. పాత ఇనుము దుకాణంలో పింఛన్ దరఖాస్తులు... ఇల్లెందు జెడ్పీటీసీ చండ్ర అరుణ మాట్లాడుతూ ఆసరా పింఛన్ కోసం వచ్చిన దరఖాస్తులు పాత ఇనుము దుకాణంలో ప్రత్యక్షమయ్యాయని, అందులో ఆ పాత ఇనుము షాపు యజమాని దరఖాస్తు కూడా ఉందని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన జెడ్పీచైర్‌పర్సన్ ఇలాంటి పొరపాట్లు జరుగకుండా చూడాలని, అర్హులకు మాత్రమే ఆసరా అందేలా అధికారులు చూడాలని అన్నారు. అనంతరం ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సీతామహాలక్ష్మి వివరించారు. దీంతో భూమి పంపిణీకి ఎంత మందిని ఎంపిక చేశారని, ఇప్పటి వరకు ఎంతమందికి భూమిని కొనుగోలు చేశారని జెడ్పీటీసీలు ప్రశ్నించగా 17 ఎకరాల భూమిని ఏడుగురికి అందజేశామని, మిగిలిని వారికి అందిస్తామని ఈడీ సీతామహాలక్ష్మి తెలిపారు. రూ.50వేల డిపాజిట్ చేయాలనడం సరికాదు... రాజీవ్ యువశక్తి పథకం వల్ల యువతకు ప్రయోజనం లేదని, రూ 50వేలు డిపాజిట్ చేయాలనడం సరికాదని, ఇదే పరిస్థితి కొనసాగితే ఆ శాఖ అధికారులు సమావేశానికి రావాల్సిన అవసరం లేదని దుమ్ముగూడెం, బయ్యారం జెడ్పీటీసీలు పేర్కొన్నారు. అనంతరం హౌసింగ్ పీడీవైద్యం భాస్కర్ ఆ శాఖ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. జిల్లాకు రూ.25 కోట్లు విడుదలయ్యాయని, వాటిని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని అన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కల్పించుకుని జాబితాలో ఉన్న అనర్హులకు కూడా నగదు జమ చేశారా..? అని ప్రశ్నింగా హౌసింగ్ పీడీ సరైన సమాధానం ఇవ్వలేదు. ఆయన ఎమ్మెల్సీ అసహనం వ్యక్తం చేశారు. అర్హులకు మాత్రమే అందేలా చూడాలని, అనర్హుల పేర్లు తొలగించాలని ఎమ్మెల్సీ సూచించారు. అనంతరం విద్యవైద్యంపై జరిగిన సమావేశంలో ఆయా శాఖల ప్రగతిని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన ప్రజాప్రతినిధులు విద్యా, వైద్య రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను సక్రమంగా ఖర్చుచేసి ప్రజలకు పథకాలు అందేలా చర్యలుతీసుకోవాలన్నారు. కో ఆప్షన్‌సభ్యులు మౌలానా మాట్లాడుతూ డెంగీ నిర్ధారణకు జిల్లా కేంద్రంలోనే పరికరాలు ఉన్నాయని, మిగతా ప్రాంతాల్లో పరిస్థితులేమిటని ప్రశ్నించారు. కొత్తగూడెం జెడ్పీటీసీ మాట్లాడుతూ 2009లో సదరం వారికి ఇప్పటి వరకు సర్టిఫికెట్లు ఇవ్వలేదని అన్నారు. టేకులపల్లి జెడ్పీటీసీ మాట్లాడుతూ డబ్బులు తీసుకుని అనర్హులకు సర్టిఫికెట్లు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, సదరంలో పారదర్శకత పాటించాలని అన్నారు. వ్యవసాయ కమిటీ సమావేశం జెడ్పీ వైస్ చైర్మన్ బరపటి వాసుదేవ అధ్యక్షతన, మహిళా సంక్షేమ స్థాయి కమిటీ సమావేశం తోటమల్ల హరిత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జెడ్పీటీసీలు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయడం లేదని, మహిళా ప్రాంగణం అస్తవ్యస్తంగా ఉందని, సిబ్బంది లేక సక్రమంగా శిక్షణ ఇవ్వడం లేదని అన్నారు. సాంఘిక సంక్షేమ స్థాయి కమిటీ సమావేశం అసావత్ లక్ష్మి అధ్యక్షతన జరిగింది. అనంతరం పంచాయతీ రాజ్ ఎస్ఈ గంగారెడ్డి పీఆర్ శాఖలో చేపడుతున్న అభివృద్ధి పనులు వివరించారు. మార్చిలోగా అన్ని పనులు పూర్తి చేస్తామని వివరించారు. ఆర్అండ్బీ ఎస్ఈ సతీష్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఆర్అండ్బి శాఖ ద్వారా చేపడుతున్న పలు అభివృద్ధి పనులను వివరించారు. వైరా జెడ్పీటీసీ బొర్రా ఉమాదేవి మాట్లాడుతూ వైరాలోని ఆర్అండ్బి ప్రధాన రహదారి అధ్వానంగా ఉందని ఎస్ఈ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి స్పందించిన ఆయన ఆ రహదారిపై నీరు నిల్వ ఉండడం వల్ల దెబ్బతిన్నదని, డ్రెయిన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. తీర్మానిలివే.. సక్సెస్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో చదివిన ఉపాధ్యాయులను మాత్రమే నియమించేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలనీ తీర్మానించారు. రూ.50వేల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికే రాజీవ్ యువశక్తి పథకం కింద బ్యాంక్ కాన్సెంట్ ఇస్తున్నారని, దీంతో ఆ పథకం నీరుగారుతోందని, వార్షికాదాన్ని రెండు లక్షలకు పెంచాలని తీర్మానించారు. ఎన్ఆర్ఈజీఎస్లో పని దినాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చూస్తోందని, పని దినాలు యధావిథిగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి సిఫార్సు చేయాలని తీర్మానించారు. ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపడుతున్న పనుల్లో ప్రత్యేక విజిలెన్స్ కమిటీని కలెక్టర్ నియమించటం వల్ల నిధులు రాక ఇబ్బందులు పడాల్సి వస్తోందని, అన్ని వర్కులపై విచారణ జరుపకుండా నాణ్యతా ప్రమాణాలు లేని వాటిపై విచారణ జరిపేలా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. -
నెల్లూరు ఎన్నిక.. ప్రజాస్వామ్యానికే పరీక్ష
-
నెల్లూరు చైర్మన్ ఎన్నిక వాయిదా!
-
'ఇంతకంటే అప్రజాస్వామికం మరోటి లేదు'
-
ఎటు పోతున్నాయి ప్రజాస్వామ్య విలువలు?
-
'ఆ టీడీపీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయండి'
-
'ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయమని కోరతాం'
-
'రాష్ట్రపతి పాలనను విధించమని కోరతాం'
-
ఎటుపోతోంది ప్రజాస్వామ్యం ?!